Brahmamudi serial today Episode: శ్రీను కిడ్నాప్ అయ్యాడని తెలుసుకున్న రాజ్, కావ్య టెన్షన్ పడుతుంటే అప్పుడే ఇంద్రాదేవి, రేవతి ఇంట్లోంచి బయటకు రావడం రాజ్ చూస్తాడు. దొరికింది అంటాడు. ఏంటి ఐడియానా అని కావ్య అడుగుతుంది. కాదు నాన్నమ్మ అంటూ దగ్గరకు వెళ్తారు. రేవతి షాక్ అవుతుంది. దగ్గరకు వెళ్లిన రామ్ హలో ఓల్డ్ లేడీ అంటూ పిలుస్తాడు. రాజ్ వాళ్లను చూసిన ఇంద్రాదేవి అయ్యో ఎవరి కంట్లో అయితే పడకూడదు అనుకున్నానో వాళ్ల కంట్లోనే పడ్డాను కదా..? ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుంది. రాజ్ విజిల్ వేస్తూ ఎందుకు ఇక్కడున్నావు అంటూ సైగ చేస్తుంటే ఇంద్రాదేవి కూడా విజిల్ వేస్తుంది.
దీంతో రాజ్ కోపంగా నాన్నమ్మ నువ్వేంటి ఇక్కడా అని అడుగుతున్నాను అంటాడు. మరి మీరేంటి ఇక్కడా అంటుంది ఇంద్రాదేవి. దీంతో రాజ్ క్వశ్చన్‌కు క్వశ్చన్ ఆన్సరా అంటాడు. అవును అంటుంది ఇంద్రాదేవి. అయితే మేము పని మీద వచ్చాము అని రాజ్ చెప్పగానే.. నేను పని మీద వచ్చాను అంటుంది ఇంద్రాదేవి. పని మీద వచ్చారా..? మీకు ఈ బస్తీలో పనేంటి అమ్మమ్మ గారు పైగా మీకు ఇక్కడ తెలిసిన వాళ్లు కూడా ఎవ్వరూ లేరు కదా అని కావ్య అడుగుతుంది. అంటే ఏంటి బస్తీలో మనుషులు ఉండరా..? వారితో పని ఉండదా..? నేనే ఏదో గ్రహానికి వచ్చినట్టు రాకూడని ప్లేస్‌కు వచ్చినట్టు అలా ఆరాలు తీస్తారేంటి..? అని కోప్పడుతుంది.
దీంతో కావ్య మా ఉద్దేశం అది కాదు అమ్మమ్మ గారు ఇక్కడ మీకు పనేంటని అంటుంది. ఏదో పని పడి వచ్చాను ఇప్పుడు ఆ పని అయిపోయింది వెళ్లిపోతున్నాను ఇక చాలా..? అవును ఇంతకీ మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు..? అంటూ ఇంద్రాదేవి అడుగుతుంది. దీంతో రాజ్ చెప్పాను కదా నాన్నమ్మ పని మీద వచ్చామని అంటాడు. అదేరా ఏం పని మీద వచ్చారు అని అడుగుతున్నాను అంటుంది ఇంద్రాదేవి.. నువ్వు చెప్పనప్పుడు మేమెందుకు చెప్పాలి అంటాడు రాజ్. అంటే ఏంట్రా పెద్ద వాళ్లు అడిగినప్పుడు పిల్లలు చెప్పకూడదా…? అంటుంది ఇంద్రాదేవి. పిల్లలు అడిగినప్పుడు పెద్దవాళ్లు చెప్పన్నప్పుడు.. పెద్దవాళ్లు అడిగినప్పుడు పిల్లలు కూడా చెప్పకూడదు అంటాడు రాజ్. ఇంతలో కావ్య అబ్బా మీరు ఉండండి అంటూ కావ్య అప్పు కేసు విషయంలో సాక్షి కోసం వచ్చామని చెప్పగానే.. ఇంద్రాదేవి సరే త్వరగా పట్టుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది. రాజ్, కావ్య శ్రీను ను ఎలా పట్టుకోవాలి అంటూ ఆలోచిస్తారు.
హ్యాపీగా ఫీలవుతున్న యామిని దగ్గరకు వచ్చిన వైదేహి ఏంటి బేబీ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు పైకి చెబితే మేము నవ్వుకుంటాము కదా అని అడుగుతుంది. పాపా ఆ కావ్య సాక్ష్యం సంపాదించడానికి వెళ్లింది. ఆ సాక్షిని నేను కనిపించకుండా దాచేశాను పాపం కావ్య ఏం చేయలేక ఇంటికి మళ్లిందట అందుకే నవ్వొస్తుంది మామ్.. ఇక ఆ అప్పు లైఫ్ క్లోజ్ మామ్. అది జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడవాల్సిందే..? అంటూ చెప్పగానే.. లేదు బేబీ ఆ కావ్యను తక్కువ అంచనా వేయకు. ఆ కావ్య పెళ్లి ఆపకుండానే ఈ పెళ్లి ఆగిపోతుందని చెప్పింది. అది చెప్పినట్టే పెళ్లి ఆగిపోయింది. అలా ఏం చేయకుండానే తను అనుకున్నది సాధించిన ఆ కావ్య ఏం చేసైనా సరే అప్పును కాపాడుకోలేదని గ్యారంటీ ఏంటి అంటూ వైదేహి అడుగుతుంది. దీంతో అది ఏం చేయలేదు మామ్. ఎందుకంటే అప్పును బయటకు తీసుకొచ్చే కీ నా దగ్గర ఉంది. ఆ కీ లేకుండా అది ఏమీ చేయలేదు.. నువ్వేం టెన్షన్ పడకు మామ్ నాకొంచెం బయట పనుంది వెళ్లొస్తాను అంటూ బయటకు వెళ్తుంది యామిని.
దుగ్గిరాల ఇంట్లో అందరూ వెయిట్ చేస్తుంటారు. రుద్రాణి కోపంగా అమ్మా సాక్ష్యం సంపాదించడానికి కావ్య బయటకు వెళ్లింది. తను వచ్చే వరకు మనం ఇలా వెయిట్ చేయడం ఏంటి..? తను వచ్చాక అందరం మాట్లాడుకోవచ్చు కదా అంటుంది. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. సాక్షి దొరికాడా.. అని అందరూ అడుగుతారు. కావ్య సైలెంట్‌గా ఉంటుంది. ఇంద్రాదేవి రాజ్ ను అడుగుతుంది. ఆ సాక్షి తమకు దొరకలేదు అని చెప్తాడు రాజ్. దీంతో కళ్యాణ్ బాధగా ఇప్పుడు ఏం చేద్దాం వదిన అని అడుగుతాడు. రేపటి వరకు టైం ఉంది కదా ఏదో ఒకటి ఆలోచిద్దాం అని చెప్తుంది కావ్య. రుద్రాణి, రాహుల్ నవ్వుకుంటారు.
శ్రీను అమ్మతో మాట్లాడాలి ఫోన్ ఇవ్వు అని అడుగుతుంటే.. యామిని వచ్చి ఫోన్ మాట్లాడొద్దు.. నువ్వు బయటకు కూడా వెళ్లొద్దు అంటుంది. నువ్వు నిజంగానే కిడ్నాప్ అయ్యావు అని చెప్తుంది. శ్రీను బయపడుతుంటే నీ కిడ్నాప్ రెండు రోజులు మాత్రమే అంటూ నీకు ఇస్తానన్న అమౌంట్ కన్నా రెండు లక్షలు ఎక్కువ ఇస్తాను అని నమ్మిస్తుంది యామిని. దీంతో శ్రీను సరే మేడం అంటాడు. మరోవైపు ఇంద్రాదేవి దేవుడి విగ్రహం ముందు నిలబడి రేవతి గురించి చెప్తూ బాధపడుతుంటే.. కావ్య వచ్చి వింటుంది. కావ్యను చూసిన ఇంద్రాదేవి షాక్ అవుతుంది.
ఏంటి అమ్మమ్మ గారు మీరేదో దాస్తున్నారు నాకు చెప్పండి అని అడుగుతుంది. దీంతో ఏం లేదు అని ఇంద్రాదేవి చెప్పగానే.. తాను ఇంద్రాదేవిని రేవతి ఇంట్లో చూశానని చెప్తుంది కావ్య. ఇంతకీ రేవతి ఎవరు..? ఆవిడకు ఈ ఇంటికి ఏంటి సంబంధం అని అడుగుతుంది. ఇంద్రాదేవి చెప్పకపోవడంతో కావ్య, అపర్ణన అడుగుతానని బయటకు వెళ్లబోతుంటే.. ఇంద్రాదేవి కంగారుగా కావ్యను ఆపేస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?