BigTV English

OTT Movie : ఓడలో భీకర మారణకాండ… పోలీసులను బురిడీ కొట్టించే కేటుగాడు… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : ఓడలో భీకర మారణకాండ… పోలీసులను బురిడీ కొట్టించే కేటుగాడు… సీను సీనుకో ట్విస్ట్
Advertisement

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లోనే ఒక ఐకానిక్‌గా నిలిచిన సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన కెవిన్ ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్నాడు. ఈ సినిమా స్టోరీ పూర్తిగా ట్విస్ట్ లతో నిండి ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ చేత కేకలు కూడా పెట్టించింది. ఒక డ్రగ్ లార్డ్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. అతన్ని పట్టుకునే క్రమంలో ఈ సినిమా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

‘The Usual Suspects’ 1995లో విడుదలైన అమెరికన్ నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. బ్రయాన్ సింగర్ దర్శకత్వంలో కెవిన్ స్పేసీ (వెర్బల్ కింట్), గాబ్రియల్ బైర్న్ (డీన్ కీటన్), స్టీఫెన్ బాల్డ్విన్ (మైఖేల్ మక్‌మానస్), బెనిసియో డెల్ టోరో (ఫ్రెడ్ ఫెన్స్టర్), కెవిన్ పొలాక్ (టాడ్ హాక్నీ), చాజ్ పాల్మింటెరి (డేవ్ కుజాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1995 ఆగస్టు 16న USలో విడుదలై, 1 గంట 46 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 8.5/10 రేటింగ్ పొందింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు, ఆపిల్ టీవీ, యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

ఈ సినిమా లాస్ ఏంజిల్స్‌లో ఒక ఓడలో జరిగే భారీ పేలుడుతో మొదలవుతుంది. ఈ ఘటనలో 27 మంది చనిపోతారు. $91 మిలియన్ల డ్రగ్ డీల్ నాశనమవుతుంది. వెర్బల్ అనే ఒక క్రిమినల్ ఈ ఘటనలో బతికి బయట పడతాడు. ఇక పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో డిటెక్టివ్ డేవ్ కుజన్ కి తన కథ చెప్తాడు. వెర్బల్ చెప్పే ఫ్లాష్‌బ్యాక్‌లో, ఆరు వారాల క్రితం న్యూయార్క్‌లో ఒక లైనప్‌లో తనతో పాటు నలుగురు క్రిమినల్స్—కీటన్, మైఖేల్, ఫ్రెడ్, టాడ్ కలిసి ఒక గ్యాంగ్‌గా ఎలా ఏర్పడ్డారో వివరిస్తాడు. వీళ్లు మొదట ఒక ట్రక్ దొంగతనం చేసి, తర్వాత కీసర్ సోజ్ అనే మిస్టీరియస్ క్రిమినల్ బాస్ కోసం డ్రగ్ డీల్‌లో పని చేశామని, కీసర్ సోజ్ టర్కీలో తన ఫ్యామిలీని చంపిన హంగేరియన్ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకున్న క్రూరమైన క్రిమినల్ అని, ఈ పేలుడు వెనుక అతని ప్లాన్ ఉందని చెప్తాడు.


వెర్బల్ కథ ప్రకారం కీటన్ ఒక మాజీ కరప్ట్ కాప్. ఈ గ్యాంగ్‌ని లీడ్ చేస్తుంటాడు. కానీ కీసర్ సోజ్ అతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఒక హంగేరియన్ డ్రగ్ లార్డ్‌ని చంపమని ఆర్డర్ ఇస్తాడు. అయితే ఈ మిషన్ పూర్తిగా సోజ్ సెటప్. తన శత్రువులను తుడిచిపెట్టడానికి ఈ గ్యాంగ్‌ని వాడుకుంటాడు. కుజన్, వెర్బల్ కథ విని, కీటన్‌నే కీసర్ సోజ్ అని అనుమానిస్తాడు. వెర్బల్‌ని బెయిల్‌పై వదిలేస్తాడు. కానీ చివరి ట్విస్ట్‌లో వెర్బల్ చెప్పిన కథలోని పేర్లు, డీటెయిల్స్ అన్నీ పోలీస్ స్టేషన్‌లోని నోటీస్ బోర్డ్ నుంచి తీసినవే. నిజానికి కీసర్ సోజ్ ఎవరో కాదు వెర్బల్. అతను అందరినీ మోసం చేసి స్మార్ట్‌గా తప్పించుకుంటాడు.

Read Also : కిటికీలోంచి చూడకూడని సీన్ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకునే కుర్రాడు… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సర్వైవల్ థ్రిల్లర్

Related News

OTT Movie : పక్కనున్న భార్య మిస్సింగ్ అంటూ కేసు… పోలీసులకే పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : పెళ్లీడు పిల్లలుండగా పక్కింటి ఆంటీ ఇంట్లోకి… ఫైట్స్ లేవు, రొమాన్స్ లేదు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్

Mirai: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సరికొత్త సంచలనం.. కుమ్మేశాడుగా!

OTT Movie : ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై పన్ను… ఫ్యామిలీతో చూడకూడని సీన్లున్న హిస్టారికల్ మూవీ

OTT Movie : మెడికల్ కాలేజీలో వరుస మరణాలు… అమ్మాయిల టార్గెట్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : క్రిమినల్ ను పట్టుకోవడానికెళ్లి తప్పించుకోలేని ట్రాప్ లో… చిన్న పిల్లలు చూడకూడని సై-ఫై మూవీ

OTT Movie : కంటికి కన్పించని అబ్బాయితో ప్రేమ… డైరీనే దిక్కు… మస్ట్ వాచ్ మలయాళ అడ్వెంచర్ డ్రామా

OTT Movie :లేడీ డ్రైవర్ తో లేకి పనులు… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్… డోంట్ మిస్

Big Stories

×