E-Paper
Advertisement

OTT Movie : డంప్ యార్డ్ లో లచ్చిందేవి… చెత్త ఏరుకునే పిల్లలకు కోట్లు దొరికితే?

OTT Movie : డంప్ యార్డ్ లో లచ్చిందేవి… చెత్త ఏరుకునే పిల్లలకు కోట్లు దొరికితే?
Advertisement

OTT Movie : డిఫెరెంట్ స్టోరీలను ప్రేక్షకులు చూడటానికి ఆసక్తిని చూపిస్తుంటారు. ఒక్కోసారి ఏం సినిమా చూద్దామా అని ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా పై ఓ లుక్ వేయండి. ఈ సినిమాను చూస్తున్నప్పుడు, స్లమ్ డాగ్ మలియనీర్ సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో పిల్లలు చెత్త ఎరుకుంటూ జీవిస్తుంటారు. అయితే ఒక్కసారిగా వాళ్ళ జీవితాలు మారిపోయే వస్తువు ఒకటి దొరుకుతుంది. ఆ తరువాత అసలు స్టోరీ మొదలౌతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

బ్రెజిల్ లోని ఒక స్లమ్ ఏరియాలో కొంతమంది డంప్ యార్డ్ లో చెత్త సామాన్లు ఎరుకుంటూ జీవిస్తుంటారు. అయితే ఇక్కడ ముగ్గురు యువకులు (రాఫ్ఫెల్, గార్డూ, రాట్) స్నేహితులుగా ఉంటారు. రాఫ్ఫెల్ ఒక రోజు చెత్త కుప్పలో చెత్తను ఏరుకుంటున్నప్పుడు ఒక పర్స్ దొరుకుతుంది. అందులో కొంత డబ్బుతో పాటు, ఒక కీ,కొన్ని రహస్యమైన ఆధారాలు ఉంటాయి. ఇది జోస్ అనే వ్యక్తికి చెందినది. ఇవి ఒక పెద్ద అవినీతి కుంభకోణంతో ముడిపడి ఉంటాయి. పర్స్ లో ఉన్న ఆధారాల కోసం పోలీసులు డంప్ యార్డ్లో వెతుకుతుంటారు. అందులో ఏదో రహస్యం ఉందని రాఫ్ఫెల్ కి అనుమానం వస్తుంది. దీని రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు.

ఆ కీ తో ఈ పిల్లలు ఒక లాకర్ తీస్తారు. అందులో కోడింగ్ లో ఏదో రహస్యం ఉంటుంది. దానిని కనిపెడుతున్నప్పుడు పోలీసులకు రాఫ్ఫెల్ మీద అనుమానం వస్తుంది. అతన్ని బాగా టార్చర్ చేస్తారు పోలీసులు. అయితే తనకేమి తెలియదని చెప్తాడు రాఫ్ఫెల్. ఇక అక్కడినుంచి బయటికి వచ్చాక తన దగ్గర ఉన్న వాటితో వేల కోట్ల డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చని తెలుస్తుంది. చివరికి రాఫ్ఫెల్ ఆ డబ్బు ఎక్కడుందో కనిపెడతాడా ? అతని జీవితం మారిపోతుందా ? పోలీసులతో ఎటువంటి సమస్యలు వస్తాయి ? ఇంతకీ ఆ డబ్బు ఎవరిది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : అతను కనిపిస్తే కాలం చెల్లినట్టే… హీరోకి ముందే ఫ్యూచర్ చూపించే మృత్యుదేవత

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ పేరు ‘ట్రాష్'(Trash). 2014 లో వచ్చిన ఈ మూవీకి స్టీఫెన్ డాల్డ్రీ దర్శకత్వం వహించారు. 2010 లో ఆండీ ముల్లిగన్ రాసిన నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో రూనీ మారా, మార్టిన్ షీన్, వాగ్నర్ మౌరా, సెల్టన్ మెల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ చెత్త కుప్పలలో జీవనం సాగించే టీనేజ్ పిల్లల చుట్టూ తిరుగుతుంది. (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×