BigTV English
Advertisement

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల అమ్మాయి… నెవర్ బిఫోర్ మిస్టరీ గేమ్… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల అమ్మాయి… నెవర్ బిఫోర్ మిస్టరీ గేమ్… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇలాంటి సస్పెన్స్‌ థ్రిల్లర్ స్టోరీలపై ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలాంటి జానర్ లో ఒక సినిమా మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాలో కూడా డబ్బుకోసం ఇద్దరు స్నేహితులు ఒక గేమ్ ఆడతారు. ఆతరువాత ఫ్యామిలీ మెంబెర్స్ ఒక్కొక్కరు దారుణంగా చచ్చిపోతారు. ఈ సన్నివేశాలు ఒళ్ళు జలదరించేలా చేస్తాయి. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్దంగా ఉంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘అస్ ఆర్ దెమ్’ (Us or Them) 2023లో విడుదలైన అమెరికన్ యాక్షన్-థ్రిల్లర్ చిత్రం. టామ్ పాటన్ దర్శకత్వంలో, మాలిన్ ఆకర్మన్ (ది ఆఫీషియేటర్), జాక్ డోనెల్లీ (జూడ్), వేయిన్ గార్డన్ (ఆండీ), నికోల్ బార్ట్లెట్ (జూడ్ వైఫ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 26 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 8న విడుదలై, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఈ చిత్రం ఒక లగ్జరీ వాకేషన్‌లో చిక్కుకున్న చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ మధ్య లైఫ్-ఆర్-డెత్ గేమ్ చుట్టూ తిరుగుతుంది.

కథలోకి వెళ్తే

జూడ్, ఆండీ చైల్డ్‌హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక మొబైల్ గేమ్ యాప్ విజయంతో గెలిచిన లగ్జరీ కరిబ్బియన్ వెకేషన్‌కు వెళ్తారు. వీళ్ళు ఫ్యామిలీని కూడా వెంట తీసుకెళ్తారు. వీళ్లంతా వెకేషన్‌కు ఎంజాయ్ చేస్తుండగా, ఒక మిస్టీరియస్ మహిళ ది ఆఫీషియేటర్ ను కలుస్తారు. ఆమె వాళ్లకి $20 మిలియన్ ఆఫర్ ఇస్తుంది. వీళ్ళు చేయాల్సిందల్లా “ఉస్ ఆర్ దెమ్” అనే సింపుల్ గేమ్ ప్లే చేయడమే. జూడ్ డబ్బు కోసం ఆండీని కన్విన్స్ చేస్తాడు. కానీ ఆ గేమ్ మొదలైన తర్వాత, దాన్ని ఆపలేకపోతారు. గేమ్ మరింత ఇంటెన్స్ అవుతుంది. జూడ్, ఆండీ మధ్య టెన్షన్ పెరిగిపోతుంది. వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా డేంజర్‌లో పడతారు.


ఈ గేమ్ అందరిని మానిప్యులేట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మధ్య బెట్రయల్, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ బయటపడతాయి. ఈ గేమ్ లో ఒక్కొక్కరు దారుణంగా చంపబడుతుంటారు. క్లైమాక్స్‌లో గేమ్ షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ సినిమా ఎమోషనల్ ఎండింగ్‌తో ముగుస్తుంది. ఇంతకీ ఆ గేమ్ ను జూడ్, ఆండీ కంట్రోల్ చేస్తారా ? వీళ్ళు కూడా దానికి బలవుతారా ? ఆ గేమ్ వెనుక సీక్రెట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

Read Also : పిల్లల్ని చంపి అమరుడయ్యే విలన్… పాప ఎంట్రీతో ఒక్కొక్కడికీ దబిడి దిబిడే… ఈ సైకలాజికల్ హారర్ మూవీ అదుర్స్

Related News

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

OTT Movie : అమ్మాయిల మధ్య తేడా యవ్వారం… ట్రిప్పు కోసం వెళ్లి సైకో కిల్లర్ల చేతిలో అడ్డంగా బుక్… బ్రూటల్ బ్లడ్ బాత్

OTT Movie : మిస్సైన కూతురి కోసం వెళ్తే ప్యాంటు తడిచే హర్రర్ సీన్లు… ఇలాంటి హర్రర్ మూవీని ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

Biker OTT: శర్వానంద్ బైకర్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

Bad Girl OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్శీ గర్ల్.. ఎందులో చూడొచ్చంటే..?

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

Big Stories

×