OTT Movie : రీసెంట్ గా మోహన్‌లాల్ నటించిన ఒక మూవీ థియేటర్ లను షేక్ చేసి, ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ఈ మూవీ మలయాళంలో మంచి కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్ లలోకి వచ్చిన నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
షణ్ముఖం అనే వ్యక్తి టాక్సీ డ్రైవర్ గా జీవితం గడుపుతుంటాడు. ఇతన్ని అందరూ బెంజ్ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు మలయాళం, తమిళ సినిమాల్లో ప్రసిద్ధ స్టంట్ మాస్టర్ గా ఉండేవాడు. అక్కడ తన స్నేహితుడు ఒక సెట్‌లో జరిగిన దుర్ఘటనలో చనిపోతాడు. అందువల్ల బెంజ్ సినిమా పరిశ్రమను వదిలేసి, తన బ్లాక్ అంబాసిడర్ కారుతో టాక్సీ డ్రైవర్‌గా సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఆ కారుని అతడు ప్రాణం కన్నా ఎక్కువగా చూస్తుంటాడు. అతను తన భార్య లలిత (శోభన), కొడుకు పవి (తామస్ మాథ్యూ), కూతురు (అమృత వర్షిణి)తో జీవితం సంతోషంగా గడుపుతుంటాడు. అయితే అతని కారు ఒక మెకానిక్ చేతిలో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకుంటారు. అందులో డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు చెప్తారు. బెంజ్ తన కారును తిరిగి పొందేందుకు SI బెన్నీ (బిను పప్పు)ని సంప్రదిస్తాడు. అక్కడ ఇద్దరికీ గట్టిగా వాగ్వాదం జరుగుతుంది.
ఇంతలో CI జార్జ్ మాథన్ (ప్రకాష్ వర్మ) జోక్యం చేసుకుంటాడు. అతనికి కారును అప్పజెప్పే క్రమంలో, బెంజ్ ని ఒక రైడ్ కి తీసుకుని పోతాడు జార్జ్ . చాలా దూరం ప్రయాణించాక ఒక అడవి మార్గంలోకి చేరుకుంటారు. అప్పటికే కారు డిక్కీలో ఒక శవం ఉందని తెలుసుకుంటాడు బెంజ్. ఇక కారులో ఉన్న వాళ్ళతో గోడవకు దిగుతాడు బెంజ్. వాళ్ళు ఇతన్ని బెదిరించి శవాన్ని ఒకచోట పూడ్చడానికి తీసుకెళ్తారు. ఆ తరువాత రోజునుంచి బెంజ్ కొడుకు కనిపించకుండా పోతాడు. అప్పుడే బెంజ్ కి అనుమానం వస్తుంది. ఇక అసలు విషయం తెలిసి దుఖంలో మునిగిపోతాడు బెంజ్. తన కారులో ఉన్నది తన కొడుకు శవం అని తెలిసి పగతో రగిలిపోతాడు. చివరికి బెంజ్ కొడుకుని పోలీసులు ఎందుకు చంపారు ? బెంజ్ తన కొడుకు చావుకి ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : రాజకుమారుడిని పెళ్లి చేసుకోవడం కోసం పార్ట్స్ అన్నీ కట్… ఇదెక్కడి సైకోరా బాబూ
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తుడారం’ (Thudarum). 2025లో విడుదలైన ఈ సినిమాకి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌లాల్, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు. రేజపుత్ర విజువల్ మీడియా ద్వారా ఎం. రెంజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇది ప్రస్తుతం మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సాధించింది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.