E-Paper
Advertisement

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?
Advertisement

Bigg Boss 10:సాధారణంగా ఒక రియాలిటీ షో కి వెళ్ళాము అంటే.. అక్కడ ఆడ, మగ అనే తేడా ఉండదు. నిర్వాహకులు చెప్పిన ప్రతీ పని చేసి తీరాల్సిందే. ఇక బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కప్పు కొట్టే దిశగా అడుగులు వేయాలి అంటే.. ఎంత క్లిష్టమైన ఆట అయినా సరే.. ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే. మిగిలిన గత 9 సీజన్లను మనం పరిశీలిస్తే.. అందులో లేడి కంటెస్టెంట్లు.. మగవారితో పోటీ పడుతూ ఒక్కొక్కసారి వారికి ధీటుగా ఆటలు ఆడి, ఆడియన్స్ ను మెప్పించారు. అయితే ఈ పదవ సీజన్లో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్స్ పై ఇప్పుడు ట్రోల్స్ వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ వీరు సింపతి గేమ్ ఆడుతున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

గేమ్ ఆడలేక.. సింపతి మొదలు పెట్టారా?

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాక జెండర్ లో తేడా ఉండదు. ఎవరైనా ఒకటే.. టాస్కులు, గేమ్స్ ఎవరైనా ఆడాల్సిందే. ఏ భాషలో అయినా ఇదే జరుగుతుంది కూడా.. మాటలతో ఎవరైనా అనకూడనివి అంటే.. విమర్శలు రావొచ్చు .. హోస్ట్ నుంచి తిట్లు వస్తాయి తప్ప.. ఫిజికల్ గేమ్ లో ఇద్దరు సమానమే. వేరే భాషల్లో కూడా లింగ భేదం లేకుండా గేమ్స్ ఆడుతున్నారు. ఇటీవల హోస్ట్ నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్లో వర్షిణి విషయంలో ఇక్కడ లింగభేదం లేదు.. అందరూ సమానమే.. అందరూ ఆడాల్సిందే అని చెప్పారు. అయితే తాజాగా నాగార్జున మాటలను బట్టి చూస్తే కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ ఉమెన్ కార్డ్ వాడాలని చూస్తున్నారు.. ఓడిపోతున్నాం , నెగిటివ్ అవుతున్నాం అనే సమయంలో అమ్మాయి కదా అంటూ కామెంట్స్ చేయడం, ఏడవడం లాంటివి చేస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

also read:ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

లేడీ కంటెస్టెంట్స్ పై ట్రోల్స్..

అయితే మొదట ఈ సింపతి గేమ్ సృష్టి మొదలుపెట్టింది. సుధీర్ తో మంచిగా ఉన్నన్ని రోజులు అతనితో మాట్లాడింది. సుధీర్ చెప్పిన వాటికి ఓకే చెప్పింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పని అడిగితే ..ఏం లేదని చెప్పి.. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సృష్టిని ఆడట్లేదు అని ఫైర్ అవ్వగానే.. మరుసటి రోజు సుధీర్ పై మండిపడింది. ఒక అమ్మాయిని అలా అంటావా ? అమ్మాయిని మానసికంగా బాధ పెడతావా? వాడుకుంటావా? అంటూ పదేపదే అమ్మాయి అనే పదాన్ని వాడి సుధీర్ ని భారీగా తిట్టేసింది. సృష్టినే అని చివరికి తానే ఏడ్చి, సింపతి కోసం ట్రై చేసింది.

సృష్టి , వర్షిణి , షాలిని ఈ జాబితాలోనే..

Advertisement

అయితే ఇదే విషయాన్ని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన అపూర్వ కూడా చెప్పింది. నాగార్జున తిట్టనంతవరకు సుధీర్ తో బాగానే ఉన్న సృష్టి.. తెల్లవారేసరికి రివర్స్ అవడంతో ఆడియన్స్ లో కూడా ఈమెపై నెగెటివిటీ ఏర్పడింది. నాగార్జున కూడా సుదీర్ తప్పేమీ లేదని చెప్పడం మరో ఎత్తు.. దీనికి తోడు వర్షిణి కూడా ఇలా సింపతి కోసం ట్రై చేసింది. వర్షిణి అమన్ కి మధ్య జరిగిన టాస్క్ లో వర్షిని ముందుగా షర్టు పట్టుకొని లాగడం, అతడిని గోళ్ళతో గీకి హడావిడి చేసింది.అమన్ టాస్క్ కోసం వర్షిణినీ కౌగిలించుకోవాల్సి వచ్చింది. అప్పటికీ కంటెస్టెంట్స్ ఆమెకు కంఫర్టబుల్గా లేదని చెప్పగానే వదిలేశాడు. కానీ వర్షిణి ఆడపిల్ల మీద గెలవడం, అమ్మాయితో అలా చేస్తారా? అని ఏడ్చి సింపతి కొట్టేసే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో కూడా నాగార్జున తిట్టాడు గేమ్ ఆడలేక అమ్మాయి అనే పదం తీసుకురావడం ఎందుకు? అంటూ మండిపడ్డారు. షాలిని కూడా అంతే.

ఉన్నవారిలో వీరే కొంచెం బెటర్..

అయితే ఇటు దేబ్ జానీ కూడా పలుమార్లు ఏడ్చి సింపతి ప్లే చేసింది. కానీ పోటీల్లో మాత్రం మగవారితో సమానంగా ఆట ఆడుతోంది . ఇక మొత్తంగా హౌస్ లో ఉన్న ఆడపిల్లలతో పోలిస్తే.. అపూర్వ, దేబ్ జానీ, జాన్సీ కాస్త బెటర్ గా కనిపిస్తున్నారు అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.
అసలు ఎప్పుడూ లేనివిధంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయి అనే పదం వాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక వాళ్ళు చెబుతున్న పాయింట్లు, చేస్తున్న బిహేవియర్ ను బట్టి చూసి ఆడియన్స్ కూడా వీళ్ళపై ట్రోల్స్ చేస్తున్నారు.

Related News

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×