OTT Movies : ఈ మధ్య ఓటీటీ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాలు అన్నీ మంచి సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి. ఇటీవల రిలీజ్ అవుతున్న స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా థియేటర్లలో హిట్ అవ్వడమే కాదు. ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నాయి. అయితే ఒక సినిమా రిలీజ్ అవ్వగానే మరో సినిమా రిలీజ్ అవుతూ మూవీ లవర్స్ ను అలరిస్తున్నాయి. మాములు కుటుంబ కథా చిత్రాల కన్నా ఎక్కువగా హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో డిమాండ్ ఎక్కువగానే ఉంటుందన్న విషయం తెలిసిందే.. అయితే ఇక్కడ బెస్ట్ హారర్ సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..
లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2..
సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సిరీస్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో వీటి పై కొందరు ఫోకస్ చేస్తున్నారు. లాస్ట్ ఆఫ్ అజ్‍కు రెండో సీజన్ వచ్చేసింది. ఈ సిరీస్ రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఈ వారం సోమవారం నుంచి ఓటీటీలో ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మే 26వ తేదీ వరకు ప్రతీ సోమవారం ఓ ఎపిసోడ్ హాట్‍స్టార్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్‍లో పెడ్రో కాస్టెల్, బెల్లా రామ్సే లీడ్ రోల్స్ చేశారు. ఈ సిరీస్ గతంలో భారీ వ్యూస్ ను రాబట్టింది.. ఇప్పుడు అదే విధంగా వ్యూస్ ను రాబడుతుందని తెలుస్తుంది.
ఖౌఫ్..
హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఖౌఫ్’ ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇందులో మోనికా పవర్, చమ్ దరంగ్, అభిషేక్ కపూర్, రతజ్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు.. ఇది భయంకరమైన హారర్ సన్నివేశాలను కలిగి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో మీరు దీన్ని చూసి ఎంజాయ్ చెయ్యండి.
దావీద్..
భారీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇదొక మలయాళ మూవీ.. ఆంటోనీ వర్గీస్, లిజోమోల్ జోస్, మో ఇస్మాయిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గోవింద్ విష్ణు దర్శకత్వం వహించారు.. ఫిబ్రవరి 14 న స్ట్రీమింగ్ కు వచ్చింది.. ఇప్పుడు రెండు నెలల తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 18న జీ5 ఓటీటీలోకి దావీద్ చిత్రం అడుగుపెట్టనుంది..
బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా మేరే హస్బెండ్ కీ బీవీ.. ఏప్రిల్ 18వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ చేశారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. ఇక ఇవే కాదు వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాలను కూడా ఓటీటీ సంస్థలు అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి.. మరికొన్ని కొత్త సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ఈ సినిమాలు, సిరీస్ లు బెస్ట్ హారర్ సన్నివేశాలను కలిగి ఉన్నాయి. మిస్ అవ్వకుండా చూసేయ్యండి.