OTT Movie : ఓటీటీలో రాధికా ఆప్టే నటించిన ఒక మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ లో హీరో గా నటించన దేవ్ పటేల్ ఇందులో మెయిన్ రోల్ లో నటించాడు. ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే, లీక్ అయిన రాధికా ఆప్టే వీడియోలు అప్పట్లో వైరల్ గా మారాయి. ఈ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్ అయితే ఊహించని విధంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ యాక్షన్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ది వెడ్డింగ్ గెస్ట్’ (The Wedding Guest). 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి మైఖేల్ వింటర్‌బాటమ్ దర్శకత్వం వహించారు. ఇందులో దేవ్ పటేల్ (జే), రాధికా ఆప్టే (సమీరా), జిమ్ సర్భ్ (దీపేష్) ప్రధాన పాత్రలలో నటించారు. ఇది 2018 సెప్టెంబర్ 8న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2019న మార్చి 1, యునైటెడ్ స్టేట్స్‌లో IFC ఫిల్మ్స్ ద్వారా విడుదలైంది. ఈ కథ పాకిస్తాన్, భారతదేశంలో జరుగుతుంది. ఈ సినిమా Netflix, Amazon Prime Video, Apple TVలో అందుబాటులో ఉంది. 97 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 5.8/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ జే (దేవ్ పటేల్) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను దొంగ పాస్‌పోర్ట్‌లతో లండన్ నుండి పాకిస్తాన్‌లోని లాహోర్‌కు ప్రయాణిస్తాడు. అక్కడికి చేరుకున్న తర్వాత, అతను ఒక కారును అద్దెకు తీసుకుని, రెండు తుపాకులను కొంటాడు. యంగనాబాద్ అనే చిన్న పట్టణంలో ఒక పెళ్ళికి హాజరవుతాడు. అయితే జే అక్కడికి అతిథిగా మాత్రం ఇతను రాలేదు. అతను పెళ్ళి కూతురు సమీరా (రాధికా ఆప్టే)ను కిడ్నాప్ చేయడానికి వచ్చాడు. వివాహానికి ముందు రోజు రాత్రి, అతను సమీరా ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించి, ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఈ క్రమంలో ఒక గార్డును కూడా చంపుతాడు. నిజానికి సమీరా పాకిస్తాన్‌లో జన్మించిన బ్రిటిష్ సంతతికి చెందిన యువతి. ఆమెకు ఈ పెళ్ళి ఇష్టం ఉండదు. దీపేష్ (జిమ్ సర్భ్) అనే వ్యక్తి, జే కి డబ్బులు ఇచ్చి ఆమెను కిడ్నాప్ చేయమని చెప్పి ఉంటాడు. ఎందుకంటే దీపేష్ సమీరాని ఇష్టపడుతుంటాడు. ఇప్పుడు జే సమీరాకు రెండు ఆప్షన్స్ ఇస్తాడు. తిరిగి తన కుటుంబం వద్దకు వెళ్లి వివాహం చేసుకోవడం లేదా దీపేష్‌తో జీవితం పంచుకోవడానికి లాహోర్‌కు వెళ్లడం.
సమీరా ఈ పెళ్ళికి వ్యతిరేకంగా ఉండటంతో, దీపేష్ దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయించుకుంటుంది. వీళ్ళు నకిలీ పాస్‌పోర్ట్‌లతో భారతదేశ సరిహద్దును దాటి, అమృత్‌సర్‌కు చేరుకుంటారు. అయితే దీపేష్ వారిని కలవడానికి అక్కడికి రాకపోవడంతో ప్లాన్ గందరగోళంలో పడుతుంది. కథ ముందుకు సాగేకొద్దీ, జే, సమీరా న్యూ ఢిల్లీలోని రైల్వే స్టేషన్లు, వీధులు, బ్లాక్ మార్కెట్‌ల చుట్టూ తిరుగుతుంటారు. ఈ ప్రయాణంలో వీళ్ళ మధ్య ఫీలింగ్స్ మొదలవుతాయి. సమీరా ఒకసారి జే ను నీవు నమ్మదగినవాడివా? అని అడుగుతుంది. అందుకు జే సమాధానంగా ‘లేదు’ అని చెప్తాడు. ఇక జే మీద ఇష్టం కలిగినా, అతడు చేసే పనిపట్ల ఆమె సందేహంలో పడుతుంది. ఇక దీపేష్‌తో కలవడం కూదరకపోవడంతో, కథ ఒక రోడ్ ట్రిప్ థ్రిల్లర్‌గా మారుతుంది. జే, సమీరా మధ్య ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది. కథ ఊహించని ట్విస్ట్‌లు, మోసాలతో పరుగులు పెడుతుంది. చివరికి జే, సమీరా లవ్ స్టోరీకి శుభం కార్డ్ పడుతుందా ? దీపేష్ సమీరాని కలుస్తాడా ? ఈ సినిమా ఎలా ఎండ్ అవుతుంది. అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పెట్రోల్ తాగకపోతే చచ్చే హీరో… బుర్ర కరాబ్ అయ్యే ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్