Thriller Movie OTT : ఓటీటీలోకి ఒక సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అడుగు పెట్టింది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకి ఇది పక్కా వీకెండ్ వాచ్. ఈ సిరీస్‌లో మెయిన్ హైలైట్ ఏంటంటే.. హాలీవుడ్ స్టార్స్ నికోల్ కిడ్‌మాన్, జేమీ లీ కర్టిస్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం. వీళ్లిద్దరూ రియల్ లైఫ్‌లో మంచి ఫ్రెండ్స్, కానీ ఇందులో అక్కాచెల్లెళ్లుగా నటించారు. ఒక సైకో కిల్లర్ ని పట్టుకునే క్రమంలో ఈ కథ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మొదటి సీజన్ హిట్ అవ్వడంతో, ఆల్రెడీ రెండో సీజన్ షూటింగ్ ప్లాన్ కూడా మొదలైపోయింది.
ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘స్కార్పెట్టా’ (Scarpetta). ఇందులో ప్రముఖ హాలీవుడ్ నటీమణులు నికోల్ కిడ్‌మాన్, జేమీ లీ కర్టిస్ ప్రధాన పాత్రలు పోషించారు. పాట్రిసియా కార్న్‌వెల్ రాసిన ప్రసిద్ధ నవలల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఇందులో నికోల్ కిడ్‌మాన్ ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ డాక్టర్ కే స్కార్పెట్టా పాత్రలో కనిపిస్తారు. ఇది 2026 మార్చి 11న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ మొదటి సీజన్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఒకేసారి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇది ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
ఇందులో మెయిన్ క్యారెక్టర్ స్కార్పెట్టా ఒక పెద్ద డాక్టర్ (ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్). ఈమె చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వర్జీనియాలోని తన పాత గూటికి తిరిగి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక రేంజ్‌లో సీరియల్ కిల్లర్ రెచ్చిపోతుంటాడు. ఆ కిల్లర్‌ని పట్టుకోవాలంటే స్కార్పెట్టా లాంటి టాలెంట్ పర్సన్ దిగాల్సిందే. బాడీలను పోస్ట్‌మార్టం చేస్తూ, వాళ్లు ఎలా చనిపోయారో చిన్న చిన్న క్లూస్‌తో కనిపెట్టడం ఈమె స్పెషాలిటీ.
కథలో అసలు మజా ఎక్కడంటే.. స్కార్పెట్టాకి తన అక్క డోరతీతో అస్సలు పడదు. వీళ్లద్దరి మధ్య పాత గొడవలు, ఇగోలు బోలెడు ఉంటాయి.
ఒక పక్క ఊర్లో హత్యలు జరుగుతుంటే, ఇంకో పక్క ఈ అక్కాచెల్లెళ్ల గొడవలు స్టోరీని మలుపులు తిప్పుతుంటాయి. స్కార్పెట్టా టీమ్‌లో అసిస్టెంట్లు, పోలీస్ ఆఫీసర్లతో కలిసి ఆ హంతకుడు ఎవడో అని వేటాడటం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక ఈ కిల్లర్ కూడా మామూలోడు కాదు. హత్యలకు టెక్నాలజీని కూడా వాడేస్తుంటాడు. చివరికి వీడిని స్కార్పెట్టా తన తెలివితేటలతో ఎలా కనిపెట్టింది? తన ఫ్యామిలీ గొడవలను ఎలా సెట్ చేసుకుంది? అనేదే ఈ వెబ్ సిరీస్ అసలు కథ.
Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ సిరీస్… నకిలీ పాస్‌పోర్ట్‌ల తయారీ చుట్టూ క్రేజీ గా… ఎక్కడ చూడచ్చో తెలుసా ?