BigTV English

Best Horror Movies In OTT : దైర్యం ఉంటేనే ఈ సినిమాలను చూడండి..టాప్ 5 హారర్ మూవీస్..

Best Horror Movies In OTT : దైర్యం ఉంటేనే ఈ సినిమాలను చూడండి..టాప్ 5 హారర్ మూవీస్..

Best Horror Movies In OTT : ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల కన్నా ఓటీటీ లో రిలీజ్ అవుతున్న సినిమాలకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు హారర్ మూవీస్ థియేటర్లలో ఎక్కువగా సందడి చేసేవి. కానీ ఇప్పుడు ఓటీటీలో ఎక్కువగా సందడి చేస్తున్నాయి. సినీ ప్రియులను ఉత్కంఠ భరీతమైన సన్నివేశాలతో అలరిస్తున్నాయి. భాష ఏదైనా సరే హర్రర్ మూవీ వస్తే చాలు.. కింద సబ్ టైటిల్స్ వేసుకొని సినిమా చూసేస్తుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవనే చెప్పాలి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు స్ట్రీమింగ్ అయిన టాప్ 5 హారర్ సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..


బ్రహ్మయుగం.. 

మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మయుగం విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. కేరళలోని పుంజమోన్ ఇల్లం అనే బ్రాహ్మణుడు ఈ మూవీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కుటుంబ ప్రతిష్టను కించపరిచినందుకు కోర్టు కేసు దాఖలు చేసిన తర్వాత చిత్రం వివాదంలో పడింది. గతంలో కుంజమోన్‌గా పిలిచే ఈ చిత్రంలో మమ్ముట్టి పాత్ర పేరు ఇప్పుడు కొడుమోన్‌గా మారింది. భయంకరమైన సన్నివేశాలు ఈ మూవీలో ఉండటంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది.


ఎజ్రా.. 

ఎజ్రా 2017లో JK దర్శకత్వం వహించిన సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, టోవినో థామస్, ప్రియా ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. పురాతన వస్తువులతో పాటు యూదుల శాసనాలు ఉన్న ఒక విచిత్రమైన పెట్టె ఒక యూదు ఇంటి నుండి దొంగిలించబడింది . లోపల ఉన్న అతీంద్రియ శక్తులు కలిగిన మూవీగా వచ్చింది.

భూతకాలం…

భూతకాలం రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో 2022లో విడుదలైన అతీంద్రియ భయానక చిత్రం. ఈ చిత్రంలో షేన్ నిగమ్, రేవతి ప్రధాన పాత్రలు పోషించారు. ఇంట్లో తెలియని ఒక కొత్త వ్యక్తి తో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనేది ఈ సినిమాలో చూడొచ్చు..

నయన్..

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెల కొన్నాయి. అనుకున్న విధంగానే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. జెన్సు మహమ్మద్ దర్శకత్వం వహించిన 2019 సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రం. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, ప్రకాష్ రాజ్, మమతా మోహన్ దాస్, వమ్మిక కబీ, అలోక్ కృష్ణ తదితరులు నటించారు. ఈ భయానక చిత్రం వాల్ నక్షత్రం యొక్క కథ ఆధారంగా రూపొందించబడింది.

నీలవేచం..

నీలవేచం ఆషిక్ అబు దర్శకత్వం వహించిన 2023 మలయాళ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు టోవినో థామస్, రీమా కల్లింగల్, రోషన్ మాథీవ్ తదితరులు నటించారు. 1964 లో వచ్చిన సూపర్ హిట్ సినిమా భార్గవి సద్దాంకి సీక్వెల్. ఈ సినిమా కథ భార్గవి స్టేషన్ అనే భవనం చుట్టూ ఈ కథ ఉంటుంది.. ఈ భవనంలో దెయ్యం నిజంగానే ఉందా? ఊర్లో అందరు భయపడుతూ ఉంటే ఓ వ్యక్తి మాత్రం ఆ ఇంట్లో దిగుతాడు.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..

వీటితో పాటుగా అనేక సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి..

Tags

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×