E-Paper
Advertisement

ప్రతి గింజను కొంటాం.. రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రతి గింజను కొంటాం..  రైతులకు భరోసా ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత వేగంగా.. పారదర్శకగా నిర్వహిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎక్కడ ధాన్యం తడిసినా వెంటనే వాటిని బాయిల్డ్ రైస్ కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతుల వివరాలను సేకరిస్తున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా నోడల్ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సివిల్ సప్లై కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతిరోజూ గ్రామ.. మండల.. జిల్లా స్థాయి పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

వాతావరణ శాఖ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్ని కొనుగోలు కేంద్రాలకు చేరవేస్తూ రైతులను అలర్ట్ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సుమారు 13 లక్షల మంది రైతుల నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత 25 ఏళ్లలో మొదటిసారిగా రికార్డు స్థాయిలో 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 21,000 కోట్లను కేటాయించిందని.. ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారంతో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. భారతదేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో పంటలు పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని.. ఈ రబీ సీజన్‌లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడానికి సిద్ధంగా ఉండగా.. కేంద్రం 52 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని.. కనీస మద్దతు ధర (MSP) కింద ₹2,200 కోట్లు రైతులకు చెల్లించామని వివరించారు.

గన్ని బ్యాగుల కొరత ఎక్కడా లేదని.. ప్రస్తుతం 18.04 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. అదనంగా మరో 11.20 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్లను ఇప్పటికే అలర్ట్ చేశామని.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించినట్లు చెప్పారు. కేఎంఎస్ (KMS) 2025-26 కు సంబంధించి రైతులకు మెరుగైన మద్దతు ధర కల్పిస్తున్నామని.. రైతులు అధైర్యపడకుండా ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

Advertisement

Read Also: కరీంనగర్ మీ జాగీరు కాదు.. బరాబర్ వస్తాం.. బండికి గంగుల స్ట్రాంగ్ కౌంటర్

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×