OTT Movie : కోర్ట్‌రూమ్ డ్రామా స్టోరీలు ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇలాంటి సినిమాలు, సిరీస్ లను ఆడియన్స్ వదలకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే లీగల్ డ్రామా సీజన్ 1 ఇదివరకే ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో కాజోల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇది ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కి ఓటీటీని షేక్ చేసింది. ఇక సీజన్ 2 కూడా మరింత ఇంటెన్స్ కోర్ట్‌రూమ్ బ్యాటిల్స్, పొలిటికల్ ఇంట్రీగ్‌లతో కొనసాగుతుంది. లీగల్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి, ముఖ్యంగా “యువర్ ఆనర్” లాంటి సిరీస్‌ల ఫాన్స్‌కి ఈ సిరీస్ మంచి వీకెండ్ బింజ్ వాచ్‌గా చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది ట్రయల్: ప్యార్, కానూన్, ధోఖా’ 2025లో విడుదలైన లీగల్ డ్రామా వెబ్ సిరీస్. ఇది అమెరికన్ సిరీస్ “ది గుడ్ వైఫ్” ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్‌ను ఉమేష్ బిస్ట్ డైరెక్ట్ చేయగా, బనిజయ్ ఆసియా నిర్మించింది. ఇందులో కాజోల్ (నోయోనికా సెన్‌గుప్తా), జిషు సెన్‌గుప్తా (రాజీవ్ సెన్‌గుప్తా), షీబా ఛడ్డా (మాలిని ఖన్నా), కుబ్రా సైట్ (సనా), అలీ ఖాన్ (విశాల్) ప్రధాన పాత్రలు పోషించారు. 2025 సెప్టెంబర్ 19 నుండి ఈ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2023 లో వచ్చిన సీజన్ 1 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు 8 ఎపిసోడ్‌లతో సీజన్ 2 మరింత ఇంటెన్స్ క్రియేట్ చేస్తోంది.
సీజన్ 2లో నోయోనికా సెన్‌గుప్తా, తన భర్త రాజీవ్ కరప్షన్ స్కాండల్ తర్వాత లాయర్‌గా తిరిగి రాణిస్తుంది. సీజన్ 1లో ఆమె ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి లా ఫర్మ్‌లో జూనియర్ లాయర్‌గా జాయిన్ అయింది. ఇప్పుడు సీజన్ 2లో ఆమె మరింత కాంప్లెక్స్ కేసులను హ్యాండిల్ చేస్తూ, తన గతంలోని స్కాండల్ షాడోతో డీల్ చేస్తుంది. రాజీవ్ ఇప్పుడు పొలిటికల్ కమ్‌బ్యాక్ కోసం ట్రై చేస్తుంటాడు. ఇక వీళ్ళ మధ్య గ్యాప్ రావడంతో, నోయోనికాను డైవోర్స్ కోసం అడుగుతాడు. కానీ అతని పొలిటికల్ కెరీర్‌కు ఆమె సపోర్ట్ కావాలని కోరుకుంటాడు. ఇది నోయోనికాకు పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో ఛాలెంజెస్ తెచ్చిపెడుతుంది. ఆమె లా ఫర్మ్‌లో తన పొజిషన్ కోసం ఫైట్ చేస్తుండగా, నోయోనికా గత ప్రేమికుడు విశాల్ తిరిగి రావడం కథకు ఎమోషనల్ ట్విస్ట్ యాడ్ చేస్తుంది.
రాజీవ్ పొలిటికల్ డర్టీ గేమ్స్ ఆడుతూ, కథను మరింత ఇంట్రీగింగ్‌గా మారుస్తాడు. మరోవైపు నోయోనికా హై-స్టేక్స్ కేసులను హ్యాండిల్ చేస్తూ, తన ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. రాజీవ్ పొలిటికల్ అంబిషన్స్ కారణంగా వాళ్ల మధ్య టెన్షన్ పెరుగుతుంది. మరోవైపు విశాల్‌తో ఆమె ఎమోషనల్ కనెక్షన్ కాంప్లికేషన్స్ తెచ్చిపెడుతుంది. లా ఫర్మ్‌లో నోయోనికా కొత్త లీగల్ ఛాలెంజెస్ తో పోటీ పడుతుంది. క్లైమాక్స్‌లో నోయోనికా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ? రాజీవ్ స్కాండల్ ఆమె కెరీర్‌ను ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ? అనే సస్పెన్స్ ఆకట్టుకుంటుంది. సీజన్ 2 ఓపెన్ ఎండింగ్‌తో ముగుస్తుంది. ఇది సీజన్ 3కి దారితీసేలా ఉంటుంది.
Read Also : అక్కా చెల్లెల్లు ఇద్దరూ ఒక్కడితోనే… లాస్ట్ కి కేక పెట్టించే కిర్రాక్ ట్విస్ట్