E-Paper
Advertisement

ఇదెక్కడి జోంబీ మూవీ గురూ… ఏ ఓటీటీలోనూ దొరకని సినిమా

ఇదెక్కడి జోంబీ మూవీ గురూ… ఏ ఓటీటీలోనూ దొరకని సినిమా
Advertisement

Horror Film OTT : జొంబీ సినిమాలు ఒకప్పుడు ఓటీటీలను ఒక ఊపు ఊపేశాయి. ఇప్పుడు ఈ జానర్ కు డిమాండ్ కొంత వరకు తగ్గింది. కానీ మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉండాలి కానీ, ఇప్పటికీ మూవీ లవర్స్ జొంబీ సినిమాలను వదలకుండా చూస్తారు. మీరు కూడా ఇలాంటి సినిమాలకు బిగ్ ఫ్యాన్ అయితే ఈ మూవీ మీ కోసమే. అయితే ఈ మూవీ ఏ ఓటీటీలోనూ దొరకదు. అంతేకాదు సింగిల్ గా చూడాల్సిన సీన్లే ఎక్కువగా ఉంటాయి. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు ? మూవీ పేరేంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎక్కడ చూడొచ్చంటే ?

తైవాన్ నుండి వచ్చిన అత్యంత భయంకరమైన, బ్లడీ బ్లడ్ బాత్ జోంబీ-వైరస్ హారర్ చిత్రం The Sadness (2021). ఇది మామూలు జోంబీ సినిమాల్లా కాకుండా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా జొంబీలు కంటికి కనిపించిన వారిని అటాక్ చేస్తూ ఉంటాయి. కానీ ఇందులో మాత్రం వైరస్ సోకిన వారు వివేకం కోల్పోయిన జంతువుల్లా మారకుండా, తమలోని క్రూరమైన కోరికలను తీర్చుకునే రాక్షసుల్లా టర్న్ అవుతారు. ఈ సినిమా ప్రస్తుతం భారతదేశంలో ఏ ప్రముఖ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. కానీ హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన Shudder అనే సైట్ తో పాటు కొన్ని విదేశీ రీజియన్లలోని Apple TV లో రెంట్‌కి దొరుకుతుంది. ఇందులో భయంకరమైన సన్నివేశాలే కాదు, పెద్దలు మాత్రమే చూడాల్సిన సీన్లు చాలానే ఉంటాయి. కాబట్టి కుటుంబంతో చూడకపోవడమే బెటర్.

కథలోకి వెళ్తే…

Advertisement

తైపీ అనే నగరంలో ‘ఆల్విన్’ అనే వింత వైరస్ వ్యాప్తి చెందుతుంది. స్టార్టింగ్ లో అందరూ ఇది మామూలు జ్వరమే కదా అని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఆ వైరస్ మనుషుల మెదడులోని భావోద్వేగాలను కంట్రోల్ చేసే భాగాన్ని దెబ్బతీసి, వైరస్ సోకిన వారు తమ మనసులో ఉండే అత్యంత క్రూరమైన, వికృతమైన కోరికలను బయట పెట్టేలా చేస్తుంది. ఏడుస్తూనే ఇతరులను చిత్రహింసలు పెట్టి చంపుతూ ఉంటారు జొంబీలు.

Also Read : ప్రపంచం అంతాన్ని ఆపడానికి డెమి గాడ్ ఆపసోపాలు… మతిపోగోట్టే అడ్వెంచర్ డ్రామా

Advertisement

ఇక్కడే ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కథలో జిమ్, అతని ప్రియురాలు కాట్ అనే ఇద్దరు ప్రేమికులు ఉంటారు. నగరం అంతా అల్లకల్లోలంగా మారి, మనుషులు ఒకరిని ఒకరు నరుక్కుంటున్నప్పుడే ఈ ఇద్దరూ విడిపోతారు. కానీ జిమ్ తన ప్రియురాలిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. నగరం మొత్తం స్ప్రెడ్ అయిన ఆ జొంబీలను దాటి ఆమె దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇంకోవైపు కాట్ హాస్పిటల్‌ లో చిక్కుకుంటుంది. ఆమెను ముసలి సైకో జొంబీ వెంటాడుతుంటాడు. ఆ నరకం నుండి ఈ ఇద్దరూ ఎలా బయటపడ్డారు ? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో ‘ఎక్స్‌ట్రీమ్ హారర్’ సీన్స్ ఉంటాయి. ఇందులో చూపించే హింస, రక్తపాతం, వికృతమైన సీన్లు ఒళ్ళు జలదరించే విధంగా ఉంటాయి. అందుకే ఈ సినిమాకు చాలా దేశాల్లో సెన్సార్ కత్తెర వేసింది. గట్టి గుండె ఉన్నవారు మాత్రమే ఈ మూవీని చూడండి.

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×