Brahmamudi serial today Episode: అమెరికా వెళ్తున్నట్టు రాజ్ లగేజీ తీసుకుని బయటకు కారు దగ్గరకు వెళ్లగానే.. వైదేహి వెళ్లి నీకు ఇంకా గతం కూడా గుర్తుకు రాలేదు ఈ టైంలో నువ్వు అమెరికా వెళ్లడం బాగోదేమో అల్లుడుగారు అంటాడు. వీళ్లందరూ నన్ను బాగా నమ్మేశారు. కానీ ఆ కళావతి ఏంటి ఇంకా రాలేదు.. అని రాజ్ మనసులో అనుకుంటాడు. వెళ్లనివ్వు మామ్ అక్కడికి వెళ్లాకైనా బావకు అన్ని గుర్తుకు వస్తే అదే చాలు అంటుంది యామిని. నువ్వొక్కదానివే నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు యామిని అంటాడు రాజ్. అంటే మేము నిన్ను అర్థం చేసుకోలేదు అంటావా..? అనుకుంటూ ఇంద్రాదేవి, అపర్ణ వస్తారు.
వాళ్లను చూసిన రాజ్ షాక్లో ఇదేంటి కలావతి గారు వస్తారనుకుంటే ఈ ముసలి బ్యాచ్ వచ్చిందేంటి..? అని మనసులో అనుకుంటాడు. చెప్పరా మేము నిన్ను అర్థం చేసుకోలేదా..? అమ్మా అమ్మా అంటూ తిరిగావే ఇదేనా కొడుకుగా నువ్వు చేసే పని అంటుంది. మీరు నన్ను దత్తత తీసుకోండి నేను మీ మనవడిగా తోడుగా ఉంటానన్నావు ఇదేనా తోడుగా ఉండటం అంటే అని ఇంద్రాదేవి అడుగుతుంది. కళావతి ఏదో అందని కోపంతో ఊరు వదిలి వెళ్లాలని డిసైడ్ అయ్యావు.. మరి మా గురించి ఒక్కసారైనా ఆలోచించావా..? అని అపర్ణ అడుగుతుంది. అదంతా కాదురా మా కళావతిని పెళ్లి చేసుకుని తీరుతానన్నావు.. శపథం చేశావు. ఒప్పించే వరకు వదిలిపెట్టను అన్నావు.. ఇదేనా నువ్విచ్చిన మాటకు ఉన్న విలువ. ఇలా మధ్యలో వదిలేసి వెళ్లిపోతావా… అని ఇంద్రాదేవి అడుగుతుంది.
దీంతో యామిని కల్పించుకుని వెళ్లకుండా ఎలా ఉంటాడు అమ్మమ్మ తనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తుంది. మా బావ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన వెంట తిరగాలా..?మీ మనవరాలికి అవసరం అన్నప్పుడు మా బావ వెంట ఎంత తిరిగింది. ఆఫీసులో అవసరం ఉందన్నప్పుడు బాస్‌లా నటించడానికి మా బావ ఎంత రిస్క్ తీసుకున్నాడు. అవన్నీ గుర్తు లేవా మీ కళావత గారికి అంటూ ప్రశ్నిస్తుంటే.. రాజ్ కంగారుగా ఇందేంటి ఇలా మాట్లాడుతుంది. నేనేదో కళావతి గారి మనసులో మాట బయటపెట్టడానికి నాటకం ఆడుతుంటే.. ఇది మొత్తం చెడగొట్టేలా ఉందేంటి అని మనసులో అనుకుంటాడు. ఇంతలో అపర్ణ కోపంగా యామిని తిడతుంది. దీంతో రాజ్ నిజంగానే నా మీద ప్రేమ ఉండి ఉంటే.. ఇవాళ తను వచ్చేది మీరు వచ్చే వాళ్లు కాదు అంటూ రాజ్ చెప్తాడు. దీంతో అపర్ణ, ఇంద్రాదేవి రాజ్‌ను కన్వీన్స్ చేయాలని చూస్తారు. కానీ రాజ్ కన్వీన్స్ కాడు.. కారెక్కి వెళ్లిపోతాడు.
మరోవైపు రాజ్ ఫోటో చేతిలో పట్టుకుని ఏడుస్తుంది కావ్య. మరోవైపు యామిని పాటలు వింటూ హ్యాపీగా ఉంటుంది. వైదేహి వచ్చి నువ్వేంటి ఇంత ఆనందంగా ఉన్నావు.. రాజ్ అమెరికాకు వెళ్లిపోతున్నాడని బాధపడుతూ ఉంటావనుకున్నాను రాజ్ వెళ్లిపోతుంన్నందుకు నీకు బాధగా లేదా అని అడుగుతుంది. బాధ ఎందుకు మామ్ బావ ఏమైనా నాకు దూరం అవ్వడానికి వెళ్తున్నాడా..? నాకు ఇంకా దగ్గరవుతున్నాడు. కాదు ఆ కావ్యే నాకు దగ్గర అయ్యేలా చేస్తుంది. మామ్ అందుకే ఈ హ్యాపీ అని చెప్తూ ఒక్క నిమిషం ఆ కావ్యకు ఫోన్ చేస్తాను అంటుంది. ఇప్పుడు దానికి ఎందుకే.. అని వైదేహి అడగ్గానే.. ఎందుకు అంటావేంటి మామ్ .. నాకు ఇంత ఫేవర్ చేస్తున్న కావ్యకు కనీసం థాంక్స్ కూడా చెప్పకపోతే పాపం ఫీల్ అవుతుంది కదా..? అంటూ కాల్ కలుపుతుంది.
కావ్యతో వెటకారంగా మాట్లాడుతుంది. ఈ సారి నీ కారణంగానాకు మంచి జరుగుతుంది. బావను అమెరికా వెళ్లేలా చేసినందుకు థాంక్స్ అని చెప్తుంది. ఇన్ని రోజులు నీ కారణంగానాకు దూరమైన బావకు నీ కారణంగానే నేను బావకు దగ్గర అవబోతున్నాను.. అంటూ థాంక్స్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. కావ్య ఏడుస్తూ దేవుడి దగ్గరకు వెళ్లి రాజ్‌కు నిజం చెప్తానని ఇక ఏం జరిగినా నీదే బాధ్యత అని చెప్పి కావ్య రాజ్ దగ్గరకు బయలుదేరుతుంది. కారులో వెళ్తూ కాల్ చేస్తే రాజ్ కట్ చేస్తాడు. మరోవైపు రుద్రాణి ఎయిర్‌ఫోర్ట్‌కు బయలుదేరుతుంది. కావ్య కంటే ముందే తాను రాజ్‌ను కలిసి నిజం చెప్పి వాళ్లిద్దరినీ శాశ్వతంగా దూరం చేయాలి అనుకుంటుంది. ఇంతలో రాజ్ రోడ్డు పక్కన కారు ఆపేసి ఫోన్ మాట్లాడినట్టు నటిస్తుంటే.. రుద్రాణి వెళ్లి రాజ్‌కు నిజం చెప్పాలనుకుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం