సాధారణంగా ఏ సినిమా అయినా సరే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతనే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది. అయితే ఒకవేళ ఆ సినిమా సూపర్ హిట్ అయితే ఇంకొన్ని వారాలు ఆలస్యం అవుతుంది. ఒకవేళ ఆ సినిమా డిజాస్టర్ అయితే రెండు వారాల తర్వాత ఓటీటీ లోకి వస్తుంది. కానీ ఇక్కడ ఒక చిత్రం మాత్రం విడుదలైన వారానికే ఓటీటీ స్ట్రీమింగ్ కి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా ఏదో కాదు త్రిష (Trisha) ఇటీవల నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ(Identity). టోవినో థామస్(Tovino thomas) హీరోగా.. మలయాళ సినిమాలో విడుదల అయిన ఈ సినిమాని, తెలుగులో డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. థియేటర్లలో విడుదలైన రోజే ప్రేక్షకులకు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. జనవరి 24వ తేదీన విడుదలైన ఈ సినిమా అదేరోజు జీ ఫైవ్ ఓటీటీ వేదికగా, అతి త్వరలో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించగా.. జనవరి 31వ తేదీ నుంచి ఈ ఐడెంటిటీ సినిమాని జీ5 లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 అనౌన్స్ చేసింది. ముఖ్యంగా మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇలా విడుదలైన వారానికే స్ట్రీమింగ్ చేయడం వెనుక అసలు కారణం మాత్రం ఇంకా తెలియదనే చెప్పాలి. ఇకపోతే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఇప్పటివరకు రూ.18 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
టోవినో థామస్ కెరియర్..
మలయాళం లో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో థామస్ ‘మిన్నల్ మురళి’ అనే సినిమా చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలో పాపులర్ కావడంతో పాటు ఈయన సూపర్ హిట్ మలయాళం సినిమాలను ఆహా ఓటీటీ తెలుగులో అనువదించడం వల్ల ఏపీ ,తెలంగాణ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కేరళ వరదల నేపథ్యంలో రూపొందిన ‘2018’ సినిమా తెలుగులో కూడా మంచి విజయం అందుకుంది. ఇక ఇప్పుడు ఈయన నటించిన తాజా చిత్రం ఇది.
త్రిష కెరియర్..
కోలీవుడ్ ముద్దుగుమ్మ త్రిష నాలుగు పదుల వయసు దాటినా సరే ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది. అందం విషయంలో ఏమాత్రం తీసిపోని ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్గా చెలరేగిపోతోంది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన మెప్పించిన ఈమె, ఇప్పుడు మళ్లీ అదే సీనియర్ హీరోలతో జత కట్టడానికి సిద్ధం అయ్యింది. అందులో భాగంగానే చిరంజీవి (Chiranjeevi) తో విశ్వంభర(Vishwambhara) సినిమా చేయబోతున్న ఈమె, బాలకృష్ణ (Balakrishna) తో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు హీరోయిన్గా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న త్రిష విజయ్ దళపతి (Vijay thalapathy) కోసం ‘ది:గోట్’ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.
Malayalam film #Identity will premiere on ZEE5 Premium on January 31st.
Also in Tel, Tam, Kan. pic.twitter.com/QWK12ofeld
— Streaming Updates (@OTTSandeep) January 24, 2025