BigTV English

Watch 5 Best Telugu Movies on OTT : పుష్ప టు కోసం వెయిట్ చేస్తున్నారా? అంతకంటే ముందు మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 5 మూవీస్ ఇవే…

Watch 5 Best Telugu Movies on OTT : పుష్ప టు కోసం వెయిట్ చేస్తున్నారా? అంతకంటే ముందు మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 5 మూవీస్ ఇవే…

Watch 5 Best Telugu Movies on OTT : థియేటర్లలో సినిమాలు చూసి ఎంతో ఎంజాయ్ చేస్తాం. అయితే ఆ సినిమాలను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోనే ఉండి మళ్ళీ చూడాలనిపించే సినిమాలను ఫ్యామిలీతో కలిసి మరోసారి చూసేద్దాం. మళ్లీ చూడదగ్గ బెస్ట్ సినిమాలను ఇప్పుడు తెలుసుకుందాం.


రౌద్రం రణం రుధిరం (RRR) 

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ అవార్డుకి ఎంపికైన ఈ మూవీ, ఇప్పటికీ ప్రేక్షకుల ముందు కదలాడుతూనే ఉంది. బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే ఇద్దరు యువకుల కథను దర్శకుడు అద్భుతంగా తర్కెక్కించాడు. ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించే ఈ మూవీ ‘నెట్ ఫ్లిక్స్’ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


పుష్ప : ది రైజ్ (Pushpa : The Rise)

పుష్ప ఈ పేరును నిద్రలో కూడా కలవరిస్తున్నారు అభిమానులు. ఈ మూవీ 2021 లో రికార్డులు తిరగరాసింది. ఈ చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా, ఫహద్ ఫాసిల్ విలన్ గా మెప్పించారు. మొదటి భాగం ఇంకా మర్చిపోకముందే రెండవ భాగం 2024 డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

కల్కి 2898 ఏ డి (Kalki 2898 A D)

ఈ మూవీలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపిక పడుకొనె వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి అద్భుతంగా తర్కెక్కించాడు దర్శకుడు. మహావిష్ణు అవతారమైన కల్కిని రక్షించడానికి మహాభారతంలోని కొన్ని క్యారెక్టర్స్ మళ్ళీ వస్తాయి. ఈ మూవీని ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో చూడవచ్చు.

హిట్ : ది సెకండ్ కేస్  (HIT : The Second Case)

అడవి శేష్ నటించిన ఈ క్రైం థ్రిల్లర్ మూవీని చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఒక మర్డర్ కేసును చేదించే క్రమంలో హీరోకి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. చివరికి ఆ కేసును హీరో విజయవంతంగా ఎదుర్కొని పూర్తి చేస్తాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

దసరా (Dasara)

నాని, కీర్తి సురేష్ నటించిన ఈ మూవీ, మూవీ లవర్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. ఈ మూవీలో వెన్నెలను ధరణి ప్రేమిస్తూ ఉంటాడు. అయితే వెన్నెల ధరణి స్నేహితున్ని లవ్ చేస్తుంది. వారికి పెళ్లి కూడా అవుతుంది. అయితే వెన్నెల భర్తని కొంతమంది రౌడీలు చంపేస్తారు. ఆ తర్వాత వెన్నెలను ధరణి కాపాడుతూ వస్తాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు మిస్ చేయకుండా ఈ మూవీ ని చూడండి. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

Big Stories

×