E-Paper
Advertisement

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!
Advertisement

Guntur special kova puri: తెలుగు రాష్ట్రాల పిండి వంటల్లో , స్వీట్లలో గుంటూరు కోవా పూరీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ పూరీలను నూనెలో వేయించి వాటిని పంచదార పాకంలో ముంచి ఇస్తుంటారు. కానీ గుంటూరు కోవా పూరీ స్టైలే వేరు.పైభాగం చక్కటి క్రిస్పీగా ఉండి, లోపల గుమ గుమలాడే పాల కోవా స్టఫింగ్‌తో తింటుంటే ఆ మజానే వేరే లెవెల్‌లో ఉంటుంది. పెళ్ళిళ్లలో, పండగలలో తప్పకుండా కనిపించే ఈ స్వీట్‌ను మన ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

మైదా పిండి – 1 కప్పు

Advertisement

బొంబాయి రవ్వ (సూజి) – 2 టేబుల్ స్పూన్లు

నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు (పిండి కలపడానికి, వేయించడానికి)

Advertisement

పంచదార – 1 కప్పు (పాకం కోసం)

కోవా (ఖోయా) – 1 కప్పు (ఫ్రెష్ కోవా అయితే బాగుంటుంది)

యాలకల పొడి – అర టీస్పూన్

నూనె – పూరీలు డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

చిటికెడు ఉప్పు , కొద్దిగా నీరు.

పూరీ పిండి తయారీ విధానం:

ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మైదా పిండి, బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల కాచి చల్లార్చిన నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండిలా కాకుండా.. కొంచెం గట్టిగా పూరి పిండిలా కలుపుకోవాలి. పిండిని తడి క్లాత్ కప్పి ఒక 20 నిమిషాలు పక్కన నాననివ్వాలి. రవ్వ కలపడం వల్ల పూరీలు చాలా క్రిస్పీగా వస్తాయి.

కోవా స్టఫింగ్, పాకం తయారీ:

ఇప్పుడు ఒక పాన్ లో కోవాను వేసి సన్నని మంట మీద కొద్దిగా వేడి చేయాలి.అందులో కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా పంచదార పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి.ఇది మన పూరిలో పెట్టే కూరలాంటిది. అలాగే వేరొక గిన్నెలో పంచదార, అర కప్పు నీరు పోసి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. పాకంలో కూడా కొద్దిగా యాలకుల పొడి వేస్తే మంచి సువాసన వస్తుంది.

Also Read: నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

పూరీలు కాల్చే విధానం:

నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా సన్నగా ఒత్తుకోవాలి. ఇప్పుడు కాగిన నూనెలో వీటిని వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు క్రిస్పీగా వేయించి తీసుకోవాలి. వేయించిన పూరీలను కొద్దిగా గోరు వెచ్చని పంచదార పాకంలో నిమిషం పాటు ముంచి బయటకు తీయాలి. ఇప్పుడు ఆ పూరి మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న కమ్మని కోవా స్టఫింగ్‌ను ఉంచితే మన గుంటూరు స్పెషల్ కోవా పూరి రెడీ అవుతుంది!

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పూరీలు నూనెలో వేయించేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి, అప్పుడే అవి క్రిస్పీ టెక్చర్ ఇస్తాయి. కోవా ఫ్రెష్‌గా ఉంటే స్వీట్ రుచి అద్భుతంగా వస్తుంది.

ఇంట్లో ఎప్పుడూ రొటీన్ స్వీట్స్ చేసుకునే వారు ఈ సారి కోవా పూరీ ట్రై చేయండి. టెస్ట్ అద్భతంగా ఉంటుంది.

Related News

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

Big Stories

Advertisement
×