Anaya Bangar: మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది అనయ బంగర్. ఈసారి తన మనసులోని మాటలను బయట పెట్టింది. కొందరు క్రికెటర్ల వ్యవహార శైలిని తీవ్రంగా దుమ్మెత్తి పోసింది. ఓ వెటరన్ క్రికెటర్ చెప్పిన మాటలు కొన్ని గుర్తు చేసింది. ఒకానొక దశలో ఆయన ‘స్లీప్ విత్ మి’ అని వ్యాఖ్యానించారని వెల్లడించింది. క్రికెట్‌లో జరుగుతున్న కీలక విషయాలు బయటపెట్టిందామె.
అనయ కామెంట్స్, ఆపై దుమారం
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన కొడుకు ఆర్యన్. ఈ మధ్య అమ్మాయిగా మారింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటోంది. ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది. తండ్రి సంజయ్ మాదిరిగా అనయ క్రికెటర్ కావాలని భావించింది. ఆర్యన్‌గా ఉన్న సమయంలో దేశ వాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఆ తర్వాత ఐసీసీ నిర్ణయంతో ఆటకు దూరమైంది.
రెండేళ్ల కిందట సరిగ్గా 2023 నవంబర్‌లో మహిళ క్రికెట్‌లోకి ట్రాన్స్‌జెండర్‌లకు అవకాశం లేదని ఐసీసీ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. దీంతో ఆటకు దూరమైంది అనయ. తాను అమ్మాయిగా ఉండాలని అనుకున్నానని మనసులోని మాట బయపెట్టింది.
యువ క్రికెట్లతో ఆడా
అబ్బాయిగా ఉన్న సమయంలో క్రికెట్ ఆడానని తెలిపింది. ప్రస్తుత యువ క్రికెటర్లు ముషీర్‌ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వారితో ఆడానని గుర్తు చేసింది. నా గురించి వారెవరికీ చెప్పలేదని పేర్కొంది. మా నాన్న అందరికీ తెలిసిన క్రికెటరని చెబుతూనే క్రికెట్ ప్రపంచం అభద్రత, విషపూరిత, పురుషత్వంతో నిండి ఉందని ఆరోపణలు గుప్పించింది.
ఇదే క్రమంలో కొందరు క్రికెటర్లు తనకు అసభ్యకరమైన ఫొటోలు పంపేవారు వివరించింది. తరచూ న్యూడ్ ఫొటోలు పంపి వేధించేవారని గుర్తు చేసింది. సరైన జెండర్‌గా లేనని ఎప్పుడు అనిపించిందన్న ప్రశ్నకు అనయ రిప్లై ఇచ్చింది. ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు మహిళల ధరించి అద్దంలో చూసుకున్నానని తెలిపింది.
న్యూడ్ ఫోటోలు పంపి వేధించేవారు
ఈ విషయం తెలిశాక ఒకప్పటి సహచర క్రికెటర్లు ఎలా స్పందించారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది అనయ. కొందరు తనకు మద్దతుగా నిలిచారని, మరికొందరు వేధింపులకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేసింది. కొందరు క్రికెటర్లు అసభ్యకరమైన ఫొటోలు పంపేవారని, తరచూ న్యూడ్ ఫొటోలు పంపి వేధించేవారని కాసింత ఉద్వేగానికి లోనైంది. అప్పటి ఆటగాళ్ల వ్యవహార శైలి గురించి వివరించింది.
వెటరన్ ‘స్లీప్ విత్ మి’
కొందరు అందరి ముందు తనకు మద్దతుగా మాట్లాడేవారని, ఎవరూ లేనప్పుడు తన పక్కనే కూర్చోమని, ఫొటోలు పంపమని అడిగేవాడని తెలిపింది. ఇండియాలో ఉన్నప్పుడు ఓ వెటరన్ క్రికెటర్‌కు తన పరిస్థితి గురించి చెప్పానని, సరే పద కారులో వెళ్దామని చెప్పాడని తెలిపారు. ఆ తర్వాత స్లీప్ విత్ మి అని అడిగాడని, మొదట్లో చాలా ఇబ్బందిపడ్డానని తెలియజేసింది. ప్రస్తుతానికి కొన్ని విషయాలు మాత్రమే బయటపెట్టింది అనయ. రాబోయే రోజుల్లో క్రికెటర్ల గురించి అనయ ఇంకెన్ని విషయాలు బయటపెడుతుందో చూడాలి.