BigTV English

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 5000 కోట్ల సూపర్ హిట్ మూవీ… ఇంకా చూడలేదా ?

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 5000 కోట్ల సూపర్ హిట్ మూవీ… ఇంకా చూడలేదా ?

OTT Movie : ‘సూపర్‌మ్యాన్‌’ ఈ పేరు వింటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. జెర్రీ సీగెల్ అనే రచయిత, జో షస్టర్ అనే కళాకారుడు ఈ పాత్రను సృష్టించారు. వీళ్ళు ఈ పాత్రను 1933లో మొదటిసారిగా ఒక చిన్న కథలో పరిచయం చేశారు. కానీ సూపర్‌మ్యాన్ అధికారికంగా జూన్ 1938లో డిసి కామిక్స్ ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యాడు. అప్పట్నుంచి ఈ పాత్ర ఒక సంచలనమే. అయితే రీసెంట్ గా థియేటర్లలో సందడి చేసిన ‘సూపర్‌మ్యాన్’ సినిమా 5000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2025లో అత్యధిక వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము లేపుతోంది. ఈ స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఏ ఓటీటీలో ఉందంటే

‘సూపర్‌మ్యాన్’ DC కామిక్స్ రూపొందించిన ఒక అమెరికన్ సూపర్ హీరో చిత్రం. దీనికి జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. డేవిడ్ కోరెన్స్‌వెట్ సూపర్‌మ్యాన్‌గా, రాచెల్ బ్రోస్నహాన్, నికోలస్ హౌల్ట్, ఇసాబెలా మెర్సిడ్, నాథన్ ఫిలియన్ ముఖ్య పాత్రల్లో నటించారు. 2025 జులై 7న థియేటర్ లలో విడుదలైంది. ఆగష్టు 15 నుంచి Amazon Prime Video, Apple TV, Fandango లో స్ట్రీమింగ్ అవుతోంది. 129 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.8/10 రేటింగ్ ను పొందింది.


కథలోకి వెళ్తే

క్లార్క్ కెంట్, అలియాస్ సూపర్‌మ్యాన్ , మెట్రోపోలిస్‌లో డైలీ ప్లానెట్ జర్నలిస్ట్‌గా పనిచేస్తూ, సూపర్ హీరోగా ప్రజలను కాపాడుతుంటాడు. ఇక ఈ కథలో బొరావియా దేశం జర్హాన్‌పూర్‌పై దాడి చేయకుండా ఆపడంతో, అంతర్జాతీయ సంక్షోభం ఏర్పడుతుంది. ఇది బిలియనీర్ లెక్స్ లూథర్ కుట్రలో ఒక భాగంగా ఉంటుంది. ఈ కుట్రలను సూపర్‌మ్యాన్ ఎదుర్కునే క్రమంలో మొదటిసారి “హామర్ ఆఫ్ బొరావియా” అనే మెటాహ్యూమన్ చేతిలో ఓడిపోతాడు. ఇది లూథర్ సృష్టించిన అల్ట్రామ్యాన్ అనే క్లోన్. సూపర్‌మ్యాన్ డిఎన్ఏ తో దీనిని లూథర్ తయారుచేస్తాడు. సూపర్‌మ్యాన్ తన సూపర్‌డాగ్ క్రిప్టో సహాయంతో తప్పించుకుని ఆంటార్కిటికాలోని తన సీక్రెట్ హౌస్ కి వెళ్తాడు. అక్కడ అతని క్రిప్టోనియన్ తల్లిదండ్రులు జోర్-ఎల్, లారా లోర్-వాన్ ఒక సందేశం పంపుతారు. అయితే ఈ సందేశం లూథర్ వక్రీకరించి ప్రజల మనసులో సూపర్‌మ్యాన్ ను ఒక విలన్ గా చిత్రీకరిస్తాడు.

Read Also : చంపి, శవాలపై U గుర్తు చెక్కే సీరియల్ కిల్లర్… ఒక్కో కేసులో ఒక్కో ట్విస్ట్… థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

ఈ సందేశంలో సూపర్‌మ్యాన్‌ను భూమిని ఆక్రమించమని, క్రిప్టోన్ జాతిని పునర్నిర్మించమని ఉంటుంది. ఇక సూపర్ మ్యాన్ పై ప్రజలు విశ్వాసం కోల్పోతారు. ఇక అతను తన ప్రేమికురాలు లోయిస్ లేన్ కు తన ప్రేమను వ్యక్తం చేసి, అమెరికన్ ప్రభుత్వానికి లొంగిపోతాడు. ఆతరువాత వాళ్ళు అతన్ని లూథర్‌కు అప్పగిస్తారు. లూథర్ అతన్ని ఒక ఆర్టిఫిషియల్ పాకెట్ యూనివర్స్‌లో బంధిస్తాడు. అక్కడ మెటామార్ఫో తన చేతిని క్రిప్టోనైట్‌గా మార్చి సూపర్‌మ్యాన్‌ను బలహీనపరుస్తాడు. లోయిస్, మిస్టర్ టెరిఫిక్ సహాయంతో సూపర్‌మ్యాన్ తప్పించుకుంటాడు. లూథర్ కుట్రను లోయిస్, జిమ్మీ ఒల్సెన్ బయటపెడతారు. సూపర్‌మ్యాన్ అల్ట్రామ్యాన్‌ను ఓడించి, లూథర్‌ను అరెస్టు చేయిస్తాడు. ఇలా ఈ స్టోరీ ఎండ్ అవుతుంది.

Related News

Idli Kottu OTT: ధనుష్ ఇడ్లీకొట్టు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… పెళ్ళాన్ని లేపేయడానికి మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని ఫ్యూజులు అవుట్ అయ్యే పని… ఆ టెస్టుకు మాత్రం ఒప్పుకోని భర్త… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : కారు డిక్కీలో అమ్మాయి శవం… పోలీసుల రాకతో ఊహించని మలుపు… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఏళ్ల క్రితమే మిస్సైన సింగర్… అతను పాప్ సింగర్ కాదు సైకో పాత్… మైండ్ ను మడత పెట్టే హర్రర్ మూవీ

OTT Movie : చావడానికెళ్లి సీరియల్ కిల్లర్ చేతిలో అడ్డంగా బుక్కయ్యే అమ్మాయి… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : ప్రియుడితో సీక్రెట్ గా ఆ పాడు పని… భర్త ఎంట్రీతో మైండ్ బెండయ్యే ట్విస్టు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : లవ్ స్టోరీ నుంచి క్రైమ్ వరకు… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న మలయాళ సినిమాలు

Big Stories

×