BigTV English

OTT Movie : ఆన్ లైన్ లో భర్త ప్రైవేట్ వీడియో… ఓటీటీలో దుమ్మురేపుతున్న ప్రియమణి కోర్టు రూమ్ డ్రామా

OTT Movie : ఆన్ లైన్ లో భర్త ప్రైవేట్ వీడియో… ఓటీటీలో దుమ్మురేపుతున్న ప్రియమణి కోర్టు రూమ్ డ్రామా

OTT Movie : సౌత్ హీరోయిన్ ప్రియమణి నటిస్తుంది అంటే అది వెబ్ సిరీస్ అయినా, లేదా సినిమా అయినా అదిరిపోయే కంటెంట్ ఉండడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు మూవీ లవర్స్. అందులోనూ ‘భామా కలాపం’ వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు వరుసగా వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ క్రైమ్ థ్రిల్లర్ కోర్టు రూమ్ డ్రామా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. అందులో ఏకంగా ప్రియమణి భర్త ప్రైవేట్ వీడియో లీక్ అవుతుంది. ఆ తరువాత ఇల్లాలిగా ఉన్న ప్రియమణి మరోసారి నల్ల కోటు ధరించి దుమ్ము దులుపుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఆ సిరీస్ పేరేంటి? అది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…


స్టోరీ లోకి వెళ్తే…
సిరీస్ కథ మొత్తం చెన్నైలో జరుగుతుంది. ఇందులో రేఖా (ప్రియమణి), ఆమె భర్త, రాష్ట్ర అటార్నీ 16 ఏళ్ల యానివర్సరీని జరుపుకుంటారు. అదే రోజు రేఖ భర్తకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో లీక్ అవుతుంది. అతను లంచంగా ఆ పని చేశాడంటూ, స్కాండల్ పేరుతో అరెస్ట్ చేస్తారు. ఈ రాజకీయ అవినీతి కుంభకోణంలో జైలుకు వెళ్లడంతో తన కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటుంది. రేఖా ఒకప్పుడు న్యాయవాదిగా పని చేసినా, పెళ్లి తర్వాత కెరీర్‌ ను వదిలేసి గృహిణిగా మారింది. భర్త కుంభకోణం తర్వాత, ఆమె తన పాత స్నేహితుడైన ఆరి అర్జునన్ నడిపే లా ఫర్మ్‌లో జూనియర్ న్యాయవాదిగా తిరిగి పని ప్రారంభిస్తుంది.

రేఖా తన వృత్తిలో మళ్లీ స్థిరపడటానికి ప్రయత్నిస్తూ, కోర్టు గదిలో వివిధ కేసులను వాదిస్తుంది. ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే, మరోవైపు జాబ్ చేస్తూ ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. మరి ఇంతకీ ఆమె భర్త ఈ కేసు నుంచి ఎలా బయట పడ్డాడు? రేఖ వాదించిన కేసులు ఏంటి? రేఖ భర్త నిజంగానే తప్పు చేశాడా? లేకపోతే ఎవరైనా కావాలనే ఇరికించారా? అన్నది తెరపై చూసి తెలుసుకవ్వాల్సిన అంశాలు.


Read Also : ఇండియన్ హిస్టరీలో జరిగిన పెను విషాదం… హంతకుల వేట అదుర్స్… ట్విస్టులతో పిచ్చెక్కించే వెబ్ సిరీస్

ఈ ఓటీటీలోనే అందుబాటులో
“గుడ్ వైఫ్” (Good Wife) అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సిరీస్ కు హలితా షమీమ్ దర్శకత్వం వహించారు. జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో విడుదలైన ఈ తమిళ లీగల్ డ్రామా వెబ్ సిరీస్ లో ప్రియమణి, రేవతి, సంపత్ రాజ్, ఆరి అర్జునన్ ప్రధాన పాత్రల్లో నటించారు. “ది గుడ్ వైఫ్” (2009-2016) అనే సూపర్ హిట్ సిరీస్ కు అధికారిక తమిళ రీమేక్ ప్రియమణి ‘గుడ్ వైఫ్’. దీన్ని తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషలలో కూడా రిలీజ్ చేశారు. అయితే సిరీస్ అంత గ్రిప్పింగ్ గా లేదనే విమర్శలు వచ్చాయి.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×