E-Paper
Advertisement

మనుషుల్ని బానిసలుగా మార్చి.. ఊచకోతకు ఉసిగొల్పిన క్రిమినల్ మైండ్… బయటపడిన మాన్సన్ రహస్యాలు

మనుషుల్ని బానిసలుగా మార్చి.. ఊచకోతకు ఉసిగొల్పిన క్రిమినల్ మైండ్… బయటపడిన మాన్సన్ రహస్యాలు
Advertisement

True Crime Documentary Series: ఒక వ్యక్తి మాటలు వింటూ మొదలైన ప్రయాణం… చివరకు అతని కోసం ప్రాణాలు తీసే స్థాయికి చేరితే ? ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న యువతను అంతలా ఎలా ప్రభావితం చేయగలిగాడు ? వాళ్ళను బానిసలుగా మార్చి, దారుణమైన నేరాలకు పురిగొల్పిన ఆ మాస్టర్ మైండ్ గేమ్ వెనుక ఉన్న అసలు కథేంటి ? ప్రపంచాన్ని వణికించిన ‘మాన్సన్ ఫ్యామిలీ’ హత్యల వెనుక దాగిన ఈ భయంకరమైన నిజాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ ‘కాన్వర్జేషన్స్ విత్ ఎ కిల్లర్: ది చార్లెస్ మాన్సన్ టేప్స్’ (Conversations with a Killer The Charles Manson Tapes). చార్లెస్ మాన్సన్ స్వయంగా మాట్లాడిన అరుదైన ఆడియో రికార్డింగ్స్‌తో పాటు, మాజీ అనుచరులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల వాంగ్మూలాలతో రూపొందిన ఈ మూడు భాగాల సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి దీన్ని ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

1960ల చివర్లో అమెరికాలోని కాలిఫోర్నియాలో చార్లెస్ మాన్సన్ చుట్టూ కొంతమంది యువత చేరడంతో మొదలవుతుంది కథ. మొదట అతని మాటలు, ఆలోచనలు, జీవన విధానం వాళ్ళకి అట్రాక్టివ్ గా అనిపిస్తాయి. కొద్దికాలానికే ఆ పరిచయం ఒక బలమైన అనుబంధంగా మారుతుంది. అలా మాన్సన్ చుట్టూ ఏర్పడిన ఈ బృందమే తర్వాత ‘మాన్సన్ ఫ్యామిలీ’గా గుర్తింపు పొందింది.

Advertisement

మాన్సన్ తన చుట్టూ ఉన్నవారిని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్న విధానం ఈ డాక్యుమెంటరీలో కీలకంగా మారుతుంది. అతని మాటలను ప్రశ్నించకుండా నమ్మేలా అనుచరులను ప్రభావితం చేయడం, తన సిద్ధాంతాలను వారి ఆలోచనల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలను సిరీస్ లో చూపించారు. ఒక వ్యక్తి ప్రభావం ఎలా క్రమంగా ఒక సమూహం ఆలోచనా విధానాన్ని మార్చగలదో ఇందులో చూపిస్తారు.

క్రమంగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి. సమాజంలో భారీ ఘర్షణ జరగబోతోందంటూ మాన్సన్ ప్రచారం చేసిన వక్రీకృత సిద్ధాంతాలు అతని అనుచరులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆ ఆలోచనల నేపథ్యంలో జరిగిన హత్యలు అమెరికాను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ముఖ్యంగా 1969 ఆగస్టులో నటి షారన్ టేట్ సహా పలువురు హత్యకు గురైన ఘటన ఈ కేసును ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మార్చింది.

Advertisement

కానీ ఈ సిరీస్ కేవలం హత్యల వివరాల చుట్టూ మాత్రమే తిరగదు. ఈ నేరాల వెనుక మాన్సన్ ఆలోచనా విధానం ఏంటి ? అతను తన అనుచరులను ఏ స్థాయిలో ప్రభావితం చేశాడు? నేరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంది ? జైలులో ఉన్న సమయంలో ఈ కేసు గురించి అతను ఏం మాట్లాడాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇందులో ఉన్నాయి.

ఇందులో ప్రత్యేకంగా ఆకట్టుకునే అంశం మాన్సన్‌కు సంబంధించిన అరుదైన ఆడియో రికార్డింగ్స్. గతంలో పెద్దగా తెలియని విషయాలు, జైలు కాలానికి సంబంధించిన టేపులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇంటర్వ్యూలను కలిపి కథను ముందుకు తీసుకెళ్లారు. దీంతో మాన్సన్ గురించి ఇతరులు చెప్పే మాటలతో పాటు, అతని స్వరంలోనే వినిపించే విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.

అతని మాజీ అనుచరుల అనుభవాలు కూడా ఈ కేసులో మరో కీలక కోణాన్ని బయట పెడతాయి. ఒక వ్యక్తి చుట్టూ ఒక సమూహం ఎలా ఏర్పడుతుంది ? ఆ సమూహంలో వ్యక్తిగత ఆలోచనా స్వేచ్ఛ ఎలా ప్రభావితమవుతుంది ? నమ్మకం, భయం కలిసి మనుషులను ఎంత దూరం తీసుకెళ్లగలవు ? అనే అంశాలను డాక్యుమెంటరీ కళ్ళకు కట్టినట్టు చూపించారు.

తెలుగులో ఉందా ?

మూడు ఎపిసోడ్‌లలో మాన్సన్ వ్యక్తిత్వం, ‘మాన్సన్ ఫ్యామిలీ’ ఏర్పడిన తీరు, హత్యల వెనుక ఉన్న సిద్ధాంతాలు, దర్యాప్తు సమయంలో బయటపడిన విషయాలు, జైలు జీవితానికి సంబంధించిన సంభాషణలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీంతో ఇది సాధారణ క్రైమ్ స్టోరీగా కాకుండా ఒక నేరస్తుడి మానసిక ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలా అనిపిస్తుంది.

ట్రూ క్రైమ్ కథలు, కల్ట్‌లు, క్రిమినల్ సైకాలజీ, సంచలనాత్మక హత్య కేసుల వెనుక ఉన్న మానసిక కోణాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా అరుదైన ఆడియో టేపులు, మాజీ అనుచరుల వాంగ్మూలాలు, కేసుకు సంబంధించిన వివరాలను కలిపి చెప్పిన విధానం దీనికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆస్కార్ నామినేటెడ్ దర్శకుడు జో బెర్లింజర్ రూపొందించిన సిరీస్ కావడంతో డాక్యుమెంటరీ ట్రీట్‌మెంట్ కూడా ఆకట్టుకుంటుంది.

‘కాన్వర్జేషన్స్ విత్ ఎ కిల్లర్: ది చార్లెస్ మాన్సన్ టేప్స్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం మూడు ఎపిసోడ్‌లుగా ఉన్న ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలో చార్లెస్ మాన్సన్‌కు సంబంధించిన ఆడియో రికార్డింగ్స్, మాజీ అనుచరుల ఇంటర్వ్యూలు, కేసు దర్యాప్తుకు సంబంధించిన వివరాలను చూడవచ్చు. ప్రపంచాన్ని కుదిపేసిన ఒక క్రైమ్ కేసు వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? అతని మాటలకు యువత ఎందుకు అంతలా ప్రభావితమైంది? ఒక సాధారణ కల్ట్ చివరకు ఇంతటి దారుణాలకు ఎలా దారితీసింది? అనే విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి ఈ సిరీస్ బెస్ట్ ఆప్షన్. కానీ తెలుగులో మాత్రం లేదు.

Read Also: చైనీస్ కుంగ్ ఫూను అంతం చేయాలని చూసిన విలన్లకు దిమ్మతిరిగే షాక్… చివర్లో హై-వోల్టేజ్ ఫైట్

Tags

Related News

ఒక హత్యతో మొదలై… పోలీస్ శాఖనే కుదిపేసిన కుట్ర… పోలీసులను వేటాడుతున్న ఆ కిల్లర్ ఎవరు?

బోర్డర్లో వైట్ కోట్ వారియర్స్ స్టోరీ… సైనికుల ప్రాణాల కోసం డాక్టర్ల పోరాటం

నమ్మినవాడే వెన్నుపోటు.. డ్రాగన్లతో రణరంగం.. చివర్లో ఊహించని విషాదం

40 ఏళ్ల పెళ్లి బంధం… ఒక్క ట్రిప్‌తో బయటపడ్డ షాకింగ్ నిజం

హీరో సిద్ధార్థ్ కి భారీ షాక్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్!

ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే యాక్సిడెంట్… రెండు ప్రేమకథల ఎమోషనల్ జర్నీ

హిందీలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మా ఇంటి బంగారం.. ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×