E-Paper
Advertisement

దానం అనర్హతతో తొలి వికెట్ పడింది.. మరిన్ని పడటం ఖాయం.. కేటీఆర్ ధ్వజం!

దానం అనర్హతతో తొలి వికెట్ పడింది.. మరిన్ని పడటం ఖాయం.. కేటీఆర్ ధ్వజం!
Advertisement

KTR Remarks: దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు వంటిదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అనర్హత నుంచి తప్పించుకునేందుకు దానం నాగేందర్ చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని, హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సమర్థిస్తూ స్పష్టమైన నిర్ణయం వెలువరించిందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రజల మద్దతును కాజేయాలని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి భావించారని విమర్శించారు. ఫిరాయింపుదారులను స్పీకర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కాపాడుకోవచ్చని వారు భావించారని ఆరోపించారు.

సుప్రీంకోర్టు తీర్పుతో రాహుల్, రేవంత్ చేసిన ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్‌ ప్రజలు త్వరలో తమ తీర్పును ఇవ్వబోతున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. మూడు సంవత్సరాల మోసం, విఫలమైన హామీలు, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకపోవడం, పాలనా వైఫల్యాలపై ఖైరతాబాద్‌ ప్రజలు తమ తీర్పును చెప్పనున్నారని అన్నారు. దానం నాగేందర్‌ అనర్హతతో ఒక వికెట్‌ పడిందని ఇక ముందు మరిన్ని వికెట్లు పడనున్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎమ్మెల్యే దొంగ’ అంటూ విమర్శించారు.

Advertisement

మరోవైపు ఎన్నికల సంఘం తీరుపై కూడా కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈసీ.. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, ఎన్నికల సంఘం పనితీరును సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ముగ్గురిలో ఇద్దరు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది మెజారిటీ కాదా? ఇప్పటివరకు మెజారిటీ అంటే ఇదే కదా.. ఇప్పుడు దాని నిర్వచనం కూడా మారుతున్నట్టుందని ప్రశ్నించారు.

Also Read: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్లు!

Advertisement

ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చడం వంటి అంశాల్లో సందేహాలకు తావిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే.. ‘అసలు మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?’ అని కేటీఆర్ నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, పౌర సంఘాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు కలిసి ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో ఓట్ల తొలగింపులు బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో ఎక్కువ ఉండటం పట్ల కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు కుమ్మక్కు అవుతున్నాయని ఆరోపించారు.

Also Read: తల్లి, భార్య, కూతురు కోసం.. అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్‌లు.. జీరో రిస్క్, గ్యారెంటీ లాభం!

Tags

Related News

తిరుపతి పాలిటిక్స్‌లో రచ్చ.. సోషల్ మీడియా ప్రచారాలపై పులివర్తి సుధా రెడ్డి పైర్!

మేడ్చల్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్.. భారీగా ఎగిసి పడుతున్న మంటలు!

గద్వాల జిల్లాలో జోరుగా అక్రమ బెల్ట్ షాపుల దందా.. పట్టించుకోని అధికారులు..!

పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే మా లక్ష్యం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు!

హైదరాబాద్‌లో పండుగ పూట తీవ్ర విషాదం.. వైన్ షాప్ వద్ద దాడిలో వ్యక్తి మృతి!

సర్కార్ ఇచ్చే సన్న బియ్యంతో.. భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

మద్యం మత్తులో దాబా వద్ద హంగామా.. డీఈపై సస్పెన్షన్ వేటు!

బాచుపల్లిలో ఘోర ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థి దుర్మరణం!

Big Stories

Advertisement
×