Tollywood Heroine : తెలుగు సినీ ఇండస్ట్రీలో అదృష్టం కలిసిరావాలే కానీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొందరి లక్ వల్ల సినిమా ఒకటి సెట్స్ మీద ఉండగానే రెండో సినిమా కోసం రెడీ అవుతున్నారు. హీరోలే కాదు హీరోయిన్లు కూడా వరుస సినిమాలతో బిజి అవుతున్నారు. ఆ హీరోయిన్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడితే మరికొందరు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకనే డౌట్ రావచ్చు.. అందుకు కారణం కూడా ఉంధి. ఓ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు వరుస సినిమాల తో బిజీగా ఉంది. ఇప్పుడు ఇద్దరు హీరోల సినిమాలను ఒప్పుకొని ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాను అని ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు సినిమా ల్లో బిజీగా ఉంది. గత కొన్నేళ్లు గా సరైన హిట్ మూవీ ఆమె ఖాతాలో లేదు. దాంతో ఈ అమ్మడు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలని అందుకుంది. ప్రభాస్, పవన్ కల్యాణ్ లనే నమ్ముకుని ఉంది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. గత మూడేళ్లుగా ఈ అమ్మడు కొత్త సినిమాలు చెయ్యలేదు.. హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్ మరియు రాజా సాబ్ మూవీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రెండు సినిమాల ను ఒకేసారి మ్యానేజ్ చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలు రిలీజైన తర్వాత ఖచ్చితంగా తన కెరీర్ మలుపు తిరుగుతుందని నిధి ధీమాగా ఉంది.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె సినిమాల విషయం పై సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అది వైరల్ గా మారాయి.
ఆమె ఏమందంటే.. ప్రభాస్, పవన్ సినిమా షూటింగుల్లో ఎలాంటి దారుణ పరిస్థితిని ఫేస్ చేసిందనేదనేది వివరించింది. విజయవాడ, హైదరాబాద్ మధ్య ట్రావెల్ చేస్తూ నిద్ర లేకుండా మారిన తన స్థితిని ఆమె వివరించింది. దాదాపు గా రెండు నెలల పాటుగా షూటింగ్ లకు అటెండ్ అవుతూ బిజీ అయినట్లు ఆమె చెప్పింది. డేట్స్ మార్చుకునే అవకాశం లేకపోవడంతో, రెండు సినిమాలను మ్యానేజ్ చేస్తూ షూటింగ్స్ చేశాను. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను.. ఇది అదృష్టం ఎలా ఉంటే అలానే వస్తుంది. కష్ట పడితే ఫలితం దక్కుతుంది అని నమ్ముతున్నాను మరి నాకు ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో చూడాలని ఆమె అన్నారు. ఇక ఈ మూవీలు షూటింగ్ దశలో బిజీగా ఉన్నాయి.. ఈ ఏడాది సమ్మర్ కు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. చూడాలి అమ్మడు జాతకం ఎలా మారుతుందో.. ఈ సినిమాలు భారీ అంచనాలతో రాబోతున్నాయి. మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి..