OTT Movie : ఆంథాలజీ ఫార్మాట్ లో ఒక హారర్ సినిమా విచిత్రమైన ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆరు విభిన్న హారర్ కథలు ఉన్నాయి. ఇవన్నీ ఒక వింతైన ప్రేమ కథ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఈ సినిమాకి ఎనిమిది మంది డైరెక్టర్లు పని చేశారు. ప్రతి కథ ఒక విచిత్రమైన ముగింపుతో ప్రేక్షకులలో ఉత్కంఠతను నింపుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఎమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఒక పాడుబడిన నగరంలో, ఎనోలా అనే యువతి ఒక పాత థియేటర్ లోకి వెళ్ళాలనుకుంటుంది. ఒక రాత్రి ఆ థియేటర్ తలుపు కొద్దిగా తెరిచి ఉండటం గమనించి, ఆమె లోపలికి చొరబడుతుంది. అక్కడ ఆమెను పెగ్ అనే ఒక వింతైన, బొమ్మలా కనిపించే ఆకారం ఆమెకు స్వాగతం పలుకుతుంది. అది ఆమెకు ఆరు “బిజార్ కథలు” చూపిస్తానని చెప్పి, ఒక్కొక్క కథను ప్రొజెక్ట్ చేస్తాడు. కథలు చూస్తున్న కొద్దీ, పెగ్ మానవ రూపంలోకి మారుతూ, ఎనోలా చర్మం గట్టిపడి ఆమె కదలికలు బొమ్మలాగా మారుతాయి. చివరికి ఎనోలా పూర్తిగా బొమ్మగా మారిపోతుంది. ఆ తరువాత పెగ్ ఆమెను ఒక ట్రంక్‌లో బంధిస్తాడు. ఆమెను థియేటర్ లో దెయ్యం రూపంలో చిక్కుకునేలా చేస్తాడు. ఆ రూపం చెప్పే ఈ కథలు కూడా భయానకంగా ఉంటాయి.
మొదటి కథ (The Mother of Toads) : మార్టిన్, మార్గోట్ అనే అమెరికన్ జంట ఫ్రాన్స్‌లోని పైరినీస్ పర్వతాల్లో హైకింగ్ చేస్తుంటారు. ఒక తుఫాను సమయంలో వీళ్ళు అక్కడే ఉన్న ఒక పాత ఇంటిలో ఆశ్రయం పొందుతారు. అక్కడ విచిత్రమైన ఒక వృద్ధ మంత్రగత్తె నివసిస్తుంటుంది. వారిని ఆతిథ్యంతో ఆకర్షిస్తుంది. కానీ త్వరలోనే ఆమె ఉద్దేశాలు బయటపడతాయి. ఆమె మార్గోట్‌ను కప్పల గుడ్లతో నిండిన వింత ఆచారాల ద్వారా ఆమె జీవశక్తిని హరిస్తుంది. మార్టిన్ భయపడి పారిపోతాడు. చివరిలో మంత్రగత్తె అమరత్వం పొందిన రాక్షసిగా బయటపడుతుంది. ఆమె నవ్వు చీకటిలో మారుమోగుతుంది.
రెండవ కథ (I Love You) ఈ సైకాలజికల్ థ్రిల్లర్‌లో ఒక హింసాత్మక భర్త, తన భార్యను అనుమానిస్తూ ఆమెపై గూఢచర్యం చేస్తాడు. ఆమె అతని పట్ల విధేయతతో ఉన్నప్పటికీ, అతని ఆరోపణలు ఆమెను బాధిస్తాయి. ఒక రోజు అతని హింసాత్మక ప్రవర్తన మీద తిరుగుబాటు చేస్తుంది. ఒక కిచెన్ కత్తితో అతన్ని దారుణంగా పొడుస్తుంది. ఆమె అతని శరీరంపై “ఐ లవ్ యూ” అని రాస్తూ, తన ప్రేమను వక్రీకృత రీతిలో వ్యక్తపరుస్తుంది. చివరిలో ఆమె రక్తం తడిసిన చేతులను ప్రశాంతంగా శుభ్రం చేస్తుంది. ఈ కథ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లు, హింసాత్మక ప్రతీకారంపై దృష్టి సారిస్తుంది.
మూడవ కథ (Wet Dreams) : ఒక ఒంటరి వ్యక్తి తిండి, శృంగారంతో సంబంధం ఉన్న విచిత్రమైన ఫాంటసీలలో మునిగిపోతాడు. అతని “వెట్ డ్రీమ్స్” వివిధ రకాల హాల్యూసినేషన్‌లుగా మారతాయి. కలలు, వాస్తవం మధ్య అతని మోహాలు వినాశకరమైన చర్యలుగా మారతాయి. చివరిలో అతను ఒక ఆర్గాస్మిక్ ఫీస్ట్‌లో మునిగిపోతాడు. ఇది అతని శరీరంతో పాటు, మనస్సునుకూడా నాశనం చేస్తుంది.
నాలుగవ కథ (The Accident) : ఒక తల్లి తన చిన్న కూతురుతో ఒక రోడ్ ట్రిప్ కి వెళ్తారు. ఒక రాత్రి వారు ఒక భయంకరమైన రోడ్ ప్రమాదాన్ని చూస్తారు. ఇందులో ఒక మోటార్‌సైక్లిస్ట్, ఒక జింక చనిపోతాయి. తల్లి ఈ సంఘటనను ఆమె కూతురికి జీవితం, మరణం గురించి వివరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ దృశ్యం ఆమెపై లోతైన ప్రభావం చూపుతుంది.
ఐదవ కథ (Vision Stains) : ఒక మహిళ ఇతరుల కళ్ల నుండి ద్రవాన్ని సేకరించి, దానిని తన కళ్లలో ఇంజెక్ట్ చేస్తూ, వారి జ్ఞాపకాలను చూస్తుంటుంది. ఈ విచిత్రమైన ప్రక్రియ ఆమెను ఒక కిల్లర్ జ్ఞాపకాలలోకి తీసుకెళ్తుంది. ఆమె ఒక డార్క్ సీక్రెట్ ను బయటపెడుతుంది. కానీ ఈ ప్రక్రియ ఆమెను దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయి.
ఆరవ కథ (Sweets) : గ్రెగ్, ఎస్తెల్ అనే జంట, ఒక విచిత్రమైన ఆహార ఫెటిష్‌లో మునిగిపోతారు. వీళ్ళు ఒక కానిబలిస్టిక్ రిచువల్‌లోకి వెళ్తారు. అక్కడ వారు ఒకరినొకరు ఆహారంగా తినడం మొదలుపెడతారు. ఈ కథలన్నీ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుటిస్తుంటాయి.
‘ది థియేటర్ బిజార్’ (The Theatre Bizarre) 2011లో విడుదలైన అమెరికన్-ఫ్రెంచ్ హారర్ ఆంథాలజీ సినిమా. ఈ సినిమాకి ఎనిమిది మంది డైరెక్టర్లు పని చేశారు. ఇందులో వర్జీనియా న్యూకంబ్ (ఎనోలా పెన్నీ), క్యాట్రియోనా మాక్‌కాల్ (మేర్ ఆంటోయినెట్), శైన్ వుడ్వర్డ్ (మార్టిన్), విక్టోరియా మారెట్టే (కరీనా), ఆండ్రే హెన్నిక్ (ఆక్సెల్), సుజాన్ అన్బె (మో), డెబ్బీ రోచన్ (కార్లా) ముఖ్య పాత్రలు పోషించారు. 1 గంట 54 నిమిషాల రన్‌టైమ్ తో IMDb రేటింగ్: 5.2/10 రేటింగ్ ను పొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ట్యుబిలో అందుబాటులో ఉంది.
Read Also : అమ్మాయిల చర్మాన్ని వలిచి అమ్ముకునే రాకెట్… వలపు వల వేసి ట్రాప్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్