E-Paper
Advertisement

నోట్‌బుక్ నుంచి మనుషులు బయటకొస్తే… పుస్తకం చేతులు మారడంతో మొదలయ్యే గందరగోళం…

నోట్‌బుక్ నుంచి మనుషులు బయటకొస్తే… పుస్తకం చేతులు మారడంతో మొదలయ్యే గందరగోళం…
Advertisement

Comedy Fantasy Movie: సాధారణంగా నోట్‌బుక్‌లో కథలు, పాత్రలు ఉంటాయి. కానీ అదే నోట్‌బుక్‌లో రాసిన పాత్రలు ఒక్కసారిగా ప్రాణాలతో మన కళ్లముందు కనిపిస్తే? ఇక జరిగే గందరగోళం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కామెడీ, ఫాంటసీ, క్రైమ్‌ను కలిపి తెరకెక్కించిన హిందీ సినిమా ‘Rahu Ketu’ ఇదే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. 2026 జనవరి 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో వరుణ్ శర్మ, పుల్కిత్ సామ్రాట్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. విపుల్ విగ్ దర్శకత్వం వహించారు. మరి ఆ మాయా నోట్‌బుక్‌లో అసలు ఏం ఉంటుంది? రాహు, కేతు నిజంగా ఎలా బయటకొస్తారు? నోట్‌బుక్ చేతులు మారిన తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటి? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

సాధారణంగా పుస్తకాల్లో ఉండే కథలు, పాత్రలు నిజ జీవితంలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే విచిత్రంగా ఉంటుంది. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ‘రాహు కేతు’. ఇందులో చురు లాల్ శర్మ అనే రచయిత అవినీతిపై పోరాడేందుకు ఓ మాయా నోట్‌బుక్‌ను తయారు చేస్తాడు. అందులో అతను సృష్టించిన ‘రాహు’, ‘కేతు’ అనే ఇద్దరు పాత్రలు అనుకోకుండా ప్రాణాలతో బయట ప్రపంచంలోకి వస్తాయి. అయితే వీళ్లేమీ పెద్ద హీరోల్లా తెలివైనవాళ్లు కారు, తెలివితక్కువ పనులు చేస్తూ తరచూ పొరపాట్లు పడే క్యారెక్టర్లు. దాంతో వాళ్ల చుట్టూ కథలో కామెడీ మొదలవుతుంది.

Advertisement

ఇదిలా ఉండగా, మీనూ ట్యాక్సీ అనే ఆకతాయి అమ్మాయి ఆ మాయా నోట్‌బుక్‌ను దొంగిలిస్తుంది. ఆ పుస్తకం ఆమె చేతుల్లోకి వెళ్లడంతో రాహు, కేతుల జీవితం, ప్రవర్తన అంతా ఆమె చేతిలోకి వెళ్ళిపోయి, వాళ్లపై ఆమెకు పూర్తి నియంత్రణ వస్తుంది. తమను సృష్టించిన ఆ మాయా పుస్తకాన్ని తిరిగి ఎలాగైనా చేజిక్కించుకోవాలని రాహు, కేతు పడరాని పాట్లు పడతారు. ఈ వెతుకులాట క్రమంలో వాళ్లు అనుకోకుండా ఒక పెద్ద డ్రగ్ మాఫియా గ్యాంగ్ వ్యవహారంలో ఇరుక్కుంటారు.

ఒకవైపు తమ ఆస్తిత్వానికి మూలమైన నోట్‌బుక్ కోసం వెతుకుతూ, మరోవైపు తమ వెనకాల పడిన డ్రగ్ మాఫియా నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్లు పడే తంటాలు నవ్వులు పూయిస్తాయి. ఈ గందరగోళ ప్రయాణంలో వాళ్లు తమలోని అసలైన శక్తులను, బాధ్యతలను ఎలా గుర్తించారు? చివరకు తమ నోట్‌బుక్‌ను తిరిగి సాధించి సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే ఈ సినిమా పూర్తి కథ.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

విపుల్ విగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ శర్మ రాహుగా, పుల్కిత్ సామ్రాట్ కేతుగా, షాలినీ పాండే మీనూ ట్యాక్సీగా నటించారు. పీయూష్ మిశ్రా, చంకీ పాండే, అమిత్ సియాల్, మను రిషి చద్దా తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. సినిమా నిడివి సుమారు 2 గంటల 17 నిమిషాలు. ఇది కామెడీ, ఫాంటసీతో పాటు క్రైమ్ అంశాలను కూడా కలిపిన ఎంటర్‌టైనర్. ప్రస్తుతం ‘Rahu Ketu’ Prime Videoలో రెంట్‌కు అందుబాటులో ఉంది. ఒరిజినల్ ఆడియో హిందీ, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. మాయా ప్రపంచం, విచిత్రమైన క్యారెక్టర్లు, క్రైమ్, ఫుల్ కామెడీ కలిసిన కథలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.

Related News

తండ్రే హత్య చేశాడని అనుమానం… షాకింగ్ మర్డర్ మిస్టరీ

చనిపోయినా ఇంటి నుంచి కదలని శవం… వణుకు పుట్టించే హారర్ మిస్టరీ

ఉద్యోగం కోసం ఇరాక్‌కు వెళ్లిన అమ్మాయి… ఊహించని పరిస్థితుల్లో ఉగ్రవాదుల చెరలో… నరాలు కట్టయ్యే సర్వైవల్ థ్రిల్లర్

25 ఏళ్లుగా పిచ్చి పనులతో నవ్వించిన గ్యాంగ్… ఈసారి చేసే రచ్చే చివరిదా?

60 ఏళ్ల వయసులో తన చిన్ననాటి రూపమే ఎదురైతే… గత జ్ఞాపకాలతో మొదలయ్యే అద్భుత ప్రయాణం… ఎమోషనల్ ఫాంటసీ యానిమేషన్

నాని ది ప్యారడైజ్ వచ్చేది ఈ ఓటీటీలోనే…స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

9 ఏళ్లుగా కనిపించని కూతురు కోసం తల్లి వెతుకులాట… దొరికిందనుకున్న వేళ చుట్టూ అనుమానితులు… గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×