E-Paper
Advertisement

Thriller Web series: మూడు ఎపిసోడ్లతో కేక పెట్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్… ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే ?

Thriller Web series: మూడు ఎపిసోడ్లతో కేక పెట్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్… ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
Advertisement

Thriller Web series: ఓటీటీలో రీసెంట్ గా ఒక క్రైమ్ మిస్టరీ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇది ఉన్నది మూడు ఎపిసోడ్స్ కాని స్టోరీ చాలా ఇంటెన్స్ గా సాగుతుంది. ఆడియన్స్ నుంచి కూడా దీనికి బాగా రెస్పాన్స్ వస్తోంది. ఒక డెత్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ సిరీస్ ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటుంది క్లైమాక్స్ వరకు. ఇది తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ మిస్టరీ సిరీస్ పేరు ‘అగాథా క్రిస్టీస్ సెవెన్ డయల్స్’ (Agatha Christie’s Seven Dials). ఈ బ్రిటిష్ మినీసిరీస్, 1929లో అగాథా క్రిస్టీ రాసిన ది సెవెన్ డయల్స్ మిస్టరీ నవల ఆధారంగా రూపొందింది. క్రిస్ స్వీనీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మియా మెక్‌కెన్నా-బ్రూస్, ఎడ్వర్డ్ బ్లూమెల్, ఇయాన్ గ్లెన్, మార్టిన్ ఫ్రీమాన్, హెలెనా బోన్‌హామ్ కార్టర్ నటించారు. మూడు ఎపిసోడ్ల ఈ సిరీస్ 2026 జనవరి 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగుతో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

‘చిమ్నీస్’ అనే ఒక విలాసవంతమైన కోటలో ఒక సరదా పార్టీ జరుగుతుంది. అందులో గెర్రీ వేడ్ అనే వ్యక్తి ఎప్పుడూ కుంభకర్ణుడిలా నిద్రపోతుంటాడు. అతన్ని ఆటపట్టించడానికి అతని స్నేహితులు అర్ధరాత్రి గెర్రీ గదిలోకి వెళ్లి ఎనిమిది అలారం గడియారాలను పెడతారు. కానీ తెల్లారేసరికి గెర్రీ నిద్రలోనే చనిపోయి కనిపిస్తాడు. విచిత్రంగా ఎనిమిది గడియారాల్లో ఒకటి మాయమై, మిగిలిన ఏడు గడియారాలు ఒక వరుసలో ఉంటాయి. ఆ తర్వాత అతని మరో స్నేహితుడు కూడా అనుమానాస్పదంగా చనిపోవడంతో, ఈ మరణాల వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని బండిల్ అనే అమ్మాయికి అర్థమవుతుంది.

బండిల్ ఈ కేసును ఆరా తీస్తూ వెళ్తుంటే.. లండన్‌లోని ఒక సీక్రెట్ గల్లీలో ‘సెవెన్ డయల్స్’ అనే క్లబ్ గురించి తెలుస్తుంది. ముసుగులు వేసుకున్న ఏడుగురు వ్యక్తులు అక్కడ రహస్య సమావేశాలు జరుపుతుంటారు. వాళ్లు అంతర్జాతీయ నేరగాళ్లని బండిల్ భ్రమపడుతుంది. కానీ చివరికి తెలిసే అసలు నిజం ఏంటంటే.. ఆ ఏడుగురు వ్యక్తులు నేరగాళ్లు కాదు, దేశ రహస్యాలను కాపాడే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. గెర్రీ వేడ్‌ను చంపింది ఎవరో కాదు, అతనికి నమ్మకమైన స్నేహితుడిలా నటించిన జిమ్మీ థెసిగర్ అని బండిల్ కనిపెడుతుంది. సూపరింటెండెంట్ బ్యాటిల్ సాయంతో నిందితులను పట్టుకోవడంతో ఈ మిస్టరీ ముగుస్తుంది.

Advertisement

Read Also : 16 ఏళ్లకే క్యాన్సర్… చావులోనూ చచ్చేంత ప్రేమ… కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×