OTT Movie : మలయాళం సినిమాలకు క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు వివాదాల కారణంగా కూడా పేరు తెచ్చుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, తాత్విక అంశాలు, వివాదాస్పద సన్నివేశాల కారణంగా గుర్తింపు పొందింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), మొదట ఈ చిత్రంలోని మూడు సన్నివేశాలలో బో*ల్డ్ కంటెంట్ కారణంగా భారతదేశంలో నిషేధించింది. దర్శకులు ఈ నిషేధాన్ని కోర్టులో సవాలు చేయగా, హైకోర్టు ఎటువంటి కట్స్ లేకుండా సినిమాకు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చి విడుదలకు అనుమతించింది. ఈ మలయాళం సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఎందులో ఉందంటే
‘ది పెయింటెడ్ హౌస్’ (The Painted House) ఒక మలయాళం డ్రామా చిత్రం. ఇది సతీష్ బాబుసేనన్ సోదరుల దర్శకత్వంలో వచ్చిన మొదటి ఫీచర్ ఫిల్మ్. ఈ చిత్రంలో కె. కలాధరన్ గౌతమ్‌గా, నేహా మహాజన్ విశయగా, అక్రమ్ మహ్మద్ రాహుల్‌గా నటించారు. ప్రధానంగా మలయాళం, ఇంగ్లీష్‌లో తీసిన ఈ సినిమాకు హిందీ (రంగీన్ ఘర్), తమిళం (వానం పూసిన వీడు) డబ్బింగ్ వెర్షన్‌లు కూడా ఉన్నాయి. ఈ చిత్రం 2015 డిసెంబర్ 4న విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే
ఈ కథ గౌతమ్ అనే వృద్ధుడైన రచయిత చుట్టూ తిరుగుతుంది. అతను ఒంటరి జీవితాన్ని గడుపుతూ, తనను తాను “మంచి మనిషి”గా భావిస్తాడు. అయితే అతని ఆలోచనలు మాత్రం వేరుగా ఉంటాయి. గౌతమ్ కఠోపనిషత్ లోని నచికేతస్ అనే పాత్ర నుండి స్ఫూర్తి పొంది, మరణం అర్థాన్ని అన్వేషించే ఒక నవలను రాస్తుంటాడు. ఇప్పుడు కథ ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. గౌతమ్‌కు ఈ నావెల్ రాస్తుండగా గుండెపోటు రావడంతో అతను అలా కూర్చుండిపోతాడు. అదే సమయంలో, డోర్‌బెల్ మోగడంతో తలుపు తీస్తాడు. విశయ అనే ఒక అందమైన యువతి, ఆ రాత్రి ఉండడానికి రిక్వెస్ట్ చేస్తుంది. గౌతమ్ ఆమె ఆమె అందానికి మైమరచి, ఇంట్లో ఉండటానికి అనుమతిస్తాడు. మరుసటి రోజు రాహుల్ అనే ఒక యువకుడు కూడా సహాయం కోసం వస్తాడు.ఈ పరిచయంతో గౌతమ్‌ను రాహుల్ తన వద్దకు రమ్మని అడుగుతుంటాడు.
చివరికి అతన్ని బలవంతంగా ఒక కొండపై ఉన్న ఒక పాడుబడిన, విశాలమైన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ ఇంటిలో విశయ కూడా కనిపిస్తుంది. ఆమె రాహుల్ పార్ట్నర్ గా ఉంటూ, గౌతమ్‌ను కిడ్నాప్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. వీళ్ళు గౌతమ్‌ను కిడ్నాప్ ఎందుకు చేశారో కారణాన్ని ఎప్పుడూ వివరించరు. ఇది గౌతమ్‌ను గందరగోళంలో ముంచెత్తుతుంది.ఈ ఇంటిలో గౌతమ్ తన జీవితం, రచన, అతని తాత్విక ఆలోచనలలో మునిగిపోతాడు. క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఈ కిడ్నప్ ఎందుకు చేశారో తెలుస్తుంది. విశయ, రాహుల్ ఈ కిడ్నాప్ ఎందుకు చేస్తారు ? దీనికి గల కారణం ఏమిటి ? గౌతమ్ ఏమవుతాడు ? అతని గతం ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : భర్త ఇంట్లో ఉండగానే భార్య మాజీ లవర్ ఎంట్రీ… నెక్స్ట్ ట్విస్టుకు బుర్రపాడు… కడక్ డార్క్ కథ మావా