E-Paper
Advertisement

చైనీస్ కుంగ్ ఫూను అంతం చేయాలని చూసిన విలన్లకు దిమ్మతిరిగే షాక్… చివర్లో హై-వోల్టేజ్ ఫైట్

చైనీస్ కుంగ్ ఫూను అంతం చేయాలని చూసిన విలన్లకు దిమ్మతిరిగే షాక్… చివర్లో హై-వోల్టేజ్ ఫైట్
Advertisement

Ip Man Kung Fu Legend on OTT: జాకీ చాన్ సినిమాలు, చైనీస్ సినిమాలు చూసే వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రత్యేకమైన పిచ్చి ఉంటుంది. అందులోనూ ఈ జానర్లో వచ్చే సినిమాలను ఇష్టపడే యాక్షన్ మూవీ లవర్స్ ఖచ్చితంగా ఇప్ మాన్ ను కూడా ఇష్టపడతారు. అలాంటి వారి కోసమే చైనీస్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ‘ఇప్ మాన్: కుంగ్ ఫూ లెజండ్’ (Ip Man Kung Fu Legend 2026). యాక్షన్ ప్రియులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ హై వోల్టేజ్ మూవీ… 2019లో వచ్చిన ‘ఇప్ మాన్: కుంగ్ ఫూ మాస్టర్’కు ఇది డైరెక్ట్ సీక్వెల్‌గా రూపొందింది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులో ఉందా లేదా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇప్ మాన్ పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. తాను నేర్చుకున్న చైనీస్ సంప్రదాయ యుద్ధ విద్య వింగ్ చున్‌ను తర్వాతి తరాలకు నేర్పించాలనే ఉద్దేశంతో, ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించేందుకు సిద్ధమవుతాడు. అయితే అతను అనుకున్నంత ప్రశాంతంగా పరిస్థితులు ఉండవు.

Advertisement

అదే సమయంలో స్థానిక చైనీస్ కమ్యూనిటీకి చెందిన మార్షల్ ఆర్ట్స్ ప్రాపర్టీలపై ఓ వెస్ట్రన్ బాక్సింగ్ జిమ్ యాజమాన్యం కన్నేస్తుంది. ఒక్కొక్కటిగా ఆస్తులను కొనుగోలు చేస్తూ వాటిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ దీని వెనుక కేవలం వ్యాపార ప్రయోజనాలు మాత్రమే లేవని ఇప్ మాన్ గుర్తిస్తాడు. చైనీస్ కుంగ్ ఫూ సంప్రదాయాన్ని, దాని గౌరవాన్ని పూర్తిగా దెబ్బతీయాలనేది ఆ శక్తుల అసలు ఉద్దేశం. తమకు అడ్డుగా నిలిచే ఇప్ మాన్‌ను కూడా తొలగించేందుకు వారు ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేస్తారు. అతడిని ఓ తప్పుడు హత్య కేసులో ఇరికించి చట్టపరంగా బంధించాలని ప్రయత్నిస్తారు.

ఇక్కడి నుంచే అసలు యాక్షన్ మొదలవుతుంది. ఒకవైపు తనపై పడిన నిందను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు తన కమ్యూనిటీకి చెందిన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ల గౌరవాన్ని, వారి ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఇప్ మాన్‌పై పడుతుంది. చట్టం ద్వారా సమస్యను పరిష్కరించడం సాధ్యం కాని పరిస్థితుల్లో అతడు తనకు తెలిసిన వింగ్ చున్ మార్షల్ ఆర్ట్స్‌ను ఆశ్రయిస్తాడు. తనపై కుట్ర పన్నిన వాళ్లను ఒక్కొక్కరిగా ఎదుర్కొంటూ ఇప్ మాన్ చేసే పోరాటం సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సాధారణ ఫైట్స్‌తో కాకుండా వింగ్ చున్ టెక్నిక్స్, వేగవంతమైన దాడులు, క్లోజ్ కాంబాట్ యాక్షన్‌తో సన్నివేశాలను రూపొందించారు.

Advertisement

ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ మరింత హైలైట్‌గా నిలుస్తుంది. వర్షం, నిప్పుల బ్యాక్‌డ్రాప్‌లో ఇప్ మాన్, ప్రత్యర్థుల మధ్య జరిగే పోరాటం యాక్షన్ అభిమానులకు మంచి ట్రీట్‌గా ఉండేలా తెరకెక్కించారు. తన సంస్కృతి, తోటి మాస్టర్ల ఆత్మగౌరవం కోసం ఇప్ మాన్ ఎంత దూరం వెళ్లగలడనేది ఈ క్లైమాక్స్‌లో ఆసక్తికరంగా చూపించారు.

స్ట్రీమింగ్ లో చిన్న ట్విస్ట్

ఈ చిత్రంలో డెన్నిస్ తో ఇప్ మాన్ పాత్రలో నటించారు. వాంగ్ వాన్‌ఝాంగ్, స్టీవెన్ దాస్జ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. లి లిమింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిడివి సుమారు 1 గంట 38 నిమిషాలు ఉంటుంది. ఇప్ మాన్ కథల్లో కనిపించే వింగ్ చున్ యాక్షన్, ఫైట్ కొరియోగ్రఫీ, చైనీస్ మార్షల్ ఆర్ట్స్ గౌరవాన్ని కాపాడే అంశాలు ఈ సినిమాలో హైలెట్. ముఖ్యంగా వరుసగా ఫైట్స్, కుంగ్ ఫూ యాక్షన్, హీరో వర్సెస్ విలన్స్ తరహా కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా సూపర్ ఛాయిస్. ‘ఇప్ మాన్: కుంగ్ ఫూ లెజండ్’ ఆగస్టు 11 నుంచి డిజిటల్ రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. ఈ సినిమాను Apple TVలో కూడా చూడవచ్చు. వింగ్ చున్, మార్షల్ ఆర్ట్స్, ఫాస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ ఇష్టపడేవారు ఈ సినిమాను పొరపాటున కూడా మిస్ అవ్వొద్దు.

Read Also: థియేటర్ ముఖం చూడకుండానే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. హంతకుడెవరో కనిపెట్టగలరా?

Tags

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×