UI Movie : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ( Upendra) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో కూడా ఈయన ఎన్నో సినిమాల్లో నటించాడు. 90 వ దశకంలో ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ.. అప్పుడే ఉపేంద్ర సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్నీ అందుకున్నాయి. రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు సినిమాలతో అసలు ఇలాంటి కథలు తీయాలంటే ఉపేంద్ర తర్వాతే ఎవరైన.. ఈ మధ్య ఆయన పలు హీరోల సినిమాల్లో విలన్ పాత్రలోనూ లేదా ప్రత్యేక పాత్రలోను నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.. చాలా ఏళ్ల తర్వాత ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన సినిమా యూఐ.. గతేడాది క్రిస్మస్ కానుకగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది.. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఏ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకుంది.. దాంతో ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. తాజాగా ఓటిపి డేట్ ని లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఎప్పుడు స్ట్రీమింగ్ వస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
గత పదేళ్లుగా నటనకు, దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చిన ఆయన.. తాజాగా మెగా ఫోన్ పట్టాడు. పదేళ్ల గ్యాప్ తర్వాత స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘యూఐ’. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా కన్నడ, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అయింది.. కన్నడలో తప్ప మిగిలిన అన్నీ ఏరియాల్లో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. UI విడుదలై రెండు నెలలకు పైగా గడిచినప్పటికీ, ఇది ఇంకా డిజిటల్‌గా రాలేదు. నివేదికల ప్రకారం, UI మార్చి 30న ZEE5లో OTT లోకి రాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.
ZEE5 మరియు Zee కన్నడ ద్వారా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. డిస్టోపియన్ ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉపేంద్ర ద్విపాత్రాభినయం చేశాడు. లహరి ఫిల్మ్స్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌లపై జి మనోహరన్ మరియు కెపి శ్రీకాంత్ యుఐని నిర్మించారు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసింది. ఈ సినిమాలో రీష్మా నానయ్య, నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, సాధు కోకిల కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజంజీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు.
Also Read :‘దేవర 2’ అప్డేట్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ బొనంజా..
స్టోరీ విషయానికొస్తే..
ఈ మూవీలో తెలివైన వారు మూర్ఖుల్లాగా.. మూర్ఖులు తెలివైన వారిలాగా కనిపిస్తారు.. జేబు దొంగ వామనరావు సామ్రాట్, రాజకీయ నాయకుడు అవుతాడు. అతనికి బానిసలుగా ఉన్న ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కుల మతాలకు అతీతంగా నూతన సమాజ స్థాపన కోసం సత్య, అతని తండ్రి శాస్ర్తి కృషి చేస్తుంటారు. వృత్తిరీత్యా శాస్ర్తి ఓ జ్యోతిష శాస్త్ర నిపుణుడు. సత్య జన్మ నక్షత్రం ప్రకారం అతను కలియుగ భగవంతుడు అని శాస్ర్తి ప్రకటిస్తాడు. వామనరావును సెంట్రల్ సామ్రాట్ చేస్తానని చెప్పిన కల్కి ఏం చేశాడు. కల్కిగా వచ్చినది సత్య కాదని, సత్య కవలలు అని ప్రజలతో పాటు వామనరావు తెలుసుకున్నాడా లేదా? సత్య, కల్కి మధ్య వ్యత్యాసం ఏంటి? సమాజానికి వాళ్లిద్దరూ ఏం చేశారు? అనేది సినిమా స్టోరీ..