OTT Movie : కొన్ని సినిమాలు వింత స్టోరీలతో చివరివరకూ సస్పెన్స్ ను క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆతృత పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాగాళ్లను ట్రాప్ చేసి, ప్రెగ్నెన్సీ కి ఉపయోగించుకుంటారు. అయితే ఇది చాలా హింసతో కూడుకుని ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
స్టోన్ అనే ఫోటోగ్రాఫర్ సోలార్ ఎక్లిప్స్‌ను ఫోటో తీసేందుకు ఎడారిలోకి వెళ్తాడు. ఈ క్రమంలో ఒక నిర్మాణస్యమైన ప్రాంతంలో ఫోటోలు తీస్తూ ఉంటాడు. అయితే అతనికి కొంత దూరంలో ఒక చిన్న పిల్లాడు కనపడతాడు. అతని దగ్గరికి వెళ్లి వివరాలు అడుగుతాడు. తన తల్లిదండ్రులు తప్పిపోయారని ఆ పిల్లాడు చెప్పడంతో, అతన్ని వెంటబెట్టుకుని కొంత దూరం ప్రయాణిస్తాడు. అక్కడే ఇతడు దారి తప్పి పోతాడు. ఆ పిల్లాడు కూడా కనిపించకుండా పోతాడు. ఇంతలోనే చీకటి పడటంతో, ఒక లోతైన గుంతలో పడిపోతాడు. ఆ తర్వాత ఇతనికి కష్టాలు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎప్పటినుంచో నివసిస్తూ ఉంటుంది. ఆమెకు ఆహారం కూడా పైనుంచి కొంతమంది పిల్లలు విసిరేస్తుంటారు.
ఇక స్టోన్ కూడా చేసేదేం లీక అక్కడే ఉండాల్సి వస్తుంది. అతను ఎంత ప్రయత్నించినా బయటకు వెళ్లే మార్గం మాత్రం కనిపించదు. అంతా ఎత్తయిన కొండ రాయే కనపడుతుంది. ఇక చేసేదేం లేక బతకడానికి అక్కడే చిన్న చిన్న పంటలు పండిస్తూ బతుకుతారు. అక్కడున్న మహిళ కూడా ఇతని వల్ల గర్భవతి అవుతుంది. ఆమెను కూడా ట్రాప్ చేసి అక్కడ పెట్టి ఉంటారు. పిల్లల్ని కనడం కోసమే ఆక్కడికి వచ్చే మగవాళ్లను ట్రాప్ చేస్తుంటారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. చివరికి ఆ ప్రాంతం నుంచి స్టోన్ బయటపడతాడా ? అందులో ఉన్న మహిళ ఎవరు ? కొండపై నుంచి ఆహారాన్ని ఎవరు విసిరిస్తున్నారు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also :
ఒకే విధంగా 7 మంది అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్… ట్విస్టులతో టెన్షన్ పుట్టించే సైకో థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది సీడింగ్’ (The Seeding). 2024 లో విడుదలైన ఈ సినిమాకి బర్నాబీ క్లే దర్శకత్వం వహించారు. ఇందులో స్కాట్ హేజ్, కేట్ లిన్ షీల్, అలెక్స్ మోంటాల్డో వంటి నటులునటించారు. ఈ మూవీ 2024 జనవరి 26 న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Share