Moiz Abbas Shah: 2019లో జరిగిన పూల్వామా దాడి ఘటన ఇప్పటికీ మరిచిపోలేం. ఈ ఘటన యావత్ భారత్ దేశాన్ని కలిచివేసింది. ఈ దాడిలో 40 మంది సైనికులు మృతిచెందారు. ఈ దాడులను ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై దాడులను కూడా చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఇరు దేశాల మధ్య పెద్ద యుద్ధమే జరిగే వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే భారత్ టార్గెట్‌గా పాకిస్తాన్ పంపిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని అప్పటి భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ తన మిగ్-21 బైసన్ విమానంతో పాక్ విమానాన్ని వెంటాడి మరీ కూల్చివేసిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలోనే అభినందన్ నడుపుతున్న విమానం దెబ్బతిని పాకిస్తాన్ భూభాగంలో పడిపోయింది. కానీ అభినందన్ వర్దమాన్ మాత్రం ప్యారాషూట్ సహాయంతో సేఫ్‌గా పాక్ భూభాగంపై ల్యాండ్ అయ్యాడు. పాక్ భూభాగంలో ల్యాండ్ అయిన వింగ్ కమాండర్ అభినందన్ ను పాక్ దేశ సైనికులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు. అయితే.. అప్పుడు అభినందన్ ను పట్టుకున్న పాకిస్థాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఇవాళ పాకిస్తాన్‌లో జరిగిన ఓ ఉగ్రవాదుల దాడిలో హతమయ్యాడు.
ALSO READ: Rain Forecast: కొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్
తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) తీవ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోయిజ్ అబ్బాస్ షా మరణించారు. ఈ సంఘటన ఇవాళ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలోని దక్షిణ వజీరిస్తాన్‌లోని సరరోఘా ప్రాంతంలో జరిగింది. పాకిస్తాన్ సైన్యం ఇంటెలిజెన్స్ ఆధారంగా టీటీపీ, పాక్ సైనికులపై దాడి చేసింది. ఈ ఆపరేషన్‌లో మేజర్ మోయిజ్ అబ్బాస్ షాతో పాటు లాన్స్ నాయక్ జిబ్రాన్ ఉల్లా మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది టీటీపీ తీవ్రవాదులు హతం కాగా.. మరో ఏడుగురు గాయపడినట్లు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. అయితే, కొన్ని నివేదికల ప్రకారం, ఈ దాడిలో 14 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. కానీ పాకిస్తాన్ మీడియా మాత్రం ఆరుగురు మరణించారని పేర్కొంది.
ALSO READ: MECL: టెన్త్, ఐటీఐతో ఉద్యోగాలు.. రూ.55,900 జీతంతో ఉద్యోగాలు, ఇంకా కొన్ని రోజులే భయ్యా..
మేజర్ మోయిజ్ షా మరణం పాకిస్తాన్ ఆర్మీకి భారీ నష్టం చేకూరిన్టటు భావిస్తున్నారు. అతని అంత్యక్రియలు చక్లాలా గారిసన్‌లో జరిగాయి. అయితే.. ఒకానొక సమయంలో పాకిస్తాన్ దేశానికి అండగా నిలిచిన ఈ తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ.. ఇప్పుడు పాక్‌పై వ్యతిరేక దాడులకు దిగుతోంది.