Gundeninda GudiGantalu Today episode February 1st: నిన్నటి ఎపిసోడ్ లో… శృతి వాళ్ళ అమ్మ శోభా ఇంట్లో రచ్చ చెయ్యడంతో బాలు క్లాస్ పీకుతాడు. సత్యం చెప్పడంతో గొడవలు పూర్తిగా సైలెంట్ అవుతాయి. ఇక బాలు రాజేష్ దగ్గరికి వచ్చి నా తప్పు లేకపోయినా నన్నే క్షమాపణలు చెప్పమంటారు ఏంటని జరిగిందంతా బయట పెడతాడు. ఇక బార్ కి వెళ్ళాలని రెడీ అవుతారు. కార్తీక్ రాజేష్ బాలుల కన్వర్జేషన్ కామెడీగా ఉంటుంది. ఇక అందరూ కలిసి బార్ కి వెళ్తారు. బాలు ఎంత చెప్పినా మళ్ళీ నా తప్పేమీ లేదు కదా నాకు కోపం తెప్పించాల్సిన పని ఉంది అని అదే మాట దగ్గరకు తీసుకొస్తాడు. రాజేష్ వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు టాపిక్ రాజేష్ వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు టాపిక్ డ్రైవర్ట్ చెయ్యకపోతే అదే పనిలో ఉంటాడు. ఒక వ్యక్తి రాజేష్ చైర్ ని తగులుతాడు ఇక ఎన్నిసార్లు క్షమించమని అడుగుతాడు దానికి బాలు గొడవ పెట్టుకుంటాడు. ఆ తర్వాత నా తప్పు లేకపోయినా నన్ను క్షమించమని చెప్తారు ఏంట్రా ఇంట్లో భరించలేక ఎక్కడికి వచ్చాను అని బాలు అంటాడు. ఇక తర్వాత మరో వ్యక్తి నన్ను క్షమించు బంగారం అని తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు వాడి దగ్గరికి కూడా వెళ్లి నాలుగు దులిపేస్తాడు బాలు. రాజేష్ ఎందుకురా అందరి మీద కోప్పడతావ్ నీకు కోపం ఎక్కువ అనేసి అంటాడు. దానికి బాలు రాజేష్ ని కొడతాడు కోపం వచ్చింది కదా ఇప్పుడు నాకు అంత కోపం వస్తుంది అని అంటాడు. ఇక బాలు తాగిన విషయాన్ని మీనాకు చెప్పకూడదు మ్యానేజ్ చెయ్యాలని అనుకుంటాడు. కానీ దొరికిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరి కోసం నిల్చుని ఇంతసేపు చపాతి చేయాల్సి వచ్చింది . ఇంకా శృతి రవి కూడా రాలేదు. మీరు తినండి వాళ్ళకి కూడా పెడతాను అనేసి అంటుంది. నాకు కామ్లెట్ వేసి ఇవ్వు అనేసి బాలు అంటాడు అప్పుడే డోర్ కొడితే ప్రభావతి సత్యం వస్తారు. తిన్నారా నాన్న అని బాలు అడుగుతాడు. తినేసే అలా వాకింగ్ కి వెళ్లి వచ్చాం రాని సత్యం అంటాడు. ఇక మళ్ళీ డోర్ కొట్టిన చప్పుడు వినిపిస్తే రవి శృతిలొచ్చారని మీనా తలుపు తీస్తుంది. రండి తిందురు రండి మీకోసం చపాతి రోటి పచ్చడి చేశాను నీకు ఇష్టం కదా రవి అని అంటుంది. సారీ మీనా మేం బయట తినొచ్చామని శృతి అనగానే బాలు ప్లేటును కింద పడేస్తాడు.. బాలుకి కోపం వస్తుంది. తినే ప్లేట్ ను కింద పడేసి, ఆలుమగలు ఇష్టం ఉన్నట్లు బయట బలాదూర్ గా తిరిగివచ్చి, బయటనే తిని వచ్చామని చెబితే ఎలా? మీ కోసం మీనా కష్టపడి చపాతీలు చేసింది. ఇప్పుడు ఆ చపాతీలు తినాల్సిందేనని బాలు పట్టుపడతాడు.. తాను బయట తిని వచ్చామని, ఆ విషయాన్ని ముందుగా చెప్పకపోవడం తన తప్పేనని రవి సారీ చెబుతాడు. కానీ, బాలు పట్టించుకోడు. రవిని లాక్కొచ్చి నోట్లో చపాతీలను కుక్కుతాడు. దీంతో శృతికి ఎక్కలేని కోపం వస్తుంది. బుద్ధి లేదా అంటూ బాలుని నానా మాటలు అంటుంది. దీంతో బాలు రివర్స్ అవుతాడు. లేచిపోయిన వాళ్ళు బుద్ధి గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నిస్తాడు. దీంతో శ్రుతి రియాక్ట్ అవుతూ.. తాము బయట తినొచ్చామని చెప్తున్నా కదా.. పాడైతే డస్ట్ బిన్ లో పాడేయండి .. కానీ బలవంతంగా నోట్లో కుక్కుతారా ? అంటూ పొగరుగా సమాధానం ఇస్తుంది..
బాలు మాత్రం ఎక్కువ మాట్లాడితే నీకు కూడా కుక్కుతాను అని అంటాడు. దానికి శృతి సీరియస్ అవుతుంది. ఇక బాలు నన్ను ప్రతిసారి తాగుబోతు తాగుబోతు అంటారు నేను తాగొచ్చాను అని అంటారు వాళ్ళిద్దరూ పెద్ద సుద్ద పూసలు అని మీరు అనుకుంటున్నారా నాకన్నా పెద్ద ముదుర్లు అనేసి వాళ్ళు ఇతని అడ్డంగా ఇరికిస్తాడు. ఇక మొత్తానికి అందరూ ఎవరికి వారే అన్నట్లు జారుకుంటారు. ఇక బాలుకు మీనా మళ్లీ క్లాస్ పీకుతుంది. ఇంట్లో వాళ్ళందరి గుడ్లు బయట పెడతారా మీకంటే అలవాటైపోయింది వాళ్ళు దాచుకుంటున్నారు ఎందుకురా చేశారు ఏది ఇలా చేస్తూనే ఉంటారు అందరి చేత మాటలు పడుతూనే ఉంటారా అని మీనా బాలుకి క్లాస్ పీకుతుంది. మీరిక్కడ మారరు తాగొద్దని మావయ్య గారు మేము ఎంతగా చెబుతున్నా మీరు తాగకుండా మాత్రం ఇంటికి రాడు అనేసి అంటుంది మీనా.. ఉదయం ఆ డబ్బుడమ్మ వాళ్ళ అమ్మ ఏముందో విన్నావు కదా మా నాన్న కాళ్లు పట్టుకున్నారా నువ్వు చెప్పు నేను మా నాన్న అలాంటి పని చేస్తాడా అని బాధపడతాడు. మా నాన్నని ఇకమీద ఎవరేమన్నా సహించేది లేదు అసలు ఊరుకునేది లేదు ఏదైనా సరే అవసరమైతే చంపేస్తాను లేదా చావడానికి మీనా తో అంటాడు. ప్రేమ స్వచ్ఛమైన మీ మనసు ఎవరికీ అర్థం కాదండి.. అర్థం చేసుకునే రోజుల్లో మీరు ఆకాశమంత ఎత్తులో ఉంటారు అనేసి అంటుంది మీనా.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ప్రభావతి ఇంట్లో గొడవలు పెట్టాలని శోభా అనుకుంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..