E-Paper
Advertisement

ఆ ఇంటిపై సూర్యరశ్మి పడితే అంతే సంగతులు… ఒళ్ళు గగుర్పొడిచే హార్రర్ మావా

ఆ ఇంటిపై సూర్యరశ్మి పడితే అంతే సంగతులు… ఒళ్ళు గగుర్పొడిచే హార్రర్ మావా
Advertisement

Horror Movie OTT : దెయ్యం సినిమాలు రక రకాల కంటెంట్ తో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు క్లైమాక్స్ తో బైండ్ బ్లాక్ చేస్తుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇది రక్తం ఏరులై పారే రౌడీ సినిమా కాదు, అలాగని మూతి ముడుచుకునే లవ్ స్టోరీ అసలే కాదు. ఇది సచ్చినోళ్లకి, బతికున్నోళ్లకి మధ్య జరిగే ఒక మైండ్ గేమ్. సింపుల్‌గా చెప్పాలంటే, దెయ్యం సినిమానే కానీ, ఆ దెయ్యం ఎవరు? ఎక్కడుంది? అన్నదే ఈ సినిమా అసలు మజా. మనల్ని భయంకరమైన మొహాలతో భయపెట్టకుండా, కేవలం ఆ చీకటి గదులు, ఆ నిశ్శబ్దంతోనే వెన్నులో వణుకు పుట్టించే రకం సినిమా ఇది. ఇక సినిమా మొత్తం ఒకెత్తు అయితే, లాస్ట్ పది నిమిషాలు ఇంకొక ఎత్తు. అరేయ్! ఏంట్రా ఇది? మనం ఏం చూస్తున్నాం? అని గుడ్లప్పగించి చూసేలా ఉంటుంది క్లైమాక్స్. ఎప్పుడూ రొటీన్ దెయ్యం కథలు చూసి బోర్ కొట్టిన వాళ్లకి, ఈ సినిమా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2001లో వచ్చిన ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది అదర్స్’ (The Others). ఈ సినిమాకు అలెజాండ్రో అమెనాబార్ దర్శకత్వం వహించారు. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా కేవలం 17 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా 210 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. హారర్ సినిమాల్లో సాధారణంగా ఉండే రక్తం, భయంకరమైన దెయ్యాలు లాంటివి లేకుండా, కేవలం లైటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్‌తోనే ప్రేక్షకులను భయపెట్టడం ఈ మూవీ ప్రత్యేకత. ఇది స్పానిష్ ‘గోయా అవార్డ్స్’లో ఎనిమిది అవార్డులను గెలుచుకోవడమే కాకుండా, ఉత్తమ చిత్రంగా అవార్డు పొందిన మొదటి ఆంగ్ల భాషా చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. నికోల్ కిడ్మాన్ నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ఆమెకు దీని ద్వారా గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ కూడా లభించింది. అలాగే హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాలోని క్లైమాక్స్ ట్విస్ట్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే, ఇప్పటికీ ప్రపంచంలోని బెస్ట్ సస్పెన్స్ సినిమాల జాబితాలో ఇది తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

గ్రేస్ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక పాత బంగళాలో నివసిస్తుంటుంది. ఆమె పిల్లలకు సూర్యరశ్మి అస్సలు పడదు, అందుకే ఆ ఇల్లు ఎప్పుడూ చీకటిగా, తలుపులన్నీ మూసి ఉంటుంది. ఆమె భర్త కూడా యుద్ధానికి వెళ్లి ఇంకా తిరిగి రాడు. ఆ సమయంలో ముగ్గురు కొత్త పనివాళ్లు అక్కడ పనికి చేరుతారు. అయితే వాళ్ళు వచ్చినప్పటి నుండి ఆ ఇంట్లో వింత శబ్దాలు రావడం, ఎవరో తిరుగుతున్నట్లు అనిపించడంతో గ్రేస్ ఆందోళన చెందుతుంది. తమ ఇంట్లో ఏవో ఆత్మలు ఉన్నాయని, అవి తమను ఇబ్బంది పెడుతున్నాయని గ్రేస్ కు అనిపిస్తుంది. దీంతో తన పిల్లలను రక్షించుకోవడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేస్తుంది.

Also Read : హంతకుడు లేని మర్డర్ మిస్టరీ… అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Advertisement

ఆ క్రమంలో పనివాళ్ల ప్రవర్తన కూడా ఆమెకు అనుమానాస్పదంగా అనిపిస్తుంది. దీంతో ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో తెలియక ఆమె సతమతమవుతుంది. ఇక సినిమా చివరలో వచ్చే ట్విస్ట్ తో అందరి మైండ్లు బ్లాక్ అవుతాయి. ఆ ఇంట్లో ఆత్మలుగా తిరుగుతున్నది గ్రేస్, ఆమె పిల్లలే. గతంలో ఒకానొక పరిస్థితుల్లో గ్రేస్ తన పిల్లలను చంపి, తను కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ ఆ విషయం ఆమెకు గుర్తుండదు. ఆ ఇంట్లో కొత్తగా చేరిన మనుషులనే వీళ్లు దెయ్యాలు అనుకుంటారు. చివరికి ఈ కథ ఎలా ముగుస్తుందనేది సినిమా చూసి తెలుసుకోండి.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×