BigTV English

Baby John OTT Release : 180 కోట్ల న్యూ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Baby John OTT Release : 180 కోట్ల న్యూ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Baby John OTT Release : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan), సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (keerthi Suresh) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబీ జాన్ (Baby Jhon). కలీస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మించాడు. పెన్ స్టూడియోస్, పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై రూ.180 కోట్లతో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన బేబీ జాన్… బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా సందడి చేయటానికి సిద్ధమైపోతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా త్వరలోనే అలరించనుంది.


2016లో రిలీజైన తమిళ బ్లాక్ బస్టర్ హిట్ తేరి మూవీకి రీమేక్‌గా రూపొందించిన చిత్రం బేబీ జాన్. ఈ సినిమాను అట్లీ కుమార్, జ్యోతి దేశ్‌పాండే, మురద్ ఖేతని, కృష్ణప్రియ నిర్మించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ గా విడుదలయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో హిట్ సాధించలేకపోయినా.. కలెక్షన్స్ పరంగా కూడా నిరాశే మిగిల్చింది. రిలీజ్ అయిన మొదటి నాలుగు రోజుల్లో ఇండియాలో రూ. 23 కోట్లు నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 60.4 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. ఇండియాలో రూ. 39.15 కోట్లు సాధించింది. అంటే బడ్జెట్ లో 20 శాతం వసూళ్లు మాత్రమే సాధించింది.

ఇక బేబీజాన్ ఓటీటీలో రిలీజ్ కు కొన్ని సమస్యలు ఎదుర్కుంటుందని ఇప్పటికే బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ తాజాగా బేబీజాన్ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతుంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)… బేబీ జాన్ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో ఓటీటీలో స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం.


ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ట్రీజర్, ట్రైలర్ సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. వరుణ్ ధావన్ ఇందులో ఇన్స్పెక్టర్ గా కనిపించాడు. ఇక కీర్తి సురేష్ బాలీవుడ్లో నటించిన ఫస్ట్ మూవీ ఇదే. బేబీ జాన్ సినిమా కథ విషయానికొస్తే.. మొదటి 40 నిమిషాలు అదిరిపోయేలా ఉందని.. ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాలు సినిమాకే హైలైట్ అని సినీ ప్రియులు చెప్పుకొస్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ సినిమాకే ప్రత్యేకంగా నిలిచాయని.. క్లైమాక్స్ లో తమన్ బీజీఎమ్ అదిరిపోయిందని చెప్పుకొస్తున్నారు.

ఇంటన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చేసిన ఈ సినిమా స్టోరీ కాస్త రొటీన్ గా ఉందని.. ఊహించినంతగా సీన్స్ లేవని… అందుకే అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందని తెలుస్తుంది. ఇక మిక్స్‌డ్ టాక్‌తో రన్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరింత మంది సినీ ప్రియులను అలరించడానికి సిద్ధమైపోతుంది.

ALSO READ : వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న బాలయ్య.. ఆమె కారణమా..?

Related News

Mothevari Love Story Review : మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ… లవ్ స్టోరీలో ఆస్తుల రచ్చ

OTT Movie : గ్రామీణ నేపథ్యంలో మరో వెబ్ సిరీస్ … పల్లెటూరి ప్రేమలు … ట్విస్టులతో సాగిపోయే లవ్ స్టోరీ

OTT Movie : నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులు

OTT Movie : మేడమ్ సార్ మేడమ్ అంతే… పెళ్లి వద్దంట, అది మాత్రమే ముద్దు… ఒకరి తరువాత ఒకరు

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు… నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా… తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్

Big Stories

×