Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో భాగంగా ఇప్పటికే లీగ్ దశ మ్యాచ్ లు ముగిసిపోయాయి. సూపర్ 4 కి టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు చేరుకున్నాయి. సూపర్ 4 లో తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఈనెల 20న జరుగనుంది. ఈనెల 21న పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ తో షేక్ హ్యాండ్ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ వివాదం ఇంకా ముగిసినట్టు కొట్టడం లేదు. ఆసియా కప్ సూపర్ 4లో జరిగే మ్యాచ్ లో టీమిండియా జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తుందా..? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : Asia Cup 2025 : పప్పులో కాలు వేసిన రషీద్ ఖాన్… అది ఔట్ రా బాబు అంటూ పరువు తీసిన అంపైర్
ఇదిలా ఉంటే.. ఆసియా కప్ 2025లో టీమిండియా కప్ సాధిస్తుందని సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా “THE TROPHY IS OURSష అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా, రింకూ సింగ్, బూమ్రా, బాపు, అభిషేక్, స్కై, గిల్, శివమ్, కుల్దీప్, చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్ పేర్లు కలిసి వచ్చేలా క్రియేట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఇక ఆసియా కప్ 2025 సీజన్ లో టీమిండియా ఇప్పటికే యూఏఈ, పాకిస్తాన్ జట్లతో విజయం సాధించి సూపర్ 4 కి అర్హత సాధించింది. మరోవైపు ఇవాళ ఒమన్ తో మ్యాచ్ లో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించినా.. సాధించకపోయిన ఇది నామమాత్రపు మ్యాచ్. దీంతో ఈనెల 21న పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా సూపర్ 4 లో తలపడనుంది.
Also Read : Asia Cup 2025 : మహమ్మద్ నబీ 5 సిక్సర్ల దెబ్బకు శ్రీలంక బౌలర్ తండ్రి చనిపోయాడా?
ఆసియా కప్ 2025లో టీమిండియా జట్టు అన్ని జట్ల కంటే చాలా బలంగా కనిపిస్తోంది. 5 బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, ఇద్దరూ బౌలర్లలో బరిలోకి దిగి విజయాలను సాధిస్తుంది. అయితే ఒమన్ తో జరిగే మ్యాచ్ లో మాత్రం 5గురు బ్యాటర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లు బరిలోకి దిగారు. సూపర్ 4 లో టీమిండియా 21న పాకిస్తాన్, ఈనెల 23న పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, అలాగే ఈనెల 24న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగనుంది. 25న పాకిస్తాన్ బంగ్లాదేశ్, 26న భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరుగనుంది. సూపర్ 4లో టాప్ 2 నిలిచిన జట్లు ఈనెల 28న ఫైనల్ లో తలపడుతాయి. అయితే ఫైనల్ లో భారత్ తో ఏ జట్టు తలపడనుందో వేచి చూడాలి మరీ.