BigTV English
Advertisement

OTT Movie : బొమ్మను బలవంతం చేసే మెంటలోడు… దిమ్మతిరిగే క్లైమాక్స్ ట్విస్ట్

OTT Movie : బొమ్మను బలవంతం చేసే మెంటలోడు… దిమ్మతిరిగే క్లైమాక్స్ ట్విస్ట్

OTT Movie : ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లు పోటీపడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని స్టోరీలు ఊహకు అందని విధంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లో, ప్రపంచం అంతా అంతమైపోతే ఒక్కడు మాత్రం మిగులుతాడు. ఆ తర్వాత అతడు పడే పాట్లు ఒకవైపు నవ్వు తెప్పిస్తూ, మరోవైపు ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


డిస్ని + హాట్ స్టార్ (Disney + hotstar) లో

ఈ అమెరికన్ అపోకలిప్టిక్ వెబ్ సిరీస్ పేరు ‘ది లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్’ (The Last Man on Earth). దీనికి విల్ ఫోర్టే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ మార్చి 1, 2015 నుండి మే 6, 2018 వరకు ఫాక్స్ టెలివిజన్ నెట్‌వర్క్‌లో ప్రసారమైంది. ఇది నాలుగు సీజన్లలో మొత్తం 67 ఎపిసోడ్‌లను కలిగి ఉంది. ఈ కథ ఒక వైరస్ మానవ జాతిని దాదాపు పూర్తిగా నాశనం చేసిన తర్వాత, జీవించి ఉన్న కొద్దిమంది వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. డిస్ని + హాట్ స్టార్ (Disney + hotstar) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఒక ఘోరమైన వైరస్ భూమి మీద వ్యాపించి, దాదాపు అందరినీ చంపేస్తుంది. ఫిల్ మిల్లర్ అనే సాధారణ వ్యక్తి, ఒకప్పుడు తన కుటుంబాన్ని బాగా ప్రేమించేవాడు. ఇప్పుడు ఈ భూమిపై చివరి మనిషిగా మిగిలిపోయానని అనుకుంటాడు. ఆ వైరస్ బారిన ఇతని ఫ్యామిలీ కూడా పడుతుంది. ఇప్పుడు అతను తనకు తెలిసిన ప్రదేశాలన్నీటిని తిరుగుతాడు. ఎవరైనా బతికి ఉన్నవారి కోసం వెతుకుతాడు. అయితే, ఎవరూ దొరకకపోవడంతో, అతను తన స్వస్థలమైన టక్సన్, అరిజోనాకు తిరిగి వస్తాడు. అక్కడ అతను ఒంటరిగా జీవితాన్ని గడపడం ప్రారంభిస్తాడు. తన చుట్టూ ఉన్న విలాసవంతమైన వస్తువులతో ఆనందం పొందుతూ ఉంటాడు. కానీ అతను ఒంటరితనంతో బాధపడుతూ ఉంటాడు. కోరికలను చంపుకోలేక ఒక బొమ్మతో రొమాన్స్ చేస్తాడు. ఫిల్ తన ఒంటరితనాన్ని భరించలేక ‘అలైవ్ ఇన్ టక్సన్’ అని రాసిన పోస్టర్లను కూడా అతికిస్తాడు. అతను ఒక ఖాళీ మాన్షన్‌లో స్థిరపడి, మ్యూజియంల నుండి దొంగిలించిన కళాఖండాలు, షాపింగ్ మాల్ నుండి తెచ్చిన వస్తువులతో తన జీవితాన్ని గడుపుతాడు.

అయితే, అతని జీవితం ఒకరోజు అనూహ్యంగా మారుతుంది. కరోల్ అనే మహిళ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. కరోల్ ఒక వింత స్వభావం, నియమాలను పాటించే వ్యక్తి. ఆమె ఫిల్‌తో పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఆమె భూమిని మళ్లీ జనాభాతో నింపాలని కోరుకుంటుంది. కానీ ఫిల్ మాత్రం ఆమెతో సహజీవనం చేయడానికి కష్టపడతాడు. ఫిల్, కరోల్ కలిసి జీవించడం ప్రారంభించిన తర్వాత, వారి జీవితంలో మరికొందరు బతికి ఉన్నవారు చేరతారు. ఈ చిన్న సమూహం కలిసి జీవించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారి వ్యక్తిగత వైరుధ్యాలు, విభిన్న స్వభావాలు వారి మధ్య గందరగోళం మొదలౌతుంది. కానీ క్రమంగా ఫిల్ మంచి వ్యక్తిగా మారే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఈ సమూహం జనాభాను పెంచే ప్రయత్నం చేస్తారా ? లేక అలాగే ఉంటారా ? అనేది మీరుకూడా తెలుసుకోవాలంటే, ఈ వెబ్ సిరీస్ ను చూడండి.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×