Dating App: హైదరాబాద్ లో రోజు రోజుకీ దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హత్యలు, ఆత్మహత్యల ఘటనలో నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. సైబర్ క్రైమ్ దాడులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ 25 ఏళ్ల యువకుడు డేటింగ్ యాప్ లో బ్లాయ్ మెయిల్ కు గురైన ఘటన చోటుచేసుకుంది. డేటింగ్ యాప్ లో మహిళతో వీడియో కాల్ లో నగ్నంగా మారడంతో.. బ్లాయ్ మెయిల్ కు గురై రూ.1.7 లక్షలు కోల్పోయాడు. చివరకు బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్, గచ్చిబౌలికి చెందిన ఓ యువకుడు డేటింగ్ యాప్‌లో మహిళతో కనెక్ట్ అయ్యాడు. ఇది కాస్త స్నేహంగా మారింది. యాప్ నుంచి ఇన్ స్టాగ్రామ్, ఇన్ స్టా నుంచి వాట్సాప్ వరకు వీరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లోనే వారి సంభాషణలు సన్నిహితంగా మారాయి. ఈ క్రమంలోనే ఆ మహిళ యువకుడికి వీడియో కాల్ చేసింది. అకస్మాత్తుగా మహిళ తన బట్టలు విప్పేసి.. యువకుడిని కూడా అలాగే చేయమని బలవంతం చేసింది. మహిళా బలవంతం చేయడంతో.. మహిళా రహస్యంగా స్క్రీన్ రికార్డింగ్ చేసింది.
ALSO READ: Red Alert: అత్యంత భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు.. ఏ జిల్లాలకంటే..?
ఆ తర్వాత ఆమె యువకుడి సోషల్ మీడియా కాంటాక్ట్ లిస్ట్‌ను యాక్సెస్ చేసింది. అంతటితో ఊరుకోకుండా.. నగ్న వీడియోలను తన ఫ్రెండ్స్, షేర్ చేస్తాను అంటూ బెదిరింపులు మొదలుపెట్టింది. డబ్బులు పంపితేనే వీడియోలు షేర్ చేయను అని బ్లాయ్ మెయిల్ చేసింది. దీంతో భయపడిన యువకుడు మొదటి సారి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశాడు. కానీ.. ఆ మహిళా ఇంతటితో ఆగకుండా మళ్లీ డబ్బులు పంపాలని డిమాండ్ చేసింది. ఇలా మొత్తం రూ.1.7 లక్షలు వసూలు చేసింది. చివరకు.. యువకుడు ఈ టార్చర్ భరించలేక సైబర్‌బాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ALSO READ: Knot Dating: డేటింగ్ యాప్స్ లో అమ్మాయిలే ఎక్కువట.. ఏకంగా రూ.57 వేలు చెల్లించి మరి..
పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 318(4), 308(2) (బ్లాక్‌మెయిల్) కింద, అలాగే ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66-డి కింద కేసు నమోదు చేశారు. ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్‌ల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటన సైబర్ సెక్స్టార్షన్ ఫ్రాడ్‌ల గురించి తెలియజేస్తోంది. యువత ఇలాంటి యాప్‌లలో అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీడియో కాల్‌లలో ఇంటిమేట్ మూమెంట్స్‌ను షేర్ చేయకూడదని.. ఎందుకంటే అవి రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మోసం జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని.. ఆలస్యం చేస్తే మరిన్ని నష్టాలకు దారితీస్తుందని పోలీసులు తెలిపారు.