Thandel Collections : హీరో నాగ చైతన్య హిట్ ఖాతా ఓపెన్ అయ్యింది. గత కొన్నేళ్లుగా హిట్ సినిమా కోసం వెయిట్ చేసిన చైతూకు తండేల్ మూవీ భారీ విజయాన్ని అందించింది. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ మూవీ నిజ జీవితాలను ఎలా మలుపు తిప్పింది అనే కోణంలో కథను చూపించాడు డైరెక్టర్ చందు మొండేటి.. ప్రతి సీన్ ఎమోషనల్ గా ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. దాంతో సినిమా వచ్చి రెండు వారాలు అవుతున్న కూడా థియేటర్లకు జనం రాక ఆగడం లేదు. కలెక్షన్ల జోరు తగ్గలేదు. ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ మూవీ బాక్సఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేస్తూ రూ. 120 కోట్లు వసూల్ చేసింది. ఇక ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ థియేటర్లలో దుమ్ము దులిపేస్తోంది. కనీ వినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో విడుదలైన ఈ సినిమా అదరగొడుతోంది. అంచనాలకు మించి సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో కెవ్వుమనిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. తండేల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ రాబట్టి అబ్బురపరచింది. పది రోజుల్లో 120 కోట్లు వసూల్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకుంది.. ఈ మూవీలో చైతన్య మత్స్యకారుడి పాత్రలో నటించి అదరగొట్టేశాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. లవ్, ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది..
Also Read :పోలీసుల అదుపులోకి మంచు మనోజ్.. అసలేం జరిగింది..?
ఇక ఒకసారి కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి రోజు నుంచి అదే జోరులో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. పాజిటివ్ టాక్ ను అందుకోవడం తో పాటుగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి, హీరో నాగ చైతన్య కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలించింది.. అదే జోరు రెండో రోజు కూడా కొనసాగింది. రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ. 22 కోట్లు. ఇక నాలుగవ రోజు రూ. 10 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఐదో రోజు కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ 5 డే రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూల్ చెయ్యగా, ఎనిమిది రోజులకు 90.12 కోట్లు వసూల్ చేసింది.. తొమ్మిది రోజుల్లోనే 100 కోట్లను వసూల్ చేసి మంచి రికార్డును సొంతం చేసుకుంది. అలాగే పది రోజులకు 120 వసూల్ చేసింది. ఇక ఇదే జోరు కొనసాగితే మాత్రం 200 కోట్లు కూడా వసూల్ చేసే అవకాశం ఉందని టాక్.