OTT Movie : మలయాలం సినిమలకు క్రేజ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. వీటిపై ఓ లుక్ వేస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. మంచి కంటెంట్ ఉన్న స్టోరీలతో ముందుకు వస్తున్నారు ఈ దర్శకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా, అవార్డుల పంటను కూడా పండించింది. 68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మలయాళంలో ఉత్తమ చలనచిత్రం అవార్డును ఈ మూవీ గెలుచుకుంది. సెన్నా హెగ్డే 51వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో, ఉత్తమ కథగా అవార్డును అందుకుంది. ఈ సినిమా ‘మలయాళ సినిమా టుడే’ విభాగంలో, 25 వ కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి కూడా ఎంపికైంది. ఇన్ని రికార్డ్ లు సాధించిన ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
విజయన్ గల్ఫ్ లో కొంత కాలం పని చేసి తిరిగి ఇంటికి వస్తాడు. ఇతన్ని అందరూ కువైట్ విజయన్ అని పిలుస్తుంటారు. విదేశాల్లో ఉండే లక్ష్మీ కాంతంతో, పెళ్లీడుకు వచ్చిన తన రెండవ కుమార్తె సుజాకి నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే సుజాకి ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమె మరొకరిని రహస్యంగా ప్రేమిస్తూ ఉంటుంది. విజయన్ పెద్ద కుమార్తె సురభి తండ్రికి చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుని ఉంటుంది. ఈ విషయం మీద ఆమెపై ఇంకా కోపంగా ఉంటాడు విజయన్. దీనివల్ల కుటుంబంలో ఎవరికీ మనశాంతి లేకుండా ఉంటుంది. అందుకే తండ్రికి ఎదురు చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది చిన్న కూతురు సుజా.
విజయన్ సాంప్రదాయక పద్దతులకు విలువ ఇచ్చే వ్యక్తి. అతను సమాజంలో తన గౌరవాన్ని తిరిగి పొందడానికి, సుజా వివాహాన్ని ఒక అవకాశంగా భావిస్తాడు. అయితే అతను ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతుంటాడు. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో అనుకోని ట్విస్ట్ లు వస్తాయి. చివరికి ఈ పెళ్లి జరుగుతుందా ? సుజా కూడా బాయ్ ఫ్రెండ్ తో లేచిపోతుందా ? ఈ తండ్రికి సమాజంలో గౌరవం దక్కదా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : వీడెక్కడి సైకోనండి బాబు, పాట పాడకపోతే మనుషుల్ని చంపేస్తున్నాడు … మతిపోయే ట్విస్టులు ఉన్న మలయాళం థ్రిల్లర్
సోనీ లివ్ (Sony LIV) లో
ఈ మలయాళ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘తింకలజ్చ నిశ్చయం’ (Thinkalazhcha Nishchayam). 2021 లో విడుదలైన ఈ సినిమాకి సెన్నా హెగ్డే దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని కన్హంగడ్ పట్టణంలో జరిగే, ఒక నిశ్చితార్థ వేడుక చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ (Sony LIV) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.