Lecturer Scam: 2023 ఎన్నికల్లో లాభపడేందుకు BRS తెచ్చిన ఒక జీవో తెలంగాణలో ఉన్నతవిద్యకు మరణశాసనంగా మారింది. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ అక్రమాలపై BIG TV చేస్తున్న పోరాటంలో నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. అర్హత లేని యూనివర్సిటీల నుంచి తెచ్చిన చెల్లని సర్టిఫికెట్లతో వెయ్యిమందికి పైగా అక్రమార్కులు జూనియర్ కాలేజీల్లో శాశ్వత ఉద్యోగులుగా చదువులు చెప్తున్నారు.
కొందరు కనీసం టెన్త్ కూడా లేకుండా గెజిటెడ్ హోదా అనుభవిస్తున్నారు. ఇంకొందరు యూనివర్సిటీ పుట్టకముందే అక్కడ చదివినట్టు సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. వీళ్ల సర్టిఫికెట్లు నకిలీవని 2023లోనే అనుమానాలు వచ్చినా.. ఫిర్యాదులు చేసినా.. అధికారులు పట్టించుకోలేదు. ఈ మొత్తం కుంభకోణంలో అప్పటి RJDల పాత్ర అత్యంత వివాదాస్పదంగా ఉంది. చాలా కేసుల్లో RJD జయప్రదాబాయి చక్రం తిప్పినట్టు కనిపిస్తోంది. కొందర్ని నకిలీలుగా గుర్తించి వారి జీతాలు ఆపినా జయప్రదాబాయి ఆదేశాలతో శాలరీలు కంటిన్యూ చేశారు. అంటే చాలా కేసుల్లో ఫేక్ అని తెలిసి కూడా నిస్సిగ్గుగా ఈ లెక్చరర్లని కొనసాగిస్తున్నారు.
ఈ చదువురాని సార్లు చెప్పే పాఠాలతో ఎంత మంది విద్యార్ధుల భవిష్యత్ నాశనం అవుతోంది? అసలు కష్టపడి చదివి, అన్ని అర్హతలు ఉన్న నిరుద్యోగుల పొట్టకొట్టడం కాదా ఇది? గెజిటెడ్ హోదా ఉన్న ఉద్యోగాల్లోకి కనీసం పరీక్ష కూడా లేకుండా వీళ్లందరినీ ఎలా తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు ఇప్పుటికైనా సమాధానాలు వస్తాయో లేదో చూడాలి.
Also read: పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్పర్ట్స్ ఇస్తున్న సలహలివే?