Survival Thriller OTT : అడవికి దగ్గరగా ఉన్న ఓ గ్రామంలో ఒక్కసారిగా భారీ కొండచిలువ బీభత్సం సృష్టిస్తుంది. పశువులపై దాడులు చేస్తూ, మనుషుల ప్రాణాలకూ ముప్పుగా మారుతుంది. అలాంటి టైమ్ లో గ్రామస్థులు ఏం చేయాలి ? ఆ ప్రమాదకరమైన జీవిని చంపేందుకు కేవలం మూడు రోజులే గడువు ఇచ్చి, లేదంటే గ్రామమంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ అధికారి హెచ్చరిస్తే ? ఒకవైపు ప్రాణాంతకమైన కొండచిలువ, మరోవైపు అధికారుల బెదిరింపులు… ఈ రెండు ప్రమాదాల మధ్య చిక్కుకున్న గ్రామస్థుల పోరాటమే చైనా యాక్షన్ థ్రిల్లర్ ‘పైథాన్’ (The Python). మరి ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు ? అంటే…
ఈ చిత్రంలో పేయ్ యువాన్ అనే వ్యక్తి మెయిన్ లీడ్. అతను నివసించే గ్రామంలో ఓ భారీ కొండచిలువ కలకలం సృష్టిస్తుంది. దాని దాడులతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా సాగాల్సిన గ్రామీణ జీవితం ఒక్కసారిగా ప్రాణాలను కాపాడుకోవడానికి చేసే పోరాటంగా మారిపోతుంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిన అధికారులు కూడా గ్రామస్థులకు ఊరటనివ్వరు. కొండచిలువను మూడు రోజుల్లో చంపాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ క్రూరమైన అధికారి హెచ్చరిస్తాడు.
దీంతో గ్రామస్థులకు గడువు లోపల ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు తమ ప్రాణాలను కాపాడుకోవాలి, మరోవైపు అధికారుల ఆదేశాలను పాటించాలి. ఈ రెండింటి మధ్య వారు నలిగిపోతారు. పేయ్ యువాన్కు ఇదో పెద్ద తలనొప్పిగా మారుతుంది. గ్రామస్థులను రక్షించాలంటే ఆ భారీ కొండచిలువను ఎదుర్కోవడం తప్పదు. కానీ సాధారణ ఆయుధాలతోనే దానిని నిలువరించడం సాధ్యమవుతుందా ? దాని దాడుల నుంచి తప్పించుకుంటూ, దానిని ఎదుర్కొనే సరైన మార్గాన్ని కనుగొనడం అంత సులభం కాదు. భయంతో వెనక్కి తగ్గుతున్న గ్రామస్థులకు ధైర్యం చెప్పడంతో పాటు, ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా అతను ఆలోచిస్తాడు.
గ్రామంపై అధికారాన్ని చెలాయించే వ్యక్తి ప్రజల భయాన్ని అర్థం చేసుకుని వారికి సహాయం చేయాల్సిన సమయంలో, గడువు విధించి వారిని మరింత ఒత్తిడికి గురి చేస్తాడు. దీంతో గ్రామస్థులు ప్రకృతి సృష్టించిన ప్రమాదంతో పాటు, మనుషుల వల్ల ఎదురయ్యే క్రూరత్వాన్ని కూడా భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పేయ్ యువాన్ తీసుకునే నిర్ణయాలు, గ్రామాన్ని కాపాడేందుకు చేసే ప్రయత్నాలు కథలో ఉత్కంఠను పెంచుతాయి. తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలనే కోరికతో పాటు, తన చుట్టూ ఉన్నవారి ప్రాణాలకు రక్షణ కల్పించాలనే బాధ్యత అతనిపై ఉంటుంది. గడువు ముగిసేలోపు కొండచిలువను ఎదుర్కోగలడా? గ్రామస్థులందరినీ ప్రమాదం నుంచి బయటపడేయగలడా? మూడు రోజుల గడువులో పేయ్ యువాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? గ్రామస్థులను కాపాడేందుకు అతను ఏం చేస్తాడు? ప్రకృతి సృష్టించిన ప్రమాదాన్ని, అధికారుల బెదిరింపులను ఒకేసారి ఎదుర్కొని గ్రామాన్ని రక్షించగలడా? అన్నదే ఈ కథలో చూడాల్సిన ఉత్కంఠభరితమైన అంశం.
Also Read : ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ
‘పైథాన్’ 2021లో విడుదలైన చైనా యాక్షన్ థ్రిల్లర్. డై యిలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం జియోహాట్స్టార్ (Jio Hotstar)లో తెలుగులో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నామెన్ ఎర్డెని (Namen Erdeni), జియాంగ్ మెంగ్షువాన్ (Jiang Mengxuan), ఎరికా మ్యూస్ (Erica Muse) తదితరులు నటించారు. భారీ కొండచిలువ దాడులు, గ్రామస్థుల మనుగడ కోసం జరిగే పోరాటం, అధికారుల ఒత్తిడి వంటి అంశాలను కలిపి ఈ చిత్రాన్ని రూపొందించారు.