E-Paper
Advertisement

Thriller Movies OTT : ప్రైమ్ వీడియోలో కెవ్వు కేక అనిపించే థ్రిల్లర్‌లు… వీటిలో మీరెన్ని చూశారు ?

Thriller Movies OTT : ప్రైమ్ వీడియోలో కెవ్వు కేక అనిపించే థ్రిల్లర్‌లు… వీటిలో మీరెన్ని చూశారు ?
Advertisement

Thriller Movies OTT : అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి బోలెడన్ని సినిమాలు కనిపిస్తాయి కానీ, కొన్ని సినిమాలు మాత్రం చూస్తున్నంత సేపు మనల్ని సీటు అంచున కూర్చోబెడతాయి. మైండ్ బెండింగ్ ట్విస్టులకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఐదు థ్రిల్లర్ సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

1. అంధాదున్ (Andhadhun)

ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. ఒక పియానో ప్లేయర్ (ఆయుష్మాన్ ఖురానా) అంధుడిగా నటిస్తూ ఒక మర్డర్ సీన్ చూడాల్సి వస్తుంది. అక్కడి నుండి కథ ఎటు వెళ్తుందో మనం అస్సలు ఊహించలేం. ఇందులో టబు క్యారెక్టర్ చూస్తే షాక్ అవుతాం. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ చూశాక, అసలు ఏం జరిగింది? అని పది నిమిషాల పాటు ఆలోచిస్తాం. ఇప్పటికీ సోషల్ మీడియాలో దీని క్లైమాక్స్ మీద డిస్కషన్లు జరుగుతూనే ఉంటాయి.

2. ఆంఖే (Aankhen)

Advertisement

ఇది పాత సినిమానే అయినా, దీని కాన్సెప్ట్ చాలా క్రేజీగా ఉంటుంది. ఒక బ్యాంక్ మేనేజర్ (అమితాబ్ బచ్చన్) తన ఉద్యోగం పోవడంతో పగ తీర్చుకోవడానికి ముగ్గురు గుడ్డివాళ్లతో బ్యాంక్ రాబరీ ప్లాన్ చేస్తాడు. అసలు చూపు లేని వాళ్లు బ్యాంక్ ఎలా దోచుకుంటారు అనే పాయింట్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆ కాలంలోనే ఇలాంటి ఒక పక్కా ప్లానింగ్ మూవీ రావడం గ్రేట్.

3. NH 10

ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఒక జంట సరదాగా రోడ్ ట్రిప్‌కి వెళ్తే, అక్కడ అనుకోకుండా ఒక గొడవలో చిక్కుకుంటారు. సిటీలో పెరిగిన ఒక అమ్మాయి, గన్ కల్చర్ ఉన్న ఊరిలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్లిందో ఇందులో చూడొచ్చు. అనుష్క శర్మ నటన అదిరిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఒక రకమైన టెన్షన్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.

4. తలాష్ (Talaash)

Advertisement

ఆమిర్ ఖాన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమా స్టార్టింగ్‌లో నార్మల్ ఇన్వెస్టిగేషన్ లాగే అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లే కొద్దీ కథలో ఎమోషన్స్, సస్పెన్స్ పెరుగుతాయి. సినిమా చివర్లో వచ్చే ఆ ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక తండ్రి పడే బాధను కూడా చాలా బాగా చూపిస్తుంది.

5. కహానీ 2 (Kahaani 2)

విద్యాబాలన్ తన యాక్టింగ్‌తో మనల్ని కట్టిపడేస్తుంది. ఒక చిన్న పాపని కాపాడుకోవడానికి ఒక తల్లి చేసే పోరాటం ఇది. కథలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ చాలా ఉత్కంఠంగా ఉంటాయి. దుర్గా రాణి సింగ్ అనే క్యారెక్టర్ చుట్టూ అల్లిన సస్పెన్స్ బాగుంటుంది. ఈ సినిమాలన్నీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ వీకెండ్ ఏదైనా మంచి థ్రిల్లర్ చూడాలి అనుకుంటే, వీటిలో ఏదో ఒకటి ట్రై చేయండి.

Read Also : బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ‘ల్యాండ్‌లార్డ్’… స్ట్రీమింగ్ కోసం ఎదురు చూపులు

Related News

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్‌ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్‌

This week OTT Movies : ఓటీటీ లవర్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏకంగా 25 స్ట్రీమింగ్..!

వేశ్యపై మనసు పడే తాగుబోతు… మనసుకు హత్తుకునే తమిళ రొమాంటిక్ డ్రామా

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×