BigTV English
Advertisement

OTT Movie : ఒకే విధంగా 7 మంది అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్… ట్విస్టులతో టెన్షన్ పుట్టించే సైకో థ్రిల్లర్

OTT Movie : ఒకే విధంగా 7 మంది అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్… ట్విస్టులతో టెన్షన్ పుట్టించే సైకో థ్రిల్లర్

OTT Movie : ఈ సైకో కిల్లర్ సినిమాలు ప్రేక్షకుల మైండ్ ను డిస్టర్బ్ చేస్తుంటాయి. ఆ విధంగానే ఈ స్టోరీలను తెరకెక్కిస్తుంటారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కిల్లర్ వేశ్యలను టార్గెట్ చేస్తుంటాడు. ఒక డిటెక్టివ్ ఈ కిల్లర్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ స్టోరీ ట్విస్ట్ లతో మెంటలెక్కిస్తూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

వెస్ట్ హాలీవుడ్‌లోని సన్‌సెట్ స్ట్రిప్‌లో వేశ్యలను ఒక కిల్లర్‌ చంపుతుంటాడు. ఈ హత్యలన్నీ ఒకే విధంగా జరిగిఉంటాయి. చాండ్లర్ మానింగ్ అనే అనుభవజ్ఞుడైన డిటెక్టివ్ ఒక వ్యక్తిని అనుమానించి పట్టుకుని పోలీసులకు అప్పజెప్పుతాడు. ఈ హత్యలు 19వ శతాబ్దంలో లండన్‌లో జాక్ ది రిప్పర్ చేసిన హత్యలను పోలి ఉంటాయి. ఏడు సంవత్సరాల క్రితం కూడా ఒక సీరియల్ కిల్లర్ ఇలానే హత్యలు చేసి ఉంటాడు.  దీంతో మానింగ్ కి తప్పుడు నిందితుడిని అరెస్టు చేసి శిక్షించాడని అనుమానం వస్తుంది. మానింగ్ వ్యక్తిగత సమస్యలతో (తన భార్య ఆత్మహత్యా ప్రయత్నం, కూతురితో దూరం పెరగడం ) సతమతమవుతూ కిల్లర్‌ ఉచ్చులో చిక్కుకుంటాడు.


మరోవైపు ఎల్లెన్ బంటింగ్ అనే మానసిక స్థితి సరిగ్గా లేని ఒక మహిళ, తన గెస్ట్‌హౌస్‌ను మాల్కం అనే రచయితకి అద్దెకు ఇస్తుంది. ఎల్లెన్ హాల్యూసినేషన్స్‌తో బాధపడుతూ ఉంటుంది. ఆమె భర్త జోకి  ఈ మాల్కం ప్రవర్తనపై అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒక హత్య ఆ ప్రాంతంలో జరిగినప్పుడు, అతని ఫుట్‌ప్రింట్‌ వల్ల అతనిపై అనుమానం కలుగుతుంది. ఆ తరువాత జో కూడా కనిపించకుండా పోతాడు. చివరికి కిల్లర్ ని డిటెక్టివ్ పట్టుకుంటాడా ? కిల్లర్ వేశ్యలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : మనుషులపై పగ తీర్చుకోవాలనుకునే మర్మైడ్స్… సస్పెన్స్ తో పిచ్చెక్కించే ఫ్యాంటసీ థ్రిల్లర్

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ అమెరికన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది లాడ్జర్’ (The Lodger). 2009 లో వచ్చిన ఈ మూవీకి డేవిడ్ ఒండాట్జే దర్శకత్వం వహించారు. ఇది 1913లో మేరీ బెలోక్ లోండెస్ రచించిన ‘ది లాడ్జర్’ అనే నవల ఆధారంగా రూపొందింది. ఇందులో ఆల్‌ఫ్రెడ్ మోలినా, హోప్ డేవిస్, సైమన్ బేకర్ వంటి నటులు నటించారు. ఈ స్టోరీ ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్‌లో 2009జనవరి 23న స్టేజ్ 6 ఫిల్మ్స్, శామ్యూల్ గోల్డ్‌విన్ ఫిల్మ్స్ ద్వారా థియేటర్‌లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×