OTT Movie : ఓటీటీలోకి ఈ వారం మూడు సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఈ సినిమాలు థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని, ఓటీటీలో కూడా దూసుకుపోవడానికి సిద్దపడుతున్నాయి. వీటిలో ఒక తెలుగు మూవీ కూడా ఉంది. ఈ సినిమాలన్నీ IMDb లో టాప్ రేటింగ్ ను కలిగి ఉన్నాయి. ఈ సినిమా పేర్లు ఏమిటి ? ఏ ఓటీటీలో కి వస్తున్నాయి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
‘ది వెర్డిక్ట్’ (The verdict)
2025 లో వచ్చిన ఈ తమిళ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీకి కృష్ణ శంకర్ దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్, శ్రుతి హరిహరన్, సుహాసిని మణిరత్నం, విద్యూ రామన్, ప్రకాష్ మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అగ్ని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రకాష్ మోహన్‌దాస్ ఎన్. గోపీ కృష్ణన్ నిర్మించారు. ఆదిత్య రావు సంగీతం సమకూర్చారు. ఈ మూవీ 2025 మే 30న థియేటర్లలో విడుదలైంది. 2025 జూన్ 26 నుంచి ఈ సినిమా SunNXTలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ అమెరికాలో జరిగే ఒక హత్య చుట్టూ తిరుగుతుంది. IMDb లో ఈ సినిమాకి 8.9/10 రేటింగ్ ఉంది.
‘ఒక పధకం ప్రకారం’ (Oka Padhakam Prakaram)
2025 లో వచ్చిన ఈ లీగల్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీకి వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. ఇందులో సాయిరామ్ శంకర్, ఆశిమా నర్వాల్, శృతి సోఢి, పి. సముద్రిఖని, భాను శ్రీ, పల్లవి గౌడ, రవి పచ్చముత్తు ప్రధాన పాత్రల్లో నటించారు. వినోద్ విహాన్ ఫిల్మ్స్, విహారి సినిమా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై గర్లపాటి రమేష్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 7 న థియేటర్లలోవిడుదలై, జూన్ 27నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఈ స్టోరీ ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఒక లాయర్ చుట్టూ తిరుగుతుంది. 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 8.4/10 రేటింగ్ ఉంది.
‘ఆజాది’ (Azadi)
2025 లో వచ్చిన ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి జో జార్జ్ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీనాథ్ భాసి, లాల్, వాణి విశ్వనాథ్, రవీనా రవి , సైజు కురుప్, అబిన్ బినో, రాజేష్ శర్మ, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. లిటిల్ క్రూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఫైజల్ రాజా దీనిని నిర్మించారు. యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. జైలులో ఉండే ఒక గర్భిణీ అయిన నెరస్థురాలి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. 2025 మే 23న థియేటర్లలో విడుదలై, 2025 జూన్ 27 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. IMDb లో ఈ సినిమాకి 7.4/10 రేటింగ్ ఉంది.
Read Also : హై ఎండ్ రెస్టారెంట్లో డేట్… అమ్మాయి ఫోన్ కు వచ్చే మెసేజులు చూస్తే మైండ్ బ్లాక్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్