Tariff War Canada Justin Trudeau| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ట్రంప్‌తో జరిగిన చర్చలు నిర్మాణాత్మకంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో కెనడా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం సంభవించే అవకాశం ఉందని ట్రూడో అంచనా వ్యక్తం చేశారు. అమెరికా సుంకాల అమలును నెలరోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు సూచనలు ఇచ్చిన విషయాన్ని ట్రూడో స్వాగతించారు. అదే సమయంలో కెనడా తరఫు ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని కూడా స్పష్టం చేశారు.
“టారిఫ్ల విషయంలో ఇరు దేశాలు చర్చలు జరిపాయి. కార్మిక, నిర్దిష్ట రంగాలపై ఈ సుంకాల ప్రభావం తగ్గించేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయి. అయితే, అమెరికా కెనడా వస్తువులపై విధించిన సుంకాలు ఎత్తివేసే వరకు మేము ప్రతీకార సుంకాలను రద్దు చేయాలనుకోవడం లేదు,” అని ట్రూడో స్పష్టం చేశారు.
Also Read: సొంత పౌరుల మీదే బాంబు దాడి – దక్షిణ కొరియా సైన్యం స్పందనేంటి.?
కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ విధించిన సుంకాలు ఈ దేశాలతో వాణిజ్య యుద్ధానికి దారి తీసాయి. దీనికి ప్రతిస్పందనగా ఈ దేశాలు కూడా ప్రతీకార సుంకాలు విధించాయి. ఈ సందర్భంగా ట్రూడో ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రూడో తన అధికారాన్ని కొనసాగించుకోవడానికి సుంకాల వివాదాన్ని ఉపయోగించుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు.
సుంకాల సాకుతో ఎన్నికలు లేకుండా ట్రూడో అధికారంలో కొనసాగుతున్నారు : ట్రంప్
అమెరికా-కెనడా మధ్య సుంకాల వివాదం కొనసాగుతోంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫోన్ ద్వారా సుమారు 50 నిమిషాలు పాటు మంగళవారం మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో ఫెంటనిల్ డ్రగ్ అక్రమ రవాణా, సుంకాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. దీని గురించి ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ పోస్ట్ లోనే ద్వారానే ట్రంప్.. ట్రూడో తన అధికారాన్ని కొనసాగించుకోవడానికి సుంకాల వివాదాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కెనడాలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారని తాను అడిగినప్పటికీ ఆ విషయంపై ట్రూడో స్పష్టత నివ్వలేదని చెప్పారు.
కెనడా ప్రధన మంత్రి జస్టిన్ ట్రూడో రెండు నెలల క్రితమే తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగేంత వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు.
ట్రంప్ తన పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకాలు విధించారు. దీనికి ప్రతిగా ట్రూడో కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. ఇరువురు నేతలు ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం గమనార్హం. ఇంతలో.. ట్రూడో తన పార్టీ నాయకత్వానికి ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
మరోవైపు ట్రంప్ ఉక్రెయిన్‌కు అందుతున్న ఇంటెలిజెన్స్ సాయాన్ని తగ్గిస్తున్నారు. రష్యా భూభాగంలో డ్రోన్ దాడులు నిర్వహించడానికి సహాయపడే కీలక డేటాను అందించడం నిలిపివేయాలని నిర్ణయించారు. ఇటీవల ఉక్రెయిన్‌కు అందుతున్న సైనిక సహాయాన్ని కూడా తగ్గించారు.