Illu Illalu Pillalu Today Episode September 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. విశ్వం వల్ల ధీరజ్ బాధపడతాడు. డబ్బుల కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా? నీ మెడలో తాళి కట్టుకుండా ఉంటే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడిని నా ఇంట్లో వాళ్ళ దృష్టిలో అటు నీవాళ్ళ దృష్టిలో నేను చెడ్డవాన్ని అయిపోయానని బాధపడతాడు. ప్రేమ నీకు ఒక విషయం చెప్పాలి వింటావా అని అడుగుతుంది.. అసలు ఇదంతా కాదు ఆ కళ్యాణ్ గారిని ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి వారిని మీవాళ్లు ముందర పెట్టి, వీడే మీ అమ్మాయిని మోసం చేశాడు డబ్బు నగలతో పారిపోతుంటే నేను పరువు పోతుందని పెళ్లి చేసుకున్నాను అని చెప్పాలని ఉంది అంటాడు. ధీరజ్ అన్న మాటల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.. నాకు ఇంట్లో ఉన్న ఒకే ఒక్క దిక్కు నువ్వే నువ్వే ఇలా మాట్లాడితే నేను ఏమైపోవాలి నా బాధను ఎవరికి చెప్పుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆనందరావు శ్రీవల్లిని చూడటానికని ఇంటికి వస్తాడు. ఆ చెంబు ని తొలగించే పని నేను చేస్తాను ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే నన్ను ఇంట్లో ఉండేలా చెయ్యు అని ఆనందరావు అంటాడు. శ్రీవల్లి తండ్రి మాటను కాదనలేక అలానే అని అంటుంది. మొత్తానికి శ్రీవల్లి ఆనందరావు అనుకున్న విధంగా ఇంట్లో రాత్రి ఉండిపోవడానికి అందరూ ఒప్పుకుంటారు. ఇక తిరుపతి ఆ అమ్మాయి గురించి అని ఆలోచిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి నా సర్వస్వం ఆ అమ్మాయి నా జీవితం అంటూ గొప్పలు చెప్పుకుంటూ పాటలు పాడుతూ ఉంటాడు.
అమూల్య ఏంటి మావయ్య పిచ్చి గాని లేసిందా ఏంటి అని అడుగుతుంది. పక్క ఊర్లో ఉన్న అమ్మాయి ఎంత అందంగా ఉందో నువ్వు చూస్తే షాక్ అయితవు అని అంటాడు. ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా అని అంటుంది. ఇటు చందు లక్ష రూపాయలు చిన్నోడు తేకపోతే నేను కచ్చితంగా చచ్చిపోవాలి అని సాగర్తో అంటాడు. ఆ మాట విన్న సాగర్ నా పరిస్థితి నేను అర్థం చేసుకోవాలి రా నేను ఏదానికైనా నాన్నని అడిగి తీసుకోవాలి అని బాధపడతాడు.
నీ గురించి నాకు తెలియదా రా నా బాధను చూసి నువ్వు బాధపడుతున్నావ్ తప్ప సాయం చేయలేదని ఎంత దిగులు పడుతున్నావో నాకు తెలుసు అని చందు అంటాడు. నెలకు 50 వేలు సంపాదిస్తున్న నాకే ఎవరు వడ్డీకి ఇవ్వట్లేదు. నీకెలా ఇస్తారు అని అంటాడు. ధీరజ్ మాటిచ్చాడు అంటే కచ్చితంగా నిలబెట్టుకుంటాడు అని సాగర్ అంటాడు. వాడు చేసేది డెలివరీ జాబ్. వాడి పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఒకవేళ వాడు డబ్బులు తీసుకురాకపోతే ఇక చేసేదేమీ లేదు నేను చచ్చిపోవడం తప్ప అని సాగర్ తో చందు అంటాడు. ఆ మాట విన్న ధీరజ్ అన్నయ్య చనిపోవాలని అనుకుంటున్నాడు ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు.
ఇక రామ రాజు రైస్ మిల్క్ వచ్చిన డబ్బులను లెక్కలు వేసి కరెక్ట్ గా చెప్పమ్మా అని అమూల్య దగ్గరికి వస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన చందు ఎలాగైనా సరే నాన్న దగ్గర నుంచి ఒక లక్ష రూపాయలు తీసుకోవాలని అనుకుంటాడు. అమూల్య లెక్కలు వేస్తుంటే తిరుపతి కౌంటర్లు వేస్తూ ఉంటాడు. ఇక ధీరజు మెల్లగా పక్కన కూర్చుంటాడు. వాళ్ల నాన్న ఫోన్ తీసుకొని తన అకౌంట్ కి ఎలాగైనా సరే లక్ష రూపాయలు పంపించుకోవాలని ట్రై చేస్తాడు. కాస్తుంటే దొరికిపోతాడు అన్న సిచువేషన్ లో డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు.
అక్కడినుంచి బిత్తర చూపులు చూసుకుంటూ ఉంటాడు. రామరాజు డబ్బులు పంపించిన వాళ్లు నెంబర్ కోసమని ఫోన్ వెతుకుతాడు. మెల్లగా ఆ ఫోన్ ని అక్కడ పెట్టేసి సైడ్ అయిపోతాడు ధీరజ్. అటు ప్రేమకు కళ్యాణ్ దినదిన గండం గా మారతాడు. ఫోన్ చేసి బెదిరిస్తాడు. అర్జంటుగా కలవడానికి బయటకి రావాలి అని అంటాడు. ప్రేమ మొదట నమ్మకపోయినా వాడు పెట్టిన ఫోటోను వాడు ఇక్కడికి వచ్చేసాడా? ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు అని భయంతో వాని కలవడానికి ఒప్పుకుంటుంది.
Also Read : టీవీ సీరియల్ యాక్టర్స్ భర్తలు ఏం చేస్తుంటారో తెలుసా..?
ఇంట్లో వాళ్లకి అబద్ధం చెప్పి బయటకు వస్తుంది. రోడ్లపై పరుగులు పెడుతుంది. రాత్రి చీకటిలో ప్రేమను అటూ ఇటూ తిప్పిస్తాడు కళ్యాణ్. అయితే ప్రేమ రాత్రిపూట రోడ్డు మీద తిరగడం చూసిన ధీరజ్ ఏమైంది నువ్వు ఈ టైంలో ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతాడు. ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది అదేంటో నాకు చెప్పు అని అంటాడు. కానీ ప్రేమ మాత్రం నీకెందుకు చెప్పాలి రా నువ్వేమైనా పట్టించుకుంటున్నావా అని అంటుంది. ఇక ధీరజ్ ఎంత చెప్తున్నా సరే ప్రేమ వినదు దానితో ప్రేమను చెంప పగలగొడతాడు. ప్రేమను కొట్టడం విశ్వా చూస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..