OTT Movie : రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ మధ్య చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. వీటిని ప్రేక్షకులు కూడా బాగా అదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఒక నౌకాదళ అధికారి హత్య కేసు చుట్టూ తిరిగే, కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. 1959లో జరిగిన ఒక రియల్ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సిరీస్ 10-ఎపిసోడ్స్ తో ఒక కాంప్లెక్స్ కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ప్రతీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జీ 5 ZEE5 లో
ఈ మిస్టరీ వెబ్ సిరీస్ పేరు ‘The Verdict – State vs Nanavati’. 2025లో విడుదలైన ఈ హిందీ డ్రామా సిరీస్ ను ఏక్తా కపూర్ రూపొందించారు. ఇరాదా ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా దీనిని నిర్మించారు. ఇది జీ 5 ZEE5 ప్లాట్ ఫామ్‌లలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌కు శశాంత్ షా దర్శకత్వం వహించారు. ఇందులో మనవ్ కౌల్ (కవాస్ నానావతి), ఎల్లీ అవ్రామ్ (సిల్వియా నానావతి), సుమీత్ వ్యాస్ (రామ్ జేఠ్మలానీ), విరాఫ్ పటేల్ (ప్రేమ్ అహుజా), మకరంద్ దేశ్‌పాండే (చందు త్రివేది) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 1959లో రియల్ గా జరిగిన ప్రసిద్ధ భారతీయ కేసు, K.M. Nanavati v. State of Maharashtra ఆధారంగా రూపొందింది.
స్టోరీలోకి వెళితే
భారత నౌకాదళ కమాండర్ కవాస్ నానావతి ఒక గౌరవనీయమైన దేశభక్తిగల అధికారి. కవాస్, సిల్వియా అనే బ్రిటిష్ మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే కవాస్ తన నౌకాదళ విధుల కోసం తరచూ ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇది సిల్వియాను ఒంటరితనంలోకి నెట్టివేస్తుంది. ఈ సమయంలో, ఆమె వ్యాపారవేత్త అయిన ప్రేమ్ అహుజాతో సన్నిహిత సంబంధం పెట్టుకుంటుంది. కవాస్ ఒక విజయవంతమైన నౌకాదళ మిషన్ నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, సిల్వియా అక్రమ సంబంధం బయటపడుతుంది. ఆగ్రహంతో గుండెలు పగిలిన కవాస్, ప్రేమ్ అహుజాను ఎదిరిస్తాడు. 1959 ఏప్రిల్ 27న, కవాస్ తన సర్వీస్ రివాల్వర్‌తో అహుజా ఇంటికి వెళతాడు. అతను అహుజాపై మూడు రౌండ్లు కాల్పులు జరిపి, అతన్ని హత్య చేస్తాడు. కవాస్ వెంటనే పోలీసులకు లొంగిపోతాడు. కానీ కోర్టులో “నాట్ గిల్టీ” అని వాదిస్తాడు. ఈ హత్య ఒక “ఆనర్ కిల్లింగ్”గా, అంటే తన భార్య అవమానానికి ప్రతీకారంగా జరిగిన చర్యగా అతను సమర్థించుకుంటాడు.
ఈ కేసు భారతదేశంలో ఒక సంచలనంగా మారుతుంది. ఇది దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలను రేకెత్తిస్తుంది. కవాస్‌ను ఒక దేశభక్తిగల నౌకాదళ హీరోగా చూసే ప్రజలు అతనికి మద్దతు ఇస్తారు. అతన్నిబాధితుడిగా భావిస్తారు. కోర్ట్‌రూమ్‌లో, కవాస్ కేసును న్యాయవాది కారల్ ఖండలవాలా వాదిస్తాడు. అతను కవాస్ చర్యలను ఆనర్ కిల్లింగ్‌గా సమర్థిస్తాడు. దీనికి వ్యతిరేకంగా చందు త్రివేది నాయకత్వంలో, రామ్ జేఠ్మలానీ సహాయంతో, దీనిని హత్యగా వాదిస్తారు. చివరికి ఈ కేసుకి ఎలాంటి తీర్పు వస్తుంది ? ఈ కేసు ఎలాంటి సంచలనాలు సృష్టించింది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.