SSMB 29 : మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ చివరి దశకు చేరుకోగా, సెకండ్ షెడ్యూల్ కి సంబంధించిన ప్లానింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. సాధారణంగా జక్కన్న (SS Rajamouli) సినిమాలు అంటే ఏళ్ల తరబడి చెక్కుతారు అన్న టాక్ ఉంది. అయితే తాజాగా జక్కన్న స్పీడ్ చూస్తుంటే మాత్రం SSMB 29 మూవీ షూటింగ్ త్వరగానే పూర్తయ్యేలా కనిపిస్తోంది. మరి ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడు పూర్తవుతుంది? సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది? అనే వివరాల్లోకి వెళ్తే….
ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ?
దర్శక దిగ్గజం రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ SSMB 29. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి (MM Keeravani) ఈ మూవీకి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 మూవీ ఎప్పుడేప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా ? అని ఇన్నాళ్లు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన అభిమానులకు ఇంకా డిసప్పాయింట్మెంట్ పోలేదు. ఇప్పటి దాకా జక్కన్న ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఇవ్వలేదు. మరోవైపు సైలెంట్ గా జనవరి మొదట్లోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలను మొదలు పెట్టి, శర వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు, వర్క్ షాప్, టెస్ట్ లుక్ వంటివి పూర్తి చేశారు. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా నటీనటులను సెలెక్ట్ చేసి, ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రీసెంట్గా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను జక్కన్న హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. మొదటి షెడ్యూల్ షూటింగ్ ఫిబ్రవరి 3తో పూర్తవుతుంది అనేది తాజా సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ప్రియాంక చోప్రా ముంబైకి ప్రయాణం కానున్నారు.
సెకండ్ షెడ్యూల్ ఎప్పుడంటే?
ఇక ఫస్ట్ షెడ్యూల్ ఇంకా పూర్తికాక ముందే సెకండ్ షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేశారట జక్కన్న. అయితే ఈ రెండు షెడ్యూల్స్ కి మధ్య చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 3న పూర్తి కానుండగా, సెకండ్ షెడ్యూల్ ని ఫిబ్రవరి చివరి వారంలో స్టార్ట్ చేస్తారని ఇన్సైడ్ వర్గాల సమాచారం. కొత్త షెడ్యూల్ ను కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే చేయబోతున్నారని, ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, మరో బాలీవుడ్ స్టార్ బాలీవుడ్ జాన్ అబ్రహంతో పాటు విదేశీ నటీనటులు కూడా పాల్గొంటారని అంటున్నారు. ఏదైనా జక్కన్న జెట్ స్పీడ్ తో మూవీ చేయడం చూస్తుంటే, ఆయన సినిమాలను చెక్కుతారు అనే పేరుని మార్చుకోబోతున్నారు అనిపిస్తోంది.