E-Paper
Advertisement

మైండ్ గేమ్ తో మెంటలెక్కించే మోసాలు… ఇద్దరు మేధావుల మధ్య సాగే అల్టిమేట్ క్రైమ్ థ్రిల్లర్

మైండ్ గేమ్ తో మెంటలెక్కించే మోసాలు… ఇద్దరు మేధావుల మధ్య సాగే  అల్టిమేట్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Thriller Movie OTT : ఎప్పుడైనా బోర్ కొడితే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం మిస్ చేయకండి. ఈ సినిమా నిజంగానే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా విజువల్స్, నటీనటుల నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం సహా నాలుగు విభాగాల్లో నామినేట్ అయింది. మరి స్టోరీ కూడా అలానే ఉంటుంది. 1940ల కాలంలో సాగే ఈ కథ ఒక సర్కస్ లో పనిచేసే ఒక తెలివైన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను బాగా డబ్బున్న వాళ్ళను మోసం చేసి పైకి ఎదగాలని ప్లాన్ చేస్తాడు. అయితే అంతకన్నా తెలివైయిన మహిళ అతన్ని ఓ ఆట ఆడేసుకుంటుంది. ఈ సినిమా సుమారు 2 గంటల 30 నిమిషాల నిడివి ఉంటుంది. అయితే ఎక్కడా బోరింగ్ గా ఉండదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న ఆతృత మాత్రమే ఉంటుంది.

ఎక్కడ చూడవచ్చు అంటే

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నైట్‌మేర్ అల్లే’ (Nightmare Alley). 2021లో వచ్చిన ఈ సినిమాకు గిల్లెర్మో డెల్ టోరో దర్శకత్వం వహించారు. ఆయన గతంలో ‘ది షేప్ ఆఫ్ వాటర్’ వంటి సినిమాలతో ఆస్కార్ గెలుచుకున్నారు. ఈ సినిమాను చాలా రిచ్‌గా, 1940ల కాలం నాటి వాతావరణం ఉట్టిపడేలా నిర్మించారు. బ్రాడ్లీ కూపర్ ఈ సినిమా కోసం తన నటనను కొత్త కోణంలో చూపించారు. కేట్ బ్లాంచెట్ పోషించిన ‘లిలిత్ రిట్టర్‌’ పాత్ర సినిమాకే హైలైట్. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. ఈ సినిమా 94వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వంటి 4 విభాగాల్లో నామినేషన్లు పొందింది. ఈ చిత్రం ప్రస్తుతం Jio Hotstar, Amazon Prime Video ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

స్టాంటన్ కార్లిస్లే అనే ఒక వ్యక్తి సర్కస్‌లో పనికి చేరుతాడు. అక్కడ ఒక జంట దగ్గర మనుషుల మనసును చదివి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చెప్పే ట్రిక్కులు నేర్చుకుంటాడు. ఆ విద్యలో ఆరితేరిన తర్వాత, తనతో పాటు ఉన్న మోలీ అనే అమ్మాయిని తీసుకుని సిటీకి వెళ్తాడు. అక్కడ పెద్ద పెద్ద ధనవంతులను తన మాటలతో నమ్మించి డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. అక్కడే అతనికి లిలిత్ రిట్టర్ అనే ఒక తెలివైన సైకియాట్రిస్ట్ పరిచయం అవుతుంది. ఆమె దగ్గర ఉన్న డబ్బున్న వ్యక్తులను ఉపయోగించుకుని, ఇంకా పెద్ద మొత్తంలో మోసం చేయాలని స్టాంటన్ పథకం వేస్తాడు.

అయితే ఒక కోటీశ్వరుడిని నమ్మించి మోసం చేసే క్రమంలో, స్టాంటన్ ప్రమాదంలో పడతాడు. డాక్టర్ లిలిత్ కూడా అతడిని తన స్వార్థం కోసం వాడుకుని మోసం చేస్తుంది. చివరికి తను నమ్మిన విద్యే తనను ముంచేస్తుంది. పోలీసుల నుండి తప్పించుకుని, సర్వస్వం కోల్పోయిన స్టాంటన్ మళ్లీ తిరుగుతూ ఒక సర్కస్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ యజమాని అతనికి అడవి మనిషిలా ఉండే పాత్ర వేషం వేస్తావా అని అడిగితే, విధి ఆడిన వింత నాటకానికి నవ్వుకుంటూ సరే అని ఒప్పుకుంటాడు. ఒకప్పుడు తను ఎగతాళి చేసిన పనిలోనే మళ్ళీ చేరడంతో కథ ముగుస్తుంది.

Advertisement

Read Also : మాఫియా డాన్ల మధ్య మొదలయ్యే వేట… ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టించేలా చేసే సినిమా

Related News

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

Big Stories

Advertisement
×