OTT Movie : యుద్ధ సన్నివేశాలతో జరిగే సినిమాలు, ప్రేక్షకులను కుర్చీలకే అతుక్కుపోయే విధంగా చేస్తాయి. సైనికుల విన్యాసాలు, సాహసాలతో సాగిపోయే ఒక వార్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏంజలీనా జోలి దర్శకత్వం వహించిన ఈ మూవీని, నిజజీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జియో సినిమా (Jio Cinema) లో
ఈ మూవీ పేరు ‘అన్‌బ్రోకెన్’ (Unbroken). ఈ అమెరికన్ వార్ డ్రామా మూవీని ఏంజెలీనా జోలీ నిర్మించి దర్శకత్వం వహించారు. దీనిని లారా హిల్లెన్‌బ్రాండ్ రచించిన నాన్-ఫిక్షన్ పుస్తకంతో తెరకెక్కించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో తన బాంబర్ సముద్రంలో మునిగిపోయిన తర్వాత, హీరో 47 రోజుల పాటు తెప్పలో జీవిస్తాడు. ఆ తరువాత జపనీయులచే హీరో బంధించబడతాడు. ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలై విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా $163 మిలియన్లు వసూలు చేసి మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ జియో సినిమా (Jio Cinema) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో చిన్నతనంలో చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాడు. మద్యం సేవిస్తూ, గొడవలు పడుతూ ఉంటాడు చెడ్డపేరు తెస్తూ ఉంటాడు. ఒకరోజు హీరో మద్యం సేవిస్తుండగా, పోలీస్ అధికారి హీరోను బెదిరిస్తాడు. అక్కడినుంచి హీరో పారిపోయే విధానం చూసిన అన్నయ్య, హీరోకి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇప్పిస్తాడు. ఆ తరువాత రన్నింగ్ లో చాలా పథకాలు సాధిస్తాడు హీరో. అయితే నువ్వు ఒలంపిక్స్ కూడా కొడతావని చెప్పడంతో, హీరో పరుగు పందెంలో ఒలంపిక్స్ లో పథకం కూడా సాధిస్తాడు. ఆ తర్వాత హీరో ఆర్మీలో జాయిన్ అవుతాడు. యుద్ధం చేస్తున్నప్పుడు జరిగే ఒక విమాన ప్రమాదంలో సముద్రంలో పడిపోతారు అమెరికన్ సైనికులు. అందులో హీరోతో పాటు మరో ఇద్దరు, ఒక చిన్న పడవలో 47 రోజులు పాటు ఆహారం లేకుండా సముద్రంలోనే ఉంటారు. ఆ తర్వాత జపాన్ సైనికులకు హీరో దొరికిపోతాడు.
జపాన్ సైనికులు, హీరోతోపాటు పట్టుబడ్డ మిగతా సైనికులను చాలా చిత్రహింసలు పెడుతుంటారు. ఆ చిత్రహింసలు ఎక్కువగా హీరోకి పెడుతూ ఉంటాడు అక్కడున్న ఆఫీసర్. ఆ తర్వాత అమెరికన్ సైనికులు జపాన్ సైనికులను ఓడిస్తారు. హీరో అక్కడినుంచి బయటకు వచ్చి, తన కుటుంబ సభ్యులను కలుస్తాడు. ఇదంతా తనకు అన్న ఇచ్చిన ధైర్యం అని గర్వంగా చెప్తాడు. నిజజీవితంలో కష్టాలు పడ్డ సైనికుడు, ఆ తర్వాత జపాన్లో ఒలంపిక్ జ్యోతి పట్టుకుని నిలబడతాడు. తనకు కష్టాలు పెట్టిన జపాన్ ఆర్మీ అధికారిని కలవడానికి కూడా ప్రయత్నిస్తాడు. అయితే ఆ జపాన్ అధికారి హీరోని కలవడానికి ఒప్పుకోడు. ఈ గొప్ప స్టోరీ తో ఏంజెలీనా జోలి దర్శకురాలిగా మంచి మార్కులు కొట్టింది. ఒక మంచి వార్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ బెస్ట్ సజేషన్.